.
ఈసారి బిగ్‌బాస్ సీజన్‌లో ఇప్పటివరకు చూసిన ఆటను బట్టి…. మెచ్చి చప్పట్లు కొట్టాలనిపించింది సంజనా ఆటతీరును చూసి కాదు, ఆమె టెంపర్‌మెంట్ చూసి… టాప్ ఫైవ్‌లో చేరడానికి తనూజ, ఇమాన్యుయేల్, పడాల కల్యాణ్, భరణిలతోపాటు ఆమెకూ అర్హత ఉంది…
ఎందుకు అంటే..? మొన్న శనివారం వీకెండ్ షోలో అటు నాగార్జుననూ, ఇటు బిగ్‌బాస్ టీమ్‌నూ కలిపి తన మాటలతో ఈడ్చికొట్టింది సంజన… ఓ సినిమా నటి ఈ టెంపర్ చూపించడం విశేషమే… ఈ కారణంగానే ఈరోజు ప్రారంభమైన వోటింగులో ఏకంగా ఆమె తనూజ తరువాత సెకండ్ ప్లేసులోకి వచ్చేసింది…
Ads
జనం నవ్వుకుంటారనే సోయి కూడా లేకుండా పోయింది నాగార్జునకు ఓ హోస్టుగా… అఫ్‌కోర్స్, బిగ్‌బాస్ టీమ్ ఈసారి మరీ చిల్లర ప్రయోగాలకు వెళ్తూ వెళ్తూ… విఫలమవుతూ… సంజనను అంచనా వేయడంలో కూడా ఘోరంగా బోల్తాకొట్టింది… ఇక పూర్వాపరాల్లోకి వెళ్తే…
సంజనతో టీఆర్పీ రేటింగుల కోసం, వినోదం కోసం ఏవేవో దొంగతనాలు చేయిస్తోంది బిగ్‌బాస్ టీమ్… ఆటలో భాగమే అనుకుని భరిస్తోంది ఆమె… ఆమె ఎమోషన్స్‌తో, బాధతో అసలు సంబంధమే లేదు… అంతకుముందు ఓసారి ప్రేక్షకుల వోట్లను బట్టి గాకుండా… హౌజులో ఉన్నవాళ్ల వోట్లతో సంజనను ఎలిమినేట్ చేశారు…
తరువాత నలుగురు హౌజ్ మెంబర్లకు త్యాగాల పోటీ పెట్టి, సంజనను రిటెయన్ చేశారు… అదే ఓ దిక్కుమాలిన ఎలిమినేషన్… హౌజులో ఉన్నవాళ్లు బయటికి పంపించే పక్షంలో ఇక ప్రేక్షకుల వోటింగు ప్రక్రియలు దేనికి..? దానికి విలువ ఏమున్నట్టు..?
ఇక ఆ తరువాత ఆ నలుగురు హౌజు మెంబర్స్ మా త్యాగాల వల్లే నువ్వు ఆటలో కొనసాగుతున్నావు అన్నట్టుగా బిహేవ్ చేయడం మొదలుపెట్టారు… సంజన తన ఇగో చంపుకుని, నవ్వుతూ కనిపిస్తోంది కానీ, లోలోపల రగిలిపోతూనే ఉంది…
ఒక మొన్న శనివారం హఠాత్తుగా నాగార్జున ఓపెన్ ది డోర్ అనేసి, నువ్వు వెళ్లిపో అన్నాడు సంజనను… ఎందుకు..? ఈ ఆటలో రొమాంటిక్ టచ్ కోసం కావాలని బిగ్‌బాస్ రీతూ, డెమోన్ పవన్ నడుమ కావాలని ఓ లవ్ ట్రాక్ నడిపిస్తున్నాడు… వాళ్లు నటించమంటే ఏకంగా ఓ ప్రేమికుల జంటలా జీవించేస్తున్నారు…
ఎప్పుడూ ఏదో ఓచోట కలిసి కూర్చోవడం, ఒకరిలోకి ఒకరు ఒదిగిపోతూ… ప్రేక్షకులకు కూడా చిరాకు తెప్పిస్తున్నారు… (అఫ్‌కోర్స్… తనూజ- భరణి, దివ్య- భరణి నడుమ బాండింగ్ అదొక వెగటు యవ్వారం…) సరే, రీతూ, డెమోన్‌లను చూసి ఓసారి నామినేషన్ల సమయంలో సంజన బరస్ట్ అయిపోయింది… నాకు కంఫర్ట్‌గా లేదు అని ఆరోపించింది…
ఆమెకూ తెలుసు, బిగ్‌బాస్ దీన్ని కూడా రచ్చ చేస్తాడని..! అనుకున్నట్టుగానే నాగార్జున ఓపెన్ ది డోర్ అన్నాడు.,. (ఇవేవీ జరగవని అందరికీ తెలుసు… అంతకుముందు డెమోన్ పవన్‌ను కూడా ఇలాగే ట్రీట్ చేశాడు నాగార్జున… హౌజ్ అంత ఫెయిర్‌గా ఉండాలని అనుకుంటే, మొన్న కల్యాణ్ ఓ ఉన్మాదిలా బిహేవ్ చేశాడు కదా, వీకెండ్ షోలో ఆ ప్రస్తావన ఏది నాగార్జునా..?)

సంజనను సారీ చెప్పమంటాడు నాగార్జున… నా అభిప్రాయం నేను చెప్పాను, నేను అన్నమాటల్లో తప్పేముంది, నేను చెప్పను అని స్థిరంగా నిలబడింది సంజన… అంతేకాదు, నేను వెళ్లిపోతాను, పంపించేయండి అని చేతులు జోడించింది…
అటు పంపించలేడు నాగార్జున… దాంతో దాదాపు ఆమె కాళ్లావేళ్లా పడి… హౌజులోనే ఉంచేశాడు ఫాఫం… బిగ్‌బాస్ ఇజ్జత్ పోయింది… నిజంగా సంజన అన్నమాటల్లో తప్పులేదు… రీతూ, పవన్ యవ్వారం ప్రేక్షకులకూ చిర్రెక్కిస్తోంది… హౌజ్ సభ్యుల నడుమ కూడా ఈ చర్చ సాగుతూనే ఉంది…
ఛల్, జానేదేవ్ అనుకుని సంజన మొండిగా తన మాటల మీద నిలబడింది… సారీ కూడా చెప్పను అంది… నాగార్జున ఏవేవో కారణాలు, సాకులు చెప్పి, ఒకరకంగా బలవంతంగా ఆమెతో ఓ మొక్కుబడి సారీ చెప్పించి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు… తన పరువు పోగొట్టుకున్నాడు…
ఈ మొత్తం డ్రామా, ఎపిసోడ్‌తో సంజన వోటింగు భలే పెరిగిపోయింది… ఒకవైపు బలమైన పోటీదారు అనుకున్న సుమన్ శెట్టి వోటింగులో దిగజారిపోగా… సంజన ఎపిసోడ్‌లో విలన్లుగా మారిన డెమెన్, రీతూ చివరి స్థానాల్లో కొనసాగుతూ… బహుశా డబుల్ ఎలిమినేషన్ వైపు వెళ్తున్నట్టుగా ఉంది…!!
Share this Article