బూతుల జబర్దస్త్ షోకు శ్రీదేవి డ్రామా కంపెనీ షోను పెద్ద భిన్నంగా చూడలేం… అవే పిచ్చి పంచులు, వెకిలి కామెడీ… కాకపోతే కొన్ని భిన్నమైన కాన్సెప్టులతో కొన్ని ఎపిసోడ్లు రన్ చేస్తున్నారు… అవి బాగుంటున్నయ్… మంచి రేటింగ్స్ వస్తున్నయ్… అవును, ఆ కామెడీ కళ తగ్గిన ఢీ షోకన్నా ..! ఉదాహరణకు నిన్నో మొన్నో వుమెన్స్ డే సెలబ్రేట్ చేస్తూ కమెడియన్ల అక్కాచెల్లెళ్లను, అమ్మలను పిలిచి, వాళ్లతోనూ పర్‌ఫామ్ చేయించారు… ప్రేక్షకుడికి బాగానే కనెక్టయింది… దీనికి యాంకర్ సుడిగాలి సుధీర్, జడ్జి ఇంద్రజ… అంతకుముందు ఎపిసోడ్‌లో వెటరన్ యాక్టర్స్‌ను పిలిచి సత్కరించారు… సరదాగా బాగుంది…
షో మీద కాస్త సదభిప్రాయం కలిగేలా ఇంద్రజను అమ్మా అమ్మా అని సుధీర్ పిలవడం, ఆమె నా కొడుకు అంటూ సుధీర్‌ను ఓన్ చేసుకోవడం వరకూ బాగుంది… పైగా ఇంద్రజ నవ్వులో వెకిలితనం ఉండదు… కాస్త ప్లజెంటుగానే ఉంటుంది… సుధీర్ సరేసరి… వాళ్లు ఇద్దరూ ఆ షోకు ఆక్సిజెన్… సో, ఇంకా వీళ్లపై పేరడీలు, స్పూఫులు చేసి వెక్కిరించడం లేదేమిటబ్బా… జబర్దస్త్ అంటేనే ఆ చిల్లర అభిరుచి ఉండాలి కదా అనుకుంటూనే ఉన్నారు ప్రేక్షకులు… వచ్చేసింది…
Ads
తాజా ప్రోమో ప్రకారం… ఎక్సట్రా జబర్దస్త్ షోలో ఇంద్రజ పాత్రలో రోహిణి, సుధీర్ పాత్రలో పొట్టి నరేష్… కాస్త వెటకారం దట్టించాలి అనుకున్నారు, ఏదో కష్టపడ్డారు, కానీ పేలలేదు… తోకపటాకులా కూడా టప్‌మనలేదు… పైగా అదేదో చేయబోయి నరేష్ నడుం విరగ్గొట్టుకున్నాడు… పనిలోపనిగా న్యూట్రల్ లుక్ కోసం రోజా, మనో పాత్రల్ని కూడా పెట్టి చిన్న స్కిట్ ప్లాన్ చేశారు, అది మరీ ఘోరంగా ఉంది…
అన్నట్టు మనో ఏదో పనిలో పడ్డాడు… లేదా తనను కూడా మల్లెమాల వాళ్లు తరిమేశారేమో… వెళ్లగొట్టడం అంటే వాళ్లకు తమషా కదా… ఆమని వచ్చి జడ్జి కుర్చీలో సెటిలైంది… ఏమాటకామాట మనోకన్నా ఆమనే నయం… ఇంద్రజలాగే కాస్త చూడబుల్ ఫేసు, నవ్వు కూడా ప్లజెంటుగా ఉంటుంది… హేమిటో… బయటి ఎవరి మీద కామెడీ కామెంట్స్, పంచులు వేసినా ఎదురుతంతున్నయ్… మరేం చేయాలి… జడ్జిల మీద, కంటెస్టెంట్ల మీద, యాంకర్ల మీద వాళ్లలోవాళ్లే పంచులు వేసుకోవాలి, బాడీ షేమింగ్ చేసుకోవాలి, తన్నుకోవాలి… జరుగుతున్నది అదే…!!
Share this Article