Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అల్లు అరవింద్ చెప్పింది నిజమే- ఈ తెలుగు కొత్త తార సాత్విక మెరిసింది

November 20, 2026 by M S R

.

సాత్విక వీరవల్లి… టాలీవుడ్ ఆసక్తిగా చూస్తోంది ఆమె వైపు ఇప్పుడు… ఇప్పుడు రిలీజైన ఆకాశంలో ఒక తార సినిమా చూశాక (పాన్ ఇండియా) ఇతర భాషల ఇండస్ట్రీలూ చూస్తాయి… సగటు ప్రేక్షకుడు ఎవరీ అమ్మాయి అని నెట్‌లో అన్వేషిస్తాడు… ఆ పాత్రకు తగినట్టు నటించింది… అమాయ‌క‌త్వం, అందం, భ‌యం, ప‌ట్టుద‌ల కలగలిసిన ఆ పాత్ర దొరకడం ఆమె అద‌ృష్టం…

అందుకేనేమో, అల్లు అరవింద్ ఈ సినిమా రిలీజ్ గాకముందే మరో రెండు సినిమాలకు అగ్రిమెంట్లు రాయించుకున్నాడు… నాగ చైతన్య, రాంచరణ్ సినిమాల్లోనూ నటించబోతోందట… సో, కొన్నాళ్లు తెరపై నిలబడుతుంది…. అవును, ఈమె తెలుగు అమ్మాయి.., సినిమా రివ్యూకు ముందు ఆమె గురించి…

Ads

తెలుగమ్మాయి… కొత్తతరం తెలుగమ్మాయి… తన మొదటి సినిమా పాత్ర ఎర్ర బస్సెరుగని ఊరి నుంచి ఏకంగా ఖగోళం అంచుల్లోకి ప్రయాణించే అమ్మాయి పాత్ర… కానీ ఈమె మాత్రం అమెరికాలో పుట్టి పెరిగింది… తండ్రి తెలుగువాడు, తల్లి వనిత మాత్రం కలకత్తా… కుటుంబం చెన్నైలో సెటిలైంది… తల్లి భరతనాట్య గురువు, బిడ్డకూ నేర్పించింది… కర్నాటక సంగీతంలోనూ శిక్షణ ఇప్పించింది… సాత్విక ఆల్రెడీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్…

చదువైపోయాక… ఏదో ఓ హెల్త్‌కేర్ టెక్నాలజీ సంస్థలో సీనియర్ కన్సల్టెంట్‌గా కొలువు చేసింది… నటనపై ఇష్టంతో అన్నీ వదిలేసి ఇండియాకు వచ్చింది… తెలుగు పాత్ర రావడంతో తెలుగులో ట్రెయినింగ్ తీసుకుంది… (అమెరికా యాక్సెంట్ తగ్గి, తెలుగులో మెరుగైన ఉచ్చారణ కోసం)…

.

నిజానికి దుల్కర్ నటించిన ‘కాంత’ సినిమాలో హీరోయిన్ పాత్ర దక్కాల్సింది… ఆడిషన్ ఇచ్చినా నిర్మాతలు పెదవి విరిచారు… తరువాత ఇదుగో ఈ ‘ఆకాశంలో ఒక తార’ పాత్ర దక్కింది… ఇందులోనూ దుల్కరే కథానాయకుడు… ఆమెలోని సమర్థ నటిని చూశాను కాబట్టే రెండు సినిమాలకు ముందే అగ్రిమెంట్ రాయించుకున్నాను అని అల్లు అరవింద్ చెప్పినప్పుడు కాస్త నవ్వొచ్చింది… సినిమా రిలీజుకు ముందే ఇంత పెద్ద సర్టిఫికెట్ ఇస్తున్నాడు ఏమిటబ్బా అని…

కానీ తను చెప్పింది నిజమే… బాగా చేసింది… గరివిడి లక్ష్మి చేశాక ఆనందికి మంచి పేరొచ్చింది కదా, ఆకాశంలో ఒక తార సినిమా ఈమెకు పేరు తెచ్చిపెడుతుంది… లక్ కూడా కలిసొస్తే, గీతా ఆర్ట్స్ వంటివి అండగా ఉంటే నాలుగు రోజులు నిలబడుతుంది… ఆల్ ది బెస్ట్ సాత్వికా…

.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అల్లు అరవింద్ చెప్పింది నిజమే- ఈ తెలుగు కొత్త తార సాత్విక మెరిసింది
  • బాక్సాఫీసు రికార్డులన్నీ బద్దలు – ‘ఖజానా’కు మాత్రం చిల్లులు !!
  • Ramoji film city – ఓ కేజీఎఫ్ మార్క్ చాకిరీ అనుభవం !!
  • చైనా, పాకిస్థాన్ మనకు యుద్ధ సంకేతాలు ఇస్తున్నయ్..! ఇలా…
  • ఒకేలాంటి పాట ఒకేలాంటి సందర్భాల్లో రెండు సినిమాల్లో…
  • Qatar Vs Indigo… వోల్వో బస్సు దిగి ఎర్ర బస్సు ఎక్కినట్టు..!
  • చాణక్యుడిగా రణ్‌వీర్.. చంద్రగుప్తుడిగా యశ్.. నిజమైతే మరో సంచలనమే!
  • వందేళ్ల నాటి తమిళ భక్తి పాట- గ్రామీ అవార్డుకు పరిశీలన…
  • ఇండియాకు వస్తున్నారా… బీ అలర్ట్, ఎబోలా డిక్లరేషన్ తప్పనిసరి!
  • The son who stole his mother’s night…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions