.
టీవీ ప్రసారాల వెలుగు తగ్గుతోందా? అద్దం పడుతున్న తాజా గణాంకాలు! కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తున్న వివరాలే ఇవి… ఎకనమిక్ టైమ్స్ కవర్ చేసింది…
టీవీ తెర మసకబారుతోంది… డిజిటల్ ప్రాభవం పెరిగేకొద్దీ టీవీల ముందు గంటలకుగంటలు కూర్చునే అలవాటు తగ్గిపోతోంది ప్రేక్షకులకు…. ఒకవేళ కూర్చున్నా సరే, ఓటీటీ కంటెంటు చూస్తున్నారు… సినిమాలు, వెబ్ సీరీస్, రియాలిటీ షోలు అన్నీ ఓటీటీల్లోనే… టీవీలే కాదు, ట్యాబ్‌లు, మొబైల్ ఫోన్లలోనే ఆ వీక్షణం ఎక్కువ…
Ads
ఆ వార్త సారాంశం ఏమిటంటే..? భారతదేశంలో లీనియర్ టీవీ (Linear TV) రంగం ప్రస్తుతం ఒక క్లిష్టమైన సంధి కాలంలో ఉంది… గత మూడేళ్లలో దాదాపు 50 టీవీ ఛానళ్లు తమ లైసెన్సులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయడం ఇప్పుడు మీడియా రంగంలో చర్చనీయాంశంగా మారింది…
ఏం జరుగుతోంది?
జియోస్టార్ (JioStar), జీ (Zee), ఎన్డీటీవీ (NDTV), ఏబీపీ (ABP) వంటి దిగ్గజ సంస్థలు కూడా తమ కొన్ని ఛానళ్లను మూసివేయడమో లేదా లైసెన్సులను వదులుకోవడమో చేస్తున్నాయి… ముఖ్యంగా పే-టీవీ (డబ్బులు చెల్లించి చూసే ఛానళ్లు) సబ్‌స్క్రైబర్ల సంఖ్య భారీగా పడిపోతోంది…
-
- FY19: 7.2 కోట్లుగా ఉన్న సబ్‌స్క్రైబర్లు…
-
FY24: 6.2 కోట్లకు తగ్గారు…
-
FY26 నాటికి: ఇది 5.1 కోట్ల కంటే తక్కువకు పడిపోవచ్చని అంచనా…
ఈ మార్పుకు ప్రధాన కారణాలు ఏమిటి?
ఈ పరిస్థితికి దారితీసిన ముఖ్యమైన కారణాలను ఇలా విశ్లేషించవచ్చు…
-
డిజిటల్ విప్లవం (OTT & Connected TVs)..: మధ్యతరగతి, సంపన్న కుటుంబాలు కేబుల్ టీవీని వదిలేసి నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి OTT ప్లాట్‌ఫారమ్‌ల వైపు మళ్లుతున్నారు… మనకు నచ్చిన సమయంలో, నచ్చిన చోట చూసే సౌలభ్యం డిజిటల్‌లో ఉండటమే దీనికి కారణం… నచ్చిన సీన్లను రిపీటెడ్‌గా చూడటం, నచ్చనిచోట స్పీడ్‌గా స్కిప్ చేయడం కూడా ఓ కారణమే… ఆపి, ఆపి ఎన్నిసార్లయినా పాజ్ చేసుకునే వీలుండటం…
-
ఆదాయం తగ్గడం (Ad Revenue Decline)…: ప్రకటనలు ఇచ్చే కంపెనీలు ఇప్పుడు టీవీల కంటే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి… 2025లో టీవీ ప్రకటనల ఆదాయం 1.5% మేర తగ్గుతుందని అంచనా…
-
ఉచిత సేవల వైపు మొగ్గు (DD Free Dish)..: తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు డబ్బులు కట్టి ఛానళ్లు చూసే కంటే, దూరదర్శన్ వారి ‘ఫ్రీ డిష్’ వైపు వెళ్తున్నాయి… దీనివల్ల పే-టీవీ ఛానళ్లకు వచ్చే ఆదాయం దెబ్బతింటోంది…
-
అధిక నిర్వహణ ఖర్చులు..: హై డెఫినిషన్ (HD) ఛానళ్లను నడపడం, లైసెన్స్ ఫీజులు చెల్లించడం, కంటెంట్ తయారీ ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల ఛానళ్లు ఆర్థికంగా భారంగా మారుతున్నాయి… ఉదాహరణకు, ఏబీపీ న్యూస్ తన HD ఛానల్‌ను మూసివేయడానికి ఇదే ప్రధాన కారణం…
- తెలుగులో ఈటీవీ, స్టార్ మా, జీటీవీ…: జెమిని సన్ నెట్‌వర్క్ వంటి బలమైన గ్రూపులో భాగమైనా దాని ఉనికే ప్రశ్నార్థకంగా మారింది… మాటీవీ, జీటీవీ రెండూ దేశంలోని అత్యంత బలమైన మీడియా గ్రూపులో ఉన్నాయి… ఈటీవీ కూడా కొన్ని చానెళ్లను అప్పట్లోనే రిలయెన్స్ వాళ్లకే అప్పగించేసింది… ఇవి తప్ప ఇన్నేళ్లలో కొత్తగా ఒక్క వినోద చానెల్ రాలేదు… వచ్చే చాన్స్ కూడా లేదు…
ముగింపు… ప్రేక్షకుల అభిరుచులు మారడం, సాంకేతికత అప్ డేట్ అవ్వడంతో బ్రాడ్‌కాస్టర్లు కూడా తమ వ్యాపార వ్యూహాలను మార్చుకుంటున్నారు…. లాభం లేని ఛానళ్లను మూసివేసి, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల మీద పెట్టుబడులు పెట్టడమే దీనికి పరిష్కారమని వారు భావిస్తున్నారు…
అలాగని ఓటీటీలు వెలిగిపోతున్నాయా..? లేదు, వాటి సమస్యలూ బోలెడు... ఆ బుడగలు గనుక పేలిపోతే అప్పుడు మళ్లీ శాటిలైట్ చానెళ్లు వెలిగిపోతాయా..? ఇదీ డిబేటబుల్ క్వశ్చన్..!!
Share this Article