Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సర్దార్… ఆ పేరుంటే చాలు సర్దార్ పాపారాయుడు కాలేడు కదా…

June 18, 2025 by M S R

.

Subramanyam Dogiparthi…. కృష్ణంరాజు గారి మరో రెబెల్ సినిమా ఈ సర్దార్ సినిమా . సార్ధక బిరుదుదారుడు . స్వాతంత్ర్య పోరాటంతో ప్రారంభమమయి స్వతంత్ర భారతంలోని సంఘ విద్రోహులను చట్టానికి అప్పచెప్పే కధాంశం . కధను వ్రాసిన భీశెట్టి లక్ష్మణరావు కట్ & పేస్ట్ ఫార్ములాలో తయారు చేసినట్లుగా ఉంటుంది .

1984 లో వచ్చిన ఈ సినిమాకు స్క్రీన్ ప్లే , దర్శకత్వ బాధ్యతలను దాసరి శిష్యుడు నందం హరిశ్చంద్రరావు వహించాడు . రావు గోపాలరావు సహకార దర్శకుడు ఈ సినిమాకు . ఘాట్ రోడ్ లాగా చాలా మలుపులు తిరుగుతుంది .

Ads

స్వాతంత్ర్య పోరాటంలో అసువులు బాసిన యోధుడి కుమారుడు హీరో కృష్ణంరాజు . జైలర్ ఉద్యోగం . జైలరుగా సంస్కరణవాది , మానవతావాది . ఖైదీలకు ఆహారం సప్లయి చేసే కాంట్రాక్టరు , (వి)నాయకుడు సత్యనారాయణతో వచ్చిన విభేదం.  జైలర్నే హత్యానేరం మోపి ఆ జైలుకే రావలసి వస్తుంది .

జైలు నుంచి పారిపోయి తీవ్రవాది సర్దార్ అవుతాడు . సర్దార్ని పట్టుకోవటానికి అతని ప్రియురాలు జయప్రదే నియమించబడుతుంది . క్లైమాక్సులో షోలే సినిమాలో లాగా హీరోని కట్టేస్తే జయప్రద , కవితలు డాన్సులు చేసి విలనాసురుల ఆట కట్టించి మెయిన్ విలనాసురుడు సత్యనారాయణని చట్టానికి అప్పగించడంతో సినిమా ముగుస్తుంది . సినిమాను సుఖాంతం చేసి మంచి పని చేసారు .

అక్కడక్కడ యన్టీఆర్ సర్దార్ పాపారాయుడు సినిమా గుర్తుకొస్తుంది . స్వాతంత్ర్య సమరయోధుడి భార్యగా , హీరో తల్లిగా శారద నటించింది . ఇలాంటి పాత్రలు ఆమెకు కొట్టిన పిండే . సర్దారుగా కృష్ణంరాజుకీ ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే . ఎడం చేతితో చేయగలడు , అలాగే చేసాడు . ప్రియురాలిగా జయప్రద గ్లామర్ స్పేసుని అందంగా ఫిల్ చేసింది , అందంగా డ్యూయెట్లు పాడింది .

ఇతర ప్రధాన పాత్రల్లో సత్యనారాయణ , కవిత , కాంతారావు , హేమసుందర్ , చలపతిరావు , గిరిబాబు , ప్రభాకరరెడ్డి , ఎర్ర నారాయణమూర్తి , త్యాగరాజు , ప్రభృతులు నటించారు .

సినిమా కనీసం ఎబౌ ఎవరేజుగా రాణించడానికి దోహదకారి సంగీత దర్శకుడు చక్రవర్తి . పాటలన్నీ వేటూరి వారే వ్రాసారు . డ్యూయెట్లు అన్నీ బాగుంటాయి . మనసొక పాడిన పాట , చిలిపి చైత్రమాసమా , పంచాంగం చూడొద్దురోయ్ , పోరా పోరా సూరీడా పోకిరి కళ్ళ సూరీడా , ఆకురాయి చేతిలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి .

డైలాగులను పరుచూరి బ్రదర్స్ వ్రాసినా పదును కాస్త తగ్గిందేమో అనిపిస్తుంది . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . రాజు గారి అభిమానులు , జయప్రద అభిమానులు చూసి ఉండకపోతే ట్రై చేయండి. It’s an action oriented , romantic , feel good movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

(2022 లో కార్తి నటించిన సినిమా టైటిల్ కూడా సర్దార్… రాశీఖన్నా ఎట్సెట్రా నటించారు… పెద్దగా ఆడలేదనుకుంటా… కాకపోతే అది స్పై థ్రిల్లర్ జానర్… ఇదే పేరుతో అదే 1984లో హిందీలో కూడా ఓ సినిమా వచ్చింది… అంజాద్ ఖాన్ నటించినట్టు గుర్తు…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రక్తి – భక్తి … కన్నప్ప సరే, ఆ మూడు సినిమాలనూ ఓసారి పరిశీలిద్దాం…
  • తండ్రి బతుకంతా ఆకలి పోరాటమే… కొడుకు ఇప్పుడు ఫేమస్ స్టార్…
  • హైదరాబాద్‌లో ఏఆర్ రెహమాన్ కచేరీ… కానీ కళ్లు తిరిగే రేట్లు అట..!!
  • బ్లాక్‌మెయిల్ టాక్టిస్‌తో రష్యా, చైనా వైపు అమెరికాయే ఇండియాను నెట్టేస్తోందా..?
  • ఇంగ్లిషు సబ్జెక్టులే అయినా… అడాప్షన్‌లో మెళకువ ఉంటేనే సక్సెస్సు…
  • వజ్రభూమి… Land Of Diamonds… చివరకు మిగిలేది దుమ్మూధూళే…
  • ADHD … స్టార్ ఫహాద్ ఫాజిల్‌కు ఓ అరుదైన ఆరోగ్య సమస్య…
  • ఇది 1 + 2 కాదు… 1 + 3 కూడా కాదు… ఏకంగా 1 + 6 ఫార్ములా…
  • నేత ప్రాణాలే ముఖ్యం… విధిలేక సొంత భర్త ప్రాణాలే తీసేసింది…
  • ‘వానెక్క’ విజయ్ మస్తు చేసిండు… సత్యదేవ్‌తో కలిసి సైన్మా నిలబెట్టిండు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions