Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈమధ్య కాలంలో వచ్చిన క్షమించరాని సినిమా ఆదిపురుష్

May 14, 2024 by M S R

Subramanyam Dogiparthi…..   ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా, పతిదేవుని పద సన్నిధి మించినది వేరే కలదా, అదే సతి పెన్నిధి కాదా, అదే పరమార్ధం కాదా … పేరంటాలలో , పెళ్ళిచూపుల్లో వీర పాపులర్ అయిన పాట . 1971 లో బి ఏ సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన సతీ అనసూయ సినిమాలో పాట ఇది . సతీ అనసూయ కథలో సతీ సుమతి కథ కూడా కలిసి ఉంటుంది . 1971 సినిమాలో అనసూయగా జమున , సుమతి/నర్మదగా శారద నటించారు . శోభన్ బాబు నారదుడిగా , కాంతారావు అత్రి మహర్షిగా , సత్యనారాయణ కౌశికుడిగా నటించారు .

సతీ అనసూయ టైటిల్ మీద తెలుగులో మొత్తం నాలుగు సినిమాలు వచ్చాయి . 1957 లో వచ్చిన సినిమాలో అనసూయగా అంజలీదేవి నటిస్తే , సుమతిగా జమున నటించింది . అత్రి మహర్షిగా గుమ్మడి , కౌశికుడిగా NTR నటించారు . ఈ సినిమాకు ధర్శకుడు కన్నాంబ భర్త నాగభూషణం . పద్మనాభం నారదుడిగా నటించారు .

1935 లో వచ్చిన సినిమాలో దాసరి కోటిరత్నం , లీలాకుమారి , తుంగల చలపతిరావు , లక్ష్మణస్వామి ప్రభృతులు నటించారు . 1936 లో వచ్చిన సినిమాలో కృష్ణవేణి ప్రభృతులు నటించారు .

Ads

ఇలా సతీ అనసూయ , సతీ సావిత్రి , సతీ సక్కుబాయి కధాంశాలతో 1970s వరకు సినిమాలు వచ్చాయి . ప్రేక్షకులూ ఆదరించారు . ఆ తర్వాత కాలంలో ఈ పతి దేవాయ నమః సందేశాలను ఆదరించే రోజులు పోయాయి . అయితే ఈరోజుకీ రామాయణం , భారతం , భాగవతం కధలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు . NTR , బాపు వంటి గొప్ప దర్శకులు చక్కటి చిత్రాలను అందించారు . ఈమధ్య కాలంలో వచ్చిన క్షమించరాని సినిమా ఆదిపురుష్ .

మళ్ళా మన 1971 సినిమాకొస్తే ఘంటసాల సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగానే ఉంటాయి . సినిమా బాగా ఆడింది కూడా . త్రిమూర్తుల సతీమణులు పతివ్రతలను పరీక్షించే ఇతివృత్తంతో ఈ కధలూ , సినిమాలు ఉంటాయి . 1971 , 1957 రెండు సినిమాలూ యూట్యూబులో ఉన్నాయి . ఆసక్తి కలవారు చూడవచ్చు . చూడతగ్గట్లు గానే ఉంటాయి రెండూ .

#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిత్యం వార్తల్లో బొద్దింకలు ! రాహుల్‌ను సైడ్‌లైన్ చేసేందుకు బీజేపీ ప్లాన్ !!
  • తిలక్ వర్మ రనౌట్ స్వీయ తప్పిదమే… కానీ వెస్టిండీస్ క్రీడాస్పూర్తి !?
  • వేకువ ఝామున వెన్నెల మరకలుగా… రేపటి వాకిట ముగ్గులుగా…
  • క్రాంతికుమార్ – తెలుగు సినిమా కథల ప్రయోగాల సాహసి !!
  • 3 Statues Of Liberty – మూడు విగ్రహాలకూ ‘విముక్తి’ అంతఃసూత్రం !!
  • ఆంధ్రా తూర్పు తీరాన్ని.. నువ్వుల తీరం అనీ పిలిచారని తెలుసా ?
  • ఓ అమెరికన్ గ్రౌండ్ జీరో ! మరి తెలంగాణ ‘గ్రౌండ్ జీరో’ మాటేంటి..?!
  • ఎన్టీయార్, దిలీప్‌కన్నా శివాజీ గణేశన్‌తోనే ఆ పాత్రకు న్యాయం !!
  • ఒక ఫోన్ కాల్ … ఒక అరెస్ట్ … వార్త పంపాక మొదలైన అసలు టెన్షన్…
  • దేశంలోనే మొట్టమొదటిసారి ఒక విలేకరిపై టాడా కేసు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions