Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సర్పయాగం..! ఈ హిట్ సినిమా కథ వెనుక ఓ నిజజీవిత కథ…!!

November 15, 2025 by M S R

.

కాల్పనిక సినిమా కథల ప్రభావం సమాజంపై.., సమాజం తీరు ప్రభావం సినిమా కథలపై ఖచ్చితంగా ఉంటుంది… ఉండదని అనుకుంటేనే మూర్ఖత్వం…

అప్పట్లో శోభన్ బాబు సినిమా సర్పయాగం… దీనికి ఓ ఒరిజినల్ తండ్రి కథ ప్రేరణ… కాదు, దాదాపు అదే కథ… సినిమా కాబట్టి కామెడీ ట్రాకులు, ఇతర కమర్షియల్ అంశాల్ని జొప్పించారు… ఒక్కసారి ఆ ఒరిజినల్ కథలోకి వెళ్దాం… అక్కడక్కడా దొరికిన సమాచారం మేరకు…

Ads


.
ప్రకాశం జిల్లా, ఒంగోలులో కంచి కోదండ రామిరెడ్డి అలియాస్ టిప్ టాప్ రెడ్డి అనే వ్యక్తి… డ్రై క్లీనింగ్ షాపు… తన బిడ్డను అపురూపంగా పెంచుకున్నాడు… ఆ కాలంలోనే అల్ట్రా మోడ్రన్‌గా పెంచాడు… స్వేచ్ఛను ఇచ్చాడు… ఒంగోలు హైదరీ క్లబ్‌లో టెన్నిస్ నేర్చుకునేందుకు చేర్పించాడు…

అక్కడ సింగ్ అనే  కోచ్‌… కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్… కాదు, ఆమె అలా భ్రమపడింది… కానీ వాడిది కామం… ఆ పిల్లపై కన్నేశాడు… తన ఫ్రెండ్స్ ఆర్టీసీ డీఎం కొడుకు, నెల్లూరుకు చెందిన ఇంకొకడితో కలిసి ఆ పిల్లను కొత్తపట్నం బీచ్‌కి తీసుకెళ్లారు…

అక్కడ బీర్‌లో మత్తు మందు కలిపి, అమ్మాయి చేత తాగించారు… తర్వాత, ముగ్గురూ కలిసి దారుణంగా అత్యాచారం చేసి, అక్కడే వదిలేసి వెళ్లిపోయారు… తర్వాత అమ్మాయి ఇంటికొచ్చింది… జరిగిన విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు…

నాలుగో రోజు ఓ లేఖ రాసి, అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది… ఆత్మహత్య లేఖలో… ‘‘నాన్నా, నాపై చాలా దారుణంగా ముగ్గురు కలిసి అత్యాచారం చేశారు.. వాళ్లను వదలొద్దు’’ అని రాసింది… ఈ లెటర్ సంగతి తండ్రి ఎవరికీ చెప్పలేదు… కడుపులో దాచుకున్నాడు… లోలోపల తనలో పగ రగులుతోంది…

ఆ పిల్లను పాడుచేసిన సింగ్ అనుకోకుండా పోలీస్ కానిస్టేబుల్‌గా సెలెక్టయ్యాడు… దర్శికి ట్రైనింగ్‌కు వెళ్లిపోయాడు… ఆర్టీసీ డీఎం తన కొడుకు ప్రవర్తన సరిగా లేకపోవడంతో నెల్లూరు జిల్లా కావలిలోని జవహర్ భారతి డిగ్రీ కాలేజీలో చేర్పించాడు…

టిప్ టాప్ రెడ్డి తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డవారిని తనే శిక్షించాలని నిర్ణయం తీసుకున్నాడు… గుంటూరు వెళ్లాడు… శ్రీనివాస్, చైతన్య ఇద్దరు యువకులను కలిశాడు… నా కూతురి బలవన్మరణానికి కారకులను శిక్షిస్తా, నాకు సాయం చేయండి అనడిగాడు… మీకు ఏం కావాలో చెప్పండి చేస్తాను అన్నాడు…

ఆ ఇద్దరినీ ఓ ఇంట్లో ఉంచాడు… కొద్దిరోజులు ఆ ఇద్దరు అక్కడి పరిస్థితులను అధ్యయనం చేశారు… కాపేశారు… ఆ అమ్మాయిని పొట్టనపెట్టుకున్న వాళ్లు ఎవరెవరు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో మొత్తం స్కాన్ చేశారు…

కానిస్టేబుల్‌గా సెలెక్టయిన సింగ్‌తో ఫ్రెండ్‌షిప్ చేశారు… తర్వాత, ఓ రోజు ట్రైనింగ్ కోసం సింగ్ దర్శి వెళ్తుండగా… అతడిని మోటార్ సైకిల్‌పై ఎక్కించుకున్నారు… ఒక స్పాట్ దగ్గరకు వెళ్లాక… అక్కడ టిప్ టాప్ రెడ్డి, అప్పటికే గొయ్యి తీసిపెట్టి రెడీగా ఉన్నాడు… అక్కడికి వచ్చిన వెంటనే… ‘‘నా కూతుర్ని ఇలా చేస్తావా’’… అంటూ సింగ్ మెడను ఉచ్చుతో బిగించి చంపేసి, ఆ గోతిలో వేసి పూడ్చేశారు… వాడి పేరెంట్స్ కూడా ట్రైనింగ్‌కు వెళ్లాడనే అనుకున్నారు…

రెండో వాడు ఆర్టీసీ డీఎం కొడుకు… కావలిలో డిగ్రీ చేస్తున్నాడు… ఈ ఇద్దరు యువకులు కావలి వెళ్లి, అతడితో దోస్తీ చేశారు… వాడికి మందు అలవాటుంది… అలా కలిసి ముగ్గురూ మందు పార్టీలు చేసుకునేవారు… ఒకరోజు హాస్టల్‌‌‌కు ఓ స్కూటర్‌పై వెళ్లారు… కరేడు అనే సముద్రతీర గ్రామంలో పార్టీ చేసుకుందాం రమ్మన్నారు… రేపు పరీక్షలు, ఇప్పుడేం పార్టీలురా అని వాడి ఇతర స్నేహితులు వారించినా సరే, మద్యం వాడిని పార్టీకి వెళ్లమని ప్రేరేపించింది…

వాడి రూమ్మేట్‌కు ఏదో డౌటొచ్చి, ఆ స్కూటర్ నంబర్ నోట్ చేసి పెట్టాడు… ముగ్గురూ స్కూటర్‌పై బయల్దేరారు… కరేడు దగ్గర రాజుపాలెం అనే గ్రామం….  టిప్ టాప్ రెడ్డి గొయ్యి తీసి రెడీగా ఉన్నాడు… వీళ్లు రాగానే, సింగ్‌ను చంపిన మాదిరిగానే… ఈ యువకుడిని కూడా గొంతు పిసికి చంపేసి… గోతిలో పాతిపెట్టేశారు…

ఆర్టీసీ డీఎం తన కొడుకు కనిపించడం లేదని గొడవ చేయడం మొదలుపెట్టాడు… ఇదే సమయంలో తమ కొడుకు సింగ్ కనిపించడం లేదంటూ అతడి తల్లిదండ్రులు దాదాపు నెల రోజుల తర్వాత ఫిర్యాదు చేశారు… నెల రోజులుగా ట్రైనింగ్ సెంటర్‌లో ఆబ్సెంట్ ఉండటంతో అనుమానం వచ్చింది…

  • ఏం జరిగిందీ అని పూర్తి స్థాయి విచారణ చేపట్టారు… అప్పుడు స్కూటర్ నంబర్ దొరికింది… ఆ స్కూటర్ చెంచురామయ్య అనే ఓ డాక్టర్‌ది..! తనను విచారిస్తే… స్కూటర్ తనదేనని, టిప్ టాప్ రెడ్డి తీసుకెళ్లాడని చెప్పాడు… వెంటనే టిప్ టాప్ రెడ్డి దగ్గరికి వెళ్లి విచారించారు, తను అసలు నిజం ఒప్పుకున్నాడు…

హత్యలు చేసింది తానేనని టిప్ టాప్ రెడ్డి ఒప్పుకున్నాడు… ‘‘సార్, ఒక్క రోజు టైం ఇస్తే… ఇంకొకడున్నాడు, వాడిని కూడా చంపేసి వస్తా, అప్పుడు ఉరి తీస్తారో, ఇంకెలా శిక్షిస్తారో మీ ఇష్టం’’ అని ప్రాధేయపడ్డాడు పోలీసులను…

తరువాత విచారణలో తేలింది ఏమంటే… ఆ అమ్మాయిపై అత్యాచారం చేసింది ఇద్దరే… ఆ ఇద్దరినీ ఆ పిల్ల తండ్రి శిక్షించేశాడు… మూడో వ్యక్తి మాత్రం ఆ అత్యాచారంలో పాల్గొనలేదు… అలా కేసు నుంచి తప్పించుకున్నాడు… తరువాత..?

  • టిప్ టాప్ రెడ్డి చాలా కాలం జైల్లో ఉన్నాడు… బయటికొచ్చాడు… ఒంగోలులో సీతారాములకు ఓ దేవాలయం కట్టించి అక్కడే ఉంటున్నాడు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సర్పయాగం..! ఈ హిట్ సినిమా కథ వెనుక ఓ నిజజీవిత కథ…!!
  • మైథిలి ఠాకూర్..! బీహార్ బరిలో ఓ జానపద స్వరం భాస్వరమై..!!
  • నితిశ్ ఇక తోక జాడించలేడు..! బీజేపీకి ఈసారి ఫుల్ ‘బీహారీ ఖుషీ’ ఇదే…
  • కాంత..! తెలుగు ప్రేక్షకుడికి కనెక్ట్ కాని ఓ తొలితరం సూపర్ స్టార్ కథ..!
  • బీజేపీ అట్టర్ ఫ్లాప్ షో..! రీజన్స్ ఏమిటి..? బాధ్యులు ఎవరు..?
  • అరయగ కర్ణుడీల్గె…! కేటీయార్ ఓటమి… జనంలోకి రాని కేసీయార్ ఓటమి..!!
  • గెలిచింది రేవంత్…! ఓడింది కేటీయార్…! ఓ కొత్త కాంగ్రెస్ కనిపించింది…!!
  • దేశం రక్షింపబడింది..! మరింత బీమార్ గాకుండా రాష్ట్రమూ రక్షింపబడింది…
  • దీనక్క పాటలో సొంగకారిన పదాలు… దీనక్క ఏం రాస్తున్నారు భయ్యా…
  • ‘శ్రీబాగ్ భవన్’ అలా కాపాడబడింది… ఆ రక్షణ వెనుక కూడా ఓ కథ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions