Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి… నన్ను ఎవరో చూచిరి, కన్నె మనసే దోచిరి…

March 13, 2024 by M S R

Subramanyam Dogiparthi…….  చాలా మంచి సినిమా . సినిమాలను విషాదాంతం , ప్రశ్నార్ధకం చేయడంలో ఆనందం పొందే ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన feel good movie . దయతో సుఖాంతం చేసారు . ప్రసాద్ ఆర్ట్స్ బేనర్లో 1969 లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గానే కాకుండా ప్రేక్షకుల మెప్పు కూడా పొందింది .


సత్తెయ్యగా చలం , అతనిని అభిమానించే పాపగా అప్పటి బేబీ రోజారమణి బాగా నటించారు . వీరిద్దరితో పాటు శోభన్ బాబు , రాజశ్రీ , విజయలలిత , యస్ వరలక్ష్మి , గుమ్మడి , ఆనందమోహన్ , రుష్యేంద్రమణి , హేమలత ప్రభృతులు నటించారు .

ప్రముఖ తమిళ నటులు నాగేష్ , మనోరమ ఒక నృత్య గీతంలో తళుక్కుమంటారు . ప్రజలంతా కొలిచేటి భగవంతుడు నివసించే పసిపిల్లల అనే నృత్య గీతంలో బుధ్ధుడు , మహాత్మాగాంధీ , లాల్ బహదూర్ శాస్త్రిల త్యాగనిరతిని కీర్తించే చక్కటి పాటలో బాగా నటించారు ఈ ఇద్దరు ప్రముఖ నటులు .

Ads

యం యస్ విశ్వనాధం సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి . ముఖ్యంగా నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి అనే పాట చాలా హిట్ సాంగ్ . అలాగ చూడు ఇలాగ చూడు భలే మంచి శాంతమ్మ , ఇతర పాటలు బయట హిట్ కాకపోయినా థియేటర్లో శ్రావ్యంగానే ఉంటాయి .

బాలచందరే ఈ సినిమాను తమిళంలో పతమ్ పాశలీ పేరుతో జెమినీ గణేశన్ , రాజశ్రీ , నాగేష్ , మనోరమలతో తీసారు . ఆదుర్తి సుబ్బారావు మస్తానా అనే టైటిల్ తో హిందీలో పద్మిని , మెహమూద్ , వినోద్ ఖన్నా , భారతిలతో తీసారు . కన్నడంలో మంకుతిమ్మగా శ్రీనాధ్ , మంజుల , పద్మప్రియలతో వచ్చింది . అన్ని భాషల్లోనూ బాగా ఆడింది .

మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో చూసా . సినిమా యూట్యూబులో ఉంది . చూడతగ్గ సినిమాయే . ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది . వాచ్ లిస్టులో పెట్టవచ్చు .

#తెలుగుసినిమాలసింహావలోకనం #telugureels #తెలుగుసినిమాలు #TeluguCinemaNews #telugucinema 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎనర్జీ డిప్లొమసీ..! ఇండియా మౌనం వెనుక ‘చమురు వ్యూహాలు’..!!
  • కొన్ని సినిమా ప్రయోగాల్ని రామోజీరావే చేయగలిగాడు… కానీ..?
  • అస్తవ్యస్తత..! సినిమాలపై తెలంగాణ ప్రభుత్వ విధానరాహిత్యం..!!
  • ఇక్కడ అత్యంత భారీ విగ్రహం… అక్కడ ఓ జ్ఞాపకం తెగనమ్మకం…
  • బెంగాల్ ‘శివగామి’ స్ట్రీట్ ఫైట్… ఆ ఆకుపచ్చ ఫైలులో అసలు మర్మమేంటి..!?
  • రానున్న 48 గంటలు అత్యంత కీలకం – మధ్యప్రాచ్యం మండిపోతోంది
  • టాక్సిస్ పారడాక్స్..! ఓ అశ్లీల వ్యతిరేకి దాన్నే ఆశ్రయించడం..!!
  • యాదాద్రి, భద్రాద్రి… తెలంగాణ నెత్తిన రెండు తెల్ల ఏనుగులు…
  • సుహాసిని సరే… యాంగ్రీ రాజశేఖర్ శాకాహార సినిమాలూ చేయగలడు…
  • మర్యాద రేవంతన్న..! గౌరవనీయ కేసీయార్..! ప్రొటోకాల్ పాలిటిక్స్..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions