క్రాస్ బోర్డర్ రొమాన్స్… లవ్… షాదీ… అందులోనూ హైప్రొఫైల్ క్రికెటర్ ప్లస్ టెన్నిస్ స్టార్… ఓ మంచి సినిమాకు కావల్సినంత కంటెంటు కదా మన సానియా మీర్జా, పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ కథ… పాపం శమించుగాక… ఆ పెళ్లే అంత స్పెషల్ కదా, నాలుగు రోజులు వాళ్లు కలిసే ఉండాలి అనుకుంటూనే ఉన్నాం కదా… ఆ ఇద్దరు సెలబ్రిటీలు, అదీ ప్రత్యర్థి దేశాలకు చెందిన ప్రఖ్యాత క్రీడాకారుల పెళ్లి సక్సెస్ కావాలనే కోరుకున్నాం కదా… కానీ ఆ ‘‘కలిసి ఉండటం’’ ఆగిపోయి, కథ ‘‘విడివిడిగా ఉండటం’’ దాకా వచ్చేసిందట…
పాకిస్థాన్ మీడియా, సోషల్ మీడియా అయితే కొంతకాలంగా వాళ్లిద్దరూ ఎవరు బతుకులు వాళ్లు బతుకుతున్నట్టు ప్రచారం చేసేస్తోంది… దీనిపై ఇటు సానియా గానీ, అటు షోయబ్ గానీ స్పందించడం లేదు, మాట్లాడటం లేదు… ఈ ఇద్దరికీ 2010లో పెళ్లయింది… 2018లో ఓ కొడుకు కూడా పుట్టాడు… అప్పుడే విడిపోయారా..?
నిజానికి సానియా ఇన్‌స్టాగ్రాంలో పెట్టిన ఓ మార్మికమైన పోస్టు మీడియా, సోషల్ మీడియా కథనాలకు ఆధారమైంది… పగిలిపోయిన గుండెలు ఆ దేవుడిని వెతకడానికి ఎక్కడికి వెళ్లాలి..? అన్నట్టుగా ఉంది ఆ పోస్టు… ఒక మోడల్‌తో షోయబ్ చిక్కటి సంబంధాలు, ఈమధ్య ఏదో షో కోసం వాళ్లిద్దరి ఫోటోషూట్ సానియాతో దూరం పెంచాయనీ, షోయబ్ సానియాను మోసగించాడనేది పాకిస్థానీ మీడియా కథనాల సారాంశం… ఈ పోస్టు అసలు ఉద్దేశం ఏమిటో అర్థం గాక… నిజంగా ఆ జంట కలిసే ఉంటోందా..? దూరం పెరిగిందా..? తెలుసుకోవడానికి ఆ ఇద్దరి బంధుగణం ప్రయత్నిస్తోంది…
Ads
రీసెంటుగా మరో పోస్టు పెట్టింది… అందులో కొడుకుతో ఉన్న ఫోటో… ‘‘కష్టంగా ఉన్న రోజుల్లో ఓ క్షణం’’ అన్నట్టుగా ఆ పోస్టు… నిజానికి ఈమధ్య షోయబ్, సానియా కొడుకు ఇజాన్ నాలుగో బర్త్‌డే వేడుకల్ని నిర్వహించారు… షోయబ్ ఆ ఫోటోల్ని ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసుకున్నాడు… కానీ సానియా ఆ బర్త్‌డే వేడుకలకు సంబంధించి ఏమీ షేర్ చేసుకోలేదు… ఇక్కడొక ప్రశ్న… విడివిడిగా ఉంటున్నట్టయితే కొడుకు బర్త్‌డేను ‘‘కలిసి అంత వేడుకగా’’ ఎలా నిర్వహించారు..?
పాకిస్థాన్‌లో కాస్త రీసెంట్ పాపులర్ క్రికెట్ ప్రోగ్రామ్ ‘‘ఆస్క్ ది పెవిలియన్… అందులో షోయబ్‌ను ‘‘సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలు, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో’’ చెప్పాల్సిందిగా అడిగారు… ‘‘నిజంగానే నాకు ఆ వివరాలేమీ తెలియవు’’ అన్నాడు షోయబ్… ‘‘వాటిల్లో ఏ అకాడమీకి కూడా నేను వెళ్లలేదు’’ అన్నాడు… షోయబ్ సమాధానం వకార్ యూనిస్‌ను ఆశ్చర్యపరిచింది… ‘‘నువ్వు ఎలాంటి భర్తవు..?’’ అనేశాడు… ప్రస్తుతానికి ఈ బ్రేకప్ ప్రచారం మాత్రం పాకిస్థాన్‌లో ఆగడం లేదు… ఇండియన్ మీడియాలో తక్కువే…
వీళ్లిద్దరి పెళ్లి 2010లో హైదరాబాద్ తాజ్ కృష్ణా హోటల్‌లో సంప్రదాయ హైదరాబాదీ ముస్లిం వివాహ పద్ధతుల్లో జరిగింది… తరువాత పాకిస్థాన్ పెళ్లి పద్దతుల్లో అక్కడా ఘనంగా నిర్వహించుకున్నారు… పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో వలీమా వేడుక నిర్వహించారు… ఎటొచ్చీ ప్రశ్న ఏమిటంటే… ఈ పెళ్లిబంధం పదిలంగా ఉన్నట్టేనా..?!
Share this Article