Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శోభన్‌బాబుకు నప్పలేదు, అచ్చిరాలేదు… జయప్రదే హైలైట్…

January 5, 2025 by M S R

.

.   (  దోగిపర్తి సుబ్రహ్మణ్యం  ) ..    … కన్నడంలో సూపర్ హిట్టయిన సనాది అప్పణ్ణ సినిమాకు రీమేక్ అక్టోబర్ 20 , 1980 న విడుదలయిన ఈ సన్నాయి అప్పన్న సినిమా . కన్నడంలో హిట్టయినట్లుగా మన తెలుగులో హిట్ అయినట్లు లేదు . ప్రముఖ నటుడు చలం నిర్మాత . మరాయనకు డబ్బులు వచ్చాయో లేదో !

సన్నాయి మేళం అనుకుని మాస్ ఆడియన్స్ దూరం అయ్యారు, క్లాస్ ఆడియన్స్ స్పందన కూడా కరువై ఈ చిత్రం వల్ల చలం చాలా డబ్బు నష్టపోయి, బహుశా తర్వాత ఏ సినిమా తీయలేదు, ఈ సినిమా అతని ఆర్ధికంగా బాగా దెబ్బ తీసింది, ఇది తర్వాత రన్స్ లో కూడా డబ్బు రాలేదు, B, C సెంటర్లలో ఓపెనింగ్స్ కూడా లేవు, అంత అపజయం పొందిన సినిమా…

Ads

కన్నడంలో రాజకుమార్ , జయప్రదలు ప్రధాన పాత్రల్లో నటించారు . మన తెలుగులో శోభన్ బాబు , జయప్రదలు నటించారు .

కన్నడ రచయిత కృష్ణమూర్తి పురనిక్ వ్రాసిన “కుణియతు హెజ్జె నలియితు గజ్జె” నవల ఆధారంగా మొదట కన్నడంలో సినిమాగా తీయబడింది . కర్నాటకలో 1876-1945 పీరియడ్లో ప్రముఖ షెహనాయ్ విద్వాంసుడు అప్పన్న జీవిత కధ ఆధారంగా తీయబడింది .

50 వారాలు ఆడిందట కర్నాటకలో . బహుశా కధ అక్కడ ప్రాంతానికి సంబంధించింది కావటం వలన కన్నడ ప్రేక్షకులు ఆదరించి ఉంటారు . Of course . మన తెలుగు సినిమా కన్నా కన్నడ సినిమా చాలా బాగుంది .

సన్నాయి కళాకారుడు ఓ నాట్యరాణి పందెంలో ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు . నాట్యరాణి తల్లి కూతురిని ఓ మైనర్ బాబుకి సమర్పించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది . అప్పన్న , నాట్యరాణి పెళ్లి చేసుకుంటారు . మగ బిడ్డను కని తల్లి చనిపోతుంది . తన బిడ్డను మాత్రం సన్నాయి విద్వాంసుడిని చేయవద్దని మాట తీసుకుంటుంది .

అప్పన్న కష్టపడి కొడుకుని గొప్ప. వాడిని చేస్తాడు . కొడుకు తండ్రిని తండ్రి అని చెప్పుకోవటం నామోషిగా ఫీలవుతాడు . కొడుకు ఇంట్లో నౌకరుగా ఉండిపోతాడు . మనమరాలికి దగ్గరవుతాడు . క్లైమాక్సులో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిన అప్పన్న చావుబతుకుల్లో ఉన్న మనమరాలిని రక్షించి చనిపోవటంతో సినిమా ముగుస్తుంది . ఓ సన్నాయి విద్వాంసుడి జీవిత కధ ఈ సినిమా .

ముఖ్యంగా ఈ సినిమా హైలైట్ షెహనాయ్ వాయిద్య సంగీతం . జగద్విదిత షెహనాయ్ విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ స్వయంగా వాయిద్య సంగీతాన్ని అందించటం గొప్ప విశేషం . శోభన్ బాబు ఇలాంటి తండ్రి పాత్రలో ఇంతకుముందే తాసిల్దారు గారమ్మాయి , కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త వంటి సినిమాల్లో నటించారు . సన్నాయి విద్వాంసుడిగా చక్కగా నటించారు . సినిమా సగం వరకే ఉండే జయప్రద తన అందంతో , నృత్య కౌశలంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది .

ఈ సినిమాకు హైలైట్స్ జయప్రద నృత్యాలే . వాస్తవానికి టైటిల్ పాత్రధారి సన్నాయి హైలైట్ కావాలి . కానీ సాధారణ ప్రజలకు వాయిద్య సంగీతం తెలియదు . గాత్రం , నృత్యం సామాన్యులని అలరిస్తాయి . మొత్తం మీద జయప్రద నాట్యరాణి పాత్ర , ఆమె సుకుమార సౌందర్యం డామినేట్ చేసేసాయి .

కన్నడంలో సంగీతాన్ని అందించిన జి కె వెంకటేషే తెలుగు సినిమాకు కూడా సంగీతాన్ని అందించాడు . పాటలకు ఎంత గొప్ప సంగీతాన్ని అందించాడో అంతే గొప్పగా బేక్ గ్రౌండ్ మ్యూజిక్కుని అందించాడు . చాలా చాలా శ్రావ్యంగా ఉంటుంది . సంగీత ప్రియులు బ్రహ్మాండంగా ఆస్వాదిస్తారు .

దేవులపల్లి , ఆత్రేయ , వీటూరి పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , యస్ జానకిలు గాత్రాలను అందించారు . దేవులపల్లి వ్రాసిన కరిగించు ఈ కలికి హృదయం పాటలో జయప్రద నృత్యం , సన్నాయి వాద్య సంగీతం అద్భుతంగా ఉంటాయి .

వీటూరి వ్రాసిన అణువు అణువు హరివిల్లు అంతరంగమె వెన్నెల జల్లు పాటలో కూడా జయప్రద నృత్యం కన్నులపండుగగా ఉంటుంది . ఆత్రేయ వ్రాసిన సన్నాయి రాగానికి ఈమె నాట్యానికి పాట చాలా శ్రావ్యంగా అమరింది . ఆయన వ్రాసిందే అనురాగం దివ్యరాగం ఆనందం జీవనాదం పాట కూడా చాలా బాగుంటుంది . మొత్తం మీద ఈ సినిమా ఓ మ్యూజికల్ , క్లాసికల్ పీస్ .

చాలా పాత్రలు ఉంటాయి . ముఖ్యంగా చెప్పుకోవలసింది హీరోయిన్ తల్లి పాత్రను వేసిన సుకుమారి . సుమారు 2,500 సినిమాల్లో నటించిందట . పదో ఏట నటన మొదలుపెట్టిన ఈమె పద్మశ్రీ పురస్కార గ్రహీత . నూతన్ ప్రసాద్ , మాడా , ఈశ్వరరావు , సంగీత , చలం , కవిత , ప్రభాకరరెడ్డి , పండరీబాయి , అల్లు రామలింగయ్య , సూర్యకాంతం , సత్యనారాయణ , ధూళిపాళ , త్యాగరాజు , ఇంకా చాలా మందే ఉన్నారు .

రెండు సినిమాలూ యూట్యూబులో ఉన్నాయి . మన తెలుగు సినిమాతో పాటు పాటల వీడియోలు కూడా ఉన్నాయి . రసహృదయులు , వాయిద్య సంగీత ప్రియులు ముఖ్యంగా షెహనాయ్ ప్రియులు , కళారాధకులు , జయప్రద అంద పిపాసులు అస్సలు మిస్ కాకూడని సినిమా .

సినిమా చూసినా చూడకపోయినా పాటల వీడియోలు పొరపాటున కూడా మిస్ కాకండి . రస హృదయులు కాని వారు సినిమాను చూసే ప్రయత్నం చేయకండి . స్లోగా ఉండే ఈ సినిమా నచ్చాలంటే సున్నిత , సుకుమార , రస హృదయం ఉండాలి . A musical , visual piece . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అందరూ రాజ్‌పుష్పలు కాలేరు పుష్పా… అనవసర ప్రయాస, అగౌరవం…
  • సాక్షిలో చైనా సరుకు..! ఈ కరణ్ థాపర్ ఘొప్ప వ్యాసం చెప్పేది ఇదే..!
  • ఒక ధర్మబద్ధ ఫ్యూడల్ నియంత..! ఒక బొబ్బిలి బ్రహ్మన్న పాత్ర…!
  • ఓ ధూర్త శతృవు… ఓ మూర్ఖ ప్రధాని… ఈ తరం చదవాల్సిన కథ…
  • ఎద్దులతో ఓ జంట అనుబంధం…! తమిళ సినిమాకు కాదేదీ కథకనర్హం..!
  • ఈ సైకో రేపిస్ట్ ఎన్ని హత్యాచారాలు చేస్తేనేం… ఇంకా బతికే ఉన్నాడు…
  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!
  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions