.
తెలుగు సినిమా మరీ పూర్తిగా హీరోక్రటిక్, మసాలా ఒరవడిలో కొట్టుకుపోతున్నదనేది నిజమే కానీ… కొందరు దర్శకులు కొత్త, సున్నితమైన అంశాలను కూడా టేకప్ చేసి, ఏమాత్రం అశ్లీలం, అసభ్యత లేకుండా డీల్ చేస్తున్నారు… ఇది నాణేనికి మరో కోణం…
ఉదాహరణకు… సంతానప్రాప్తిరస్తు అనే సినిమా… తీసుకున్న కాన్సెప్టు, స్టోరీ లైన్ మంచివే… దాన్ని బలంగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడి తడబాట్లు కనిపించినా… స్థూలంగా ఓ సున్నితమైన సబ్జెక్టును భలేగా డీల్ చేశాడనిపిస్తుంది… ఇంకొన్ని విశేషాలూ ఉన్నాయి…
Ads
- అందరూ తెలుగు నటీనటులే… స్కిన్ షో కోసం గానీ, అనవసర పాపులారిటీ కోసం గానీ వేరే భాషల నుంచి ఎవరినీ తీసుకోలేదు… అది నచ్చింది…
- సాధారణంగా పిల్లలు పుట్టడం లేదు ఓ జంటకు అంటే… వెంటనే భార్య మీద నింద మోపుతారు… సినిమాల్లో అయితే హీరో అంటే హీరోయే… వాడికి మైనస్ పాయింట్లు పెట్టరు, జనం అంగీకరించరు అనే భావనతో…
- కానీ ఇందులో స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండి, సంతానం కలగని ఓ వంధ్య యువకుడి కథ తీసుకున్నారు… ఇంట్రస్టింగు…
నిజానికి ఇది ఈమధ్య చాలామంది యువకుల్లో కనిపిస్తున్న సమస్యే… రకరకాల కారణాలు… దాన్ని కాస్త వినోదాన్ని, మరికాస్త ఎమోషన్‌ను కలగలిపి చెప్పాలనుకున్నాడు దర్శకుడు… పర్లేదు… ఇదేకాదు, కొంతకాలంగా ఐవీఎఫ్, స్పెర్న్ డోనర్ వంటి అంశాలూ తెలుగు సినిమా కథల్లోకి చేరాయి, ఆసక్తికరంగానే తెరకెక్కిస్తున్నారు…
ఈ సినిమాలో విక్రాంత్ హీరో, చాందినీ చౌదరి హీరోయిన్… ఓ సాదా సీదా ప్రేమ కథ… కాకపోతే ఎంతకూ పిల్లల్లేకపోతే ఆయా కుటుంబాల్లో సమస్యలు వస్తుంటాయి కదా… ఇదీ అంతే… హీరో మేల్ ఇన్‌ఫెర్టిలిటీ (వంధ్యత్వం)ని హీరో దాచుకోలేడు, చెప్పుకోలేడు… కుటుంబంలో వచ్చిన సమస్యలేమిటి అనేదే కథ…
పిల్లలు పుడితే తమ ప్రేమ వివాహాన్ని అమ్మాయి తండ్రి అంగీకరించేసి, క్షమించేస్తాడులే అనుకుంటారు ఆ జంట… (సమాజంలో కనిపిస్తున్న ధోరణే)… ఈ నేపథ్యంలో అమ్మాయి తండ్రి వచ్చి, హీరోకు సవాల్ విసురుతాడు… లేకపోతే బిడ్డను విడదీసి వేరే పెళ్లి చేస్తానంటాడు… సరే, కథెలా ముగిసిందనేది వేరే సంగతి…
నటీనటుల నటన…: చైతన్య పాత్రలో విక్రాంత్ మెప్పించాడు… చాందినీ చౌదరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది… కళ్యాణి తండ్రిగా మురళీధర్ గౌడ్ పాత్ర, నటన చాలా బాగుంది… ఎటొచ్చీ హీరోయిన్‌కు డబ్బింగ్ పెట్టడమే సరికాదు…అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్, మురళీధర్ గౌడ్‌తో వచ్చే సన్నివేశాలు కొంతవరకు నవ్విస్తాయి…
మైనస్ పాయింట్స్
-
రొటీన్ లవ్‌స్టోరీ…: హీరో-హీరోయిన్ల పరిచయం, ప్రేమ సన్నివేశాలు పాత పద్ధతిలో రొటీన్‌గా అనిపిస్తాయి…
-
స్క్రీన్ ప్లే…: ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా, సాగదీసినట్లు ఉంటుంది… మెయిన్ పాయింట్ (సంతాన సమస్య) మొదలయ్యేసరికి సగం సినిమా అయిపోతుంది…
-
ఎమోషన్…: సినిమాలో కామెడీపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల, భావోద్వేగ సన్నివేశాలను మరింత బలంగా చూపించడంలో దర్శకుడు కొంతవరకు విఫలమయ్యాడని అనిపిస్తుంది….
మరీ డబ్బు తగలేసి, థియేటర్ దోపిడీకి తలొగ్గి, దీన్ని థియేటర్లలోనే చూడండి అని సజెస్ట్ చేయలేం కానీ… ఓటీటీలో లేదా టీవీలో వచ్చినప్పుడు ఓసారి చూడొచ్చునేమో…!!
Share this Article