కొన్ని అలా చదువుకోవాలి… అంతే… బయటికి ప్రచారం వేరు, అసలు కథలు వేరు… సినిమాల వసూళ్ల లెక్కల్లాగే…! పిచ్చి అభిమానులు ఉంటారు కదా, వాళ్లు ప్రచారం చేసుకోవడానికి ఫేక్ కలెక్షన్లను లీక్ చేస్తుంటారు, లేదా రిలీజ్ చేస్తుంటారు… ఫ్యాన్స్ అంటేనే అరబుర్రలు కదా, ఓ ఓ అంటూ మొత్తుకుంటూ ఉంటారు… విషయం ఏమిటంటే… ఆహా అనే తెలుగు ఓటీటీలో బాలయ్య నిర్వహించే చాట్‌షో అన్‌స్టాపబుల్ సూపర్ హిట్ అనీ, 40 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్‌తో రికార్డులు బద్దలు కొడుతోందని సాక్షాత్తూ ఆ ఓటీటీయే చెప్పుకుంటోంది…
ఎస్, బాలయ్యను కొత్తగా ప్రజెంట్ చేస్తున్నది ఈ షో… తనలోని ఓ జోవియల్ కేరక్టర్‌ను బయటికి తీసుకొస్తోంది… ఓటీటీలో చాట్ షో ఇలా ఉండాలి అని కొత్త ప్రమాణాలు ఫిక్స్ చేస్తున్నాడు బాలయ్య… దీనికోసం దాదాపు సినిమాకు వర్క్ జరుగుతున్నంతగా వర్క్ జరుగుతోంది… అన్‌స్టాపబుల్ ఫస్ట్ సీరీస్ సూపర్ హిట్, డౌట్ లేదు… కానీ సెకండ్ పార్ట్ ఫస్ట్ ఎపిసోడ్ చంద్రబాబుతో చేశాడు కదా, దాని దెబ్బ బలంగానే పడింది అన్‌స్టాపబుల్ షో మీద… నమ్మబుద్ధి గాకపోయినా నిజం అదే…
అదే చంద్రబాబు, అదే సైబరాబాద్, అదే కంప్యూటర్లు, అదే టెలిఫోన్లు, అవే అబద్ధాలు పదే పదే… వెన్నుపోటును జస్టిఫై చేసుకోవడానికి ఈరోజుకూ నానా తంటాలు… ఓ సరదా షో కాస్తా చంద్రబాబు వల్ల సోది పొలిటికల్ హిపోక్రటిక్ లైస్ షోగా మారిపోయింది… ఇప్పుడు అదే ఓటీటీ 4 రోజుల్లో 40 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ అని గొప్పగా చెప్పుకోవచ్చుగాక, కానీ అది పెద్దగా పరిగణనలోకి తీసుకునే నంబరేమీ కాదు… నవ్వొచ్చేది ఏమిటంటే..? ఈ షోను చంద్రబాబుకు అప్పగించిన అల్లు అరవింద్ ‘మీ బాధ మీరు పడండి’ అనుకుని ఎంచక్కా తను మాత్రం ఈటీవీలో ఆలీతో సరదాగా అనే చాట్ షోలో పాల్గొన్నాడు… నిజానికి అది బాగుంది…
Ads
అల్లు అరవింద్ భలే వ్యాపారి… ముక్కుతూ మూలుగుతూ నడుస్తున్న బావ సినిమా గాడ్ ఫాదర్ మీద కాంతార తాటిపండులా పడుతుందని తెలిసీ, అర్జెంటుగా తెలుగు వెర్షన్ రిలీజ్ చేశాడు… అది నిజంగానే గాడ్ ఫాదర్ నడుం విరగ్గొట్టింది… నిజానికి కాంతార మలయాళం లేటుగా రిలీజ్ చేశారు… కానీ ఈలోపు ఇంకెవరైనా కొనేస్తారేమో అనుకుని అరవింద్ హడావుడిగా కొనేసి, రిలీజ్ చేసేశాడు… రూపాయికి యాభై రూపాయల లాభం పొందుతున్నాడు…
ఇక అన్‌స్టాపబుల్ షో విషయానికి వస్తే చంద్రబాబు షో తరువాత విష్వక్సేన్, జొన్నలగడ్డ సిద్దూల ఎపిసోడ్ ప్రోమో వస్తోంది… నిజానికి వాళ్లు బాలయ్య కూర్చోబెట్టి గేమ్ ప్లే చేయాల్సినంత రేంజ్ కేరక్టర్లు కాదు… ఎస్, అంత చిన్న హీరోలతోనూ బాలయ్య భలే ఆర్గనైజ్ చేస్తున్నాడు అనేవాళ్లు ఉంటారు గానీ… బాలయ్య రేంజ్ వేరు… చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, కమలహాసన్, రజినీకాంత్… ఆగండాగండి… అసలు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదయ్యా బాబూ… చంద్రబాబు దెబ్బ ఎలా ఉందో చూద్దామా..?
రమ్యకృష్ణ, రాశిఖన్నాలను కష్టమ్మీద ఒప్పించారు… ఏదో పిచ్చి డాన్స్ షోకు జడ్జిగా చేస్తూ రమ్యకృష్ణ హైదరాబాద్ పరిసరాల్లోనే తిరుగుతోంది.,. వాళ్లిద్దరి షూట్ అయిపోయిందా, ఆగిపోయిందా తెలియదు… నిజానికి విష్వక్సేన్, సిద్దూ ఎపిసోడ్ అయ్యాక క్లారిటీ ఇస్తారేమో… తరువాత ఇక గెస్టులు ఎవరూ దొరకలేదు… ఎలాగోలా అడవి శేషు, శర్వానంద్‌ను పట్టుకొచ్చారు… బహుశా తరువాత ఎపిసోడ్ వాళ్లదే అయి ఉంటుంది… ఆ తరువాత..? ఎవరికీ తెలియదు…
చాట్ షో అంటే సరదా, వినోదం మాత్రమే కాదు… బాలయ్య మాత్రమే అడిగి రాబట్టగల కొత్త సంగతులు ఉండాలి… బాలయ్య అడిగితే జవాబులు వస్తాయి… కానీ అది లోపిస్తోంది ఈ షోలో… కేవలం ఫన్ అండ్ ఎంటర్‌టెయిన్‌మెంటే ప్రధానం అనుకుంటే… ఇక అంతే సంగతులు… రాబోయే సినిమా పేరును వీరసింహారెడ్డి అని ఖరారు చేశారు, చాలాసేపు సోషల్ మీడియా నెటిజనం అస్సలు నమ్మనేలేదు… మళ్లీ అదే కొండారెడ్డి బురుజు… ఇక తెలుగు సినిమా కథ మారదు… తెలుగు హీరో మారడు… బాలయ్య అస్సలు మారడు… (నా సినిమా చూడటం మీ అదృష్టం, చూడలేకపోతే మీ ఖర్మ)… అన్‌స్టాపబుల్ షోను కూడా అలాంటి రొటీన్ వ్యవహారంలా మార్చేయకుండా, బాలయ్య తన రేంజులో ఉండేలా తన ఇండస్ట్రీ పరిచయాల్ని ఉపయోగించాలి… లేకపోతే బభ్రాజమానం భజగోవిందం…!!
Share this Article