.
బిగ్‌బాస్ ప్రేక్షకులకు మాత్రమే… ఈ సీజన్ నిస్సారంగా, తిక్క ప్రయోగాలతో సాగుతోందని ముందే చెప్పుకున్నాం కదా… కామనర్స్‌కు అగ్నిపరీక్షలు, పైత్యాలు, నడుమ ఫైర్ స్టామ్స్ అంటూ ప్రవేశాలు… ఫెయిల్…
డెమోన్ పవన్, పడాల కల్యాణ్ మాత్రమే నిలబడ్డారు… వీరిలో కల్యాణ్ పీఆర్ టీమ్ బాగా పనిచేస్తోంది… ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏమిటంటే..? తనూజ ప్రతిసారీ (కెప్టెన్ అయినప్పుడు మినహా) నామినేషన్లలో ఉంటుంది, ప్రతిసారీ టాప్ వన్ వోటింగు ఉంటుంది తనకు అనఫిషియల్ వోటింగుల్లో…
Ads
ఆమె అందరినీ వాడుకుంటుంది, ఏడుపుతో సానుభూతి సంపాదిస్తుంది, నిలకడ ఉండదు, ష్రూడ్ ప్లేయర్ అని ఏవేవో ఇతర కంటెస్టెంట్ల పీఆర్ టీమ్స్ ప్రచారం చేస్తుంటాయి, ఆమెకు వోటింగు రాకుండా..! కానీ ఇప్పుడు కూడా తనే టాప్ వన్ వోటింగులో…
నిజానికి ఆమె అంత ష్రూడ్ ఆటగత్తె ఏమీ కాదు… అందరినీ నమ్ముతుంది… తన వెనుక కుట్ర చేసేవాళ్లను గుర్తించలేదు… పైగా ఎమోషనల్… పదే పదే ఇమాన్యుయెల్ ఆమెను నష్టపరచడానికి ప్రయత్నించినా సరే, నువ్వు నా నిజమైన ఫ్రెండ్‌విరా అంటుంది… ప్రత్యేకించి భరణితో నాన్న బాండింగ్ ఆమెకు నష్టం చేస్తున్నా, భరణి నమ్మదగని కేరక్టర్ అయినా , సాక్షాత్తూ బిగ్‌బాసే ప్రూఫ్స్ చూపించి చెప్పినా, ఆమె భరణిని నమ్ముతూనే ఉంటుంది…
తాజాగా ఓ సందర్భం చెప్పుకుందాం… అది సంజన చేసిన ద్రోహం గురించి, భరణి చెయ్యిచ్చిన తీరు గురించి… టికెట్ టు ఫినాలే పోటీలు జరుగుతున్నాయి… తనూజకు, సుమన్ శెట్టికీ నడుమ ఓ పోటీ… పైన ఏదో తొట్టిలో నీళ్లు పడేలా ఏర్పాటు, దిగువన వీళ్లు తాళ్లు పట్టుకుని నిలబడాలి… ఎవరు పోటీ నుంచి వైదొలగాలని అనుకుంటారో వాళ్లు వెళ్లి తొట్టిలో నీళ్లను మరింత నింపాలి…
1) సంజన నాలుగుసార్లు భరణిని పిలిచింది… తను తనూజకు వ్యతిరేకంగా ఉన్నాడని తెలిసీ, ఫస్ట్ పిలిచినప్పుడే అడ్డగోలుగా తనూజ పైన తొట్టిలో నీళ్లు భారీగా నింపాడని తెలిసీ… అక్కడున్న అందరినీ సమానంగా పిలవాలి గానీ, తనూజకు నష్టమని తెలిసీ పదే పదే భరణిని పిలవడం దేనికి..? అదీ కుట్ర… పైకి చూస్తే తనూజతో సాన్నిహిత్యం…
2) సుమన్ శెట్టి ఒక్కడైపోతాడు కాబట్టి తను తనూజకు వ్యతిరేకంగా వ్యవహరించాడట… భరణి తిక్క సమర్థన… నాన్న కూతురుకు పొడిచిన వెన్నుపోటు…
…….. అసలు ఎవరినైనా ఎన్నిసార్లయినా పిలవొచ్చు అనే బిగ్‌బాస్ సడలింపే పెద్ద కుట్ర… ఇక చూస్తూ ఉండండి, మొన్న సంజన టెంపర్‌మెంట్ విషయంలో కిందామీదా పడిన నాగార్జున వచ్చే వీకెండ్‌లో తనూజకు జరిగిన వెన్నుపోటు, ద్రోహం గురించి అస్సలు మాట్లాడడు…
నేను సారీ చెప్పను అని టెంపర్‌మెంట్ చూపించిన సంజన మీద ప్రేక్షకులకు కాస్త సానుభూతి పెరిగిందో లేదో తనూజకు ద్రోహంతో అదంతా పోగొట్టుకుంది… రీతూ చౌదరి హఠాత్తుగా వోటింగులో ఎందుకు మెరుగుపడిందో అర్థం కాదు… బహుశా ఎక్కాలు కూడా రాని మొద్దుతనం (20 డివైడెడ్ బై 20 అంటే 40 అని సమాధానం చెప్పింది) ప్రేక్షకులను నచ్చిందో, లేక జాలిపడ్డారో..!! ఈసారి డబుల్ ఎలిమినేషన్ పెట్టేసి… సుమన్ శెట్టి, డెమోన్ పవన్‌లను పంపించేస్తే ఓ పనైపోతుంది…
Share this Article