Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యాంకర్ సుమ ఇజ్జత్ కోల్పోయినచోట… సింగర్ సునీత పద్ధతిగా తలెత్తుకుంది…!

January 1, 2024 by M S R

ఒకరు తెలుగులో అత్యంత ఫేమస్ యాంకర్, హోస్ట్ సుమ… హీరోయిన్లకు దీటుగా సంపాదించే పాపులర్ సెలబ్రిటీ… మరొకరు ఫేమస్ సీనియర్ తెలుగు సినిమా సింగర్ సునీత… ఆమే ఓ హీరోయిన్‌లా కనిపించే పాపులర్ సెలబ్రిటీ… రీసెంట్ న్యూస్‌లో ఇద్దరికీ ఓ పోలిక ఉంది, ఇద్దరి నడుమా బీభత్సమైన తేడా ఉంది…

పోలిక ఏమిటంటే..? ఇద్దరూ తమ కొడుకుల్ని హీరోలుగా లాంచ్ చేశారు… సుమ కొడుకు రోషన్… సునీత కొడుకు ఆకాశ్… ఇద్దరూ నిజానికి హీరో మెటీరియల్ కాదు… ఇద్దరినీ అర్జెంటుగా హీరోల్ని చేయాలని తాపత్రయపడ్డారే గానీ మన లేడీ సెలబ్రిటీలు ముందుగా నటనలో బేసిక్స్ మీదనైనా శిక్షణ ఇప్పించాలని అనుకోలేదు… ఈ కుర్ర కొత్త హీరోలిద్దరూ దాదాపు సేమ్ రేంజ్…

సుమ ఇండస్ట్రీలో తన పరిచయాలన్నీ ఉపయోగించి, సినిమాకు ప్రమోషన్ చేయించి, ఓ బజ్ లేదా ఓ హైప్ క్రియేట్ చేయగలిగింది… సునీత ఇంకాస్త ఎక్కువ… ఆమె రెండో మొగుడు మ్యాంగో రామ్‌కు ఇండస్ట్రీలో ఓ పొజిషన్ ఉంది… అంతేగాకుండా ఈ సినిమాకు డబ్బులు పెట్టింది రాఘవేంద్రరావు… ఈ సినిమాకు కూడా కావల్సినదానికన్నా ఎక్కువ బజ్ వచ్చింది… గుడ్…

Ads

సుమ యమర్జెంటుగా తన కొడుకును అర్జున్‌రెడ్డి లెవల్‌లో లాంచ్ చేయాలనుకుంది… యూత్ ట్రెండ్ అంటేనే వెగటు, బూతు అనుకుంది… అందుకే ఈ సినిమా బబుల్‌గమ్ నిండా వెగటు డైలాగులు, వెగటర్ సీన్లు, వెగటెస్ట్ ధోరణి కనిపిస్తుంది… వాటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది… ఎహె ఫోవమ్మా సుమా… అంటూ ప్రేక్షకులు ఘోరంగా సినిమాను తిరస్కరించారు… మనకు తెలిసిన సుమ తీయించిన సినిమానే ఇది అని జనం ఆశ్చర్యపోయారు… ఈ సినిమాలో సుమ తనకున్న ఓ పద్ధతైన సెలబ్రిటీ అనే మంచి పేరును కూడా కోల్పోయింది… తన పేరు రోషన్, హృతిక్ రోషన్ కాదమ్మా… సీన్ కట్ చేస్తే…

సునీత కొడుకు సినిమా ‘సర్కారు నౌకరి’… ఆ బబుల్‌గమ్ సినిమా నిజానికి రాఘవేంద్రరావు మార్క్ సినిమాయేనా..? ఎవరో తన అసిస్టెంట్‌కు డబ్బులిచ్చేసి, సినిమా తీయించి ఉంటాడు… లేదా తన పేరును ఉదారంగా వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఉంటాడు… ఈ సినిమాకు సంబంధించి రాఘవేంద్రరావు ప్రస్తావన అంతే… దీనికీ ఓ కొత్త దర్శకుడు… అనుభవ లేమి కనిపిస్తోంది… అయితే సుమ కొడుకు సినిమాకు పూర్తి కంట్రాస్టుగా ఓ మెడికల్, సోషల్ ఇష్యూతో వచ్చింది సునీత కొడుకు సినిమా…

అస్సలు వాణిజ్య విలువల జోలికి పోకుండా… వెగటుతనం వీసమెత్తు లేకుండా నీట్‌గా, పిచ్చి ట్విస్టులేమీ లేని స్ట్రెయిట్ రియలిస్టిక్ సినిమా… కాకపోతే ఎయిడ్స్ ప్రచారం కోసం వైద్య ఆరోగ్య శాఖ తీయించిన డాక్యుమెంటరీ టైప్… హీరో సోసో… హీరోయిన్ సోసో… ప్రేక్షకుడిని కనెక్ట్ చేసే అంశాలేమీ లేవు… కథ మంచిదే కానీ కనెక్టయ్యేలా దర్శకుడు దాన్ని తీయలేకపోయాడు… హీరో కూడా మైనసే… ఈ సినిమా కూడా తన్నేసినట్టే… ఈ తరానికి ఈ కథ నచ్చదు, ఈ స్టయిల్ ప్రజెంటేషన్ అస్సలు నచ్చదు… ఇక ఆ సినిమా ప్లస్సులు, మైనస్సుల సమీక్ష కూడా అనవసరం…

సో, ఇద్దరు టాప్, సీనియర్, ఫిమేల్ తెలుగు సెలబ్రిటీల ఇద్దరు కొడుకులూ లాంచింగులో ఫ్లాప్… బట్, సుమ ఓ తలతిక్క సినిమాను ప్రేక్షకుల మీదకు రుద్దింది… సునీత మెరుగైన కథాంశాన్ని ఫెయిర్‌గా ప్రేక్షకులకు సమర్పించింది… సుమకు కంట్రాస్టు సునీత… అయితే ఇద్దరు కొడుకులు, రెండు సినిమాలకు సంబంధించి ఇద్దరూ సాధించింది సేమ్… కాకపోతే సుమ ఇజ్జత్ కోల్పోయింది… సునీత పద్ధతిగా తలెత్తుకుంది…!!

 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మిస్టర్ కీరవాణీ… ఈ వారణాసి లవ్ సాంగ్ వీడియో నువ్వైనా చూశావా..?
  • బాగా మగ్గిన అరటి పండు కేన్సర్‌ కణాల్ని చంపేస్తుందా..? నిజమేంటి..?
  • ఈ తెలంగాణ ద్వేషి అస్సలు మారడు… మళ్లీ అదే విద్వేష ప్రదర్శన..!!
  • బిగ్‌బాస్..! బహుశా ఫైనల్స్‌లో తనూజ, ఇమ్మూ, పడాల, భరణి, రీతూ..!!
  • వ్యక్తిపూజ- ఫ్యానిజం… ఆంధ్రా కింగ్ తాలూకా… కాదు, ఓ హీరో ఫ్యాన్ తాలూకా…
  • హనుమాన్ చాలీసా టాప్ రికార్డు… ఇవీ ఇండియాలో టాప్ 10 వీడియోలు..!
  • బురద… బూడిద..! ఆలు లేదు, చూలు లేదు… అప్పుడే వేల కోట్ల స్కాములట..!!
  • ముగ్గురు కొడుకులు… కాదు, కాదు… ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ…
  • 26/11 …. మరిచిపోలేని ఒక నిజ భారత రత్నం… కొన్ని బొగ్గు కేరక్టర్లు…
  • బీసీ సీట్లపై బీఆర్ఎస్ ఫేక్ ప్రాపగాండా..! నిజాలేమిటో ఓసారి చూద్దాం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions