ఎప్పుడైనా సందేహం వచ్చిందా..? రామాయణంలో రాముడి వెంట లక్ష్మణుడు వనవాసానికి వెళ్తాడు, లంకేయులతో యుద్ధం చేస్తాడు, ఓ కీలక పాత్ర… రాముడి పేరిట రాముడు తిరిగి వచ్చేవరకు రాజ్యపాలన చేస్తాడు భరతుడు… మరి శతృఘ్నుడు..? ఎక్కడా ఏ రామాయణంలోనూ పెద్దగా పేరు వినిపించని పాత్ర… నిజంగా శతృఘ్నుడి కేరక్టరైజేషన్ ఏమిటి..? తన కథేమిటి..?
లక్ష్మణుడికి కవలసోదరుడు… రాముడికి విధేయుడు… మంచి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్నవాడు… అందుకే రాముడి లేని అయోధ్యలో నేను ఉండను ఉంటూ భరతుడు బయట ఆశ్రమం కట్టుకుని జీవిస్తుంటే… మొత్తం అయోధ్య రాజ్యభారాన్ని, యంత్రాంగాన్ని శతృఘ్నుడే సంభాళిస్తాడు… ఆ పద్నాలుగేళ్లు ఆ ముగ్గురు తల్లులకు శతృఘ్నుడే ఊరట, ఓదార్పు…
జనకరాజు తమ్ముడు కుశధ్వజుడి బిడ్డ శృతకీర్తి శతృఘ్నుడి భార్య… తనకు ఇద్దరు కొడుకులు సుబాహు, శతృఘటి… మంథర వల్లే రాముడి వనవాసం అనే కోపంతో… కైకేయి ఆనందంగా ఇచ్చిన నగలు, విలువైన చీరెలు ధరించి మంథర తిరుగుతుంటే, ఓ దశలో శతృఘ్నుడు ఆమెను చంపబోతాడు… కైకేయి అభ్యర్థన మేరకు భరతుడు వారిస్తాడు… స్త్రీ హత్య మంచిది కాదనీ, రాముడు కూడా హర్షించడు అని చెప్పడంతో తగ్గిపోతాడు…
Ads
ఇంతేనా..? శతృఘ్నుడి పాత్ర మొత్తం రామాయణంలో ఇంతేనా..? కాదు… రావణుడికి కుంభిణి అనే సోదరి ఉండేది… ఈమె భర్త పేరు మధు… వీళ్లకు లవణాసురుడు అనే కొడుకు… తను శివుడి తపస్సు చేసి, ఓ మహత్తు కలిగిన త్రిశూలాన్ని వరంగా పొందుతాడు… అది తన చేతిలో ఉన్నంతకాలం తనను ఎవరూ ఓడించలేరు… ప్రజాకంటకంగా మారిన లవణాసురుడిని హతమార్చాలని రామలక్ష్మణులు తలపెట్టినప్పుడు, తనకు ఆ అవకాశం ఇవ్వాలని శతృఘ్నుడు కోరుకుంటాడు…
యుద్ధంలో విష్ణు అంశతో కూడిన అస్త్రాన్ని సంధించి శతృఘ్నుడు ఆ లవణాసురుడిని హతమారుస్తాడు… శతృఘ్నుడిని ఆ మధు పాలించిన రాజ్యానికి పాలకుడిగా నియమిస్తాడు… ఆ రాజ్యం పేరు మధుపుర… తరువాత కొన్నాళ్లకు శతృఘ్నుడు ఆ రాజ్యాన్ని రెండుగా… మధుపుర, విదిశగా విభజించి, తన కొడుకులిద్దరినీ పాలకులుగా నియమించి… సరయూ నదిలోకి వెళ్లి, మహావిష్ణువులో కలిసిపోతాడు… తను విష్ణువు చేతిలోని శంఖం కదా…
ఇక్కడ మనం చెప్పుకునేది ఏమిటంటే..? రాముడికి ఎన్నో గుళ్లు… హనుమంతుడికి ఊరూరా గుడి… రావణుడికి కూడా గుళ్లు… మరి శతృఘ్నుడికి..? తనకు కూడా మూడు గుళ్లున్నాయి…. 1) కేరళ, త్రిసూర్ జిల్లా, పాయమ్మాళ్ 2) రిషికేశ్ దగ్గర మునికీ రేతి 3) యూపీలోని మధుర, కన్స్‌తిల… ఈ మొత్తం కథలో పెద్దగా ప్రాముఖ్యం లేని పాత్ర ఎవరూ అంటే… శతృఘ్నుడి భార్య శృతకీర్తి…!!
Share this Article