Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భేష్ సింగరేణి… తవ్వి వదిలేయలేదు… పచ్చగా ప్రకృతికి తిరిగి అప్పగింత…

June 11, 2026 by M S R

.

ఒక వార్త నచ్చింది… సింగరేణికి కేంద్ర ప్రశంస, ఎందుకంటే..? పర్యావరణ ప్రమాణాల అమలు తీరుకు… డోర్లీ-1, 2 గనుల మూసివేతలో ఆదర్శంగా నిలిచినందుకు… రెండు గనుల పేరిట చెల్లించిన 100 కోట్ల డిపాజిట్ వాపస్ వస్తున్నందుకు… నిజానికి ఆ డబ్బు గురించి కాదు…

ప్రకృతి నుంచి ధనాన్ని… ఇంధనాన్ని… తవ్వుకున్నాక… అంతా అయిపోయాక, అంతే భద్రంగా, అంతే పచ్చగా తిరిగి ఆ మొత్తం ప్రాంతాన్ని తిరిగి ప్రకృతికే అప్పగించాలి… అది పర్యావరణ ధర్మం… చాలా ప్రైవేటు, ప్రభుత్వ గనులు ఈ పని చేయవు… కానీ సింగరేణి దాన్ని శ్రద్ధగా, బాధ్యతగా చేసి చూపించింది… అందుకని ఆ వార్త నచ్చింది…

Ads

కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఓ రూల్ పెట్టింది… గని ఓపెనింగ్, తవ్వకం తరువాత మూసివేతకూ కొన్ని ప్రమాణాలు నిర్దేశించింది… ముందస్తుగా కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ కొంత డబ్బు డిపాజిట్ చేయించుకుంటుంది… ప్రమాణాల మేరకు గని మూసివేత పూర్తయితే ఆ డబ్బు వాపస్ చేస్తుంది… బెల్లంపల్లి ఏరియాలో డోర్లీ-2 బాపతు 40 కోట్లు ఇలా వాపస్ వచ్చేశాయి… డోర్లీ-1 బాపతు డబ్బు కూడా రాబోతోంది…

గనుల తవ్వకంలోనే కాదు… మూసివేతలో కూడా మైన్ క్లోజర్ ప్లాన్, పర్యావరణ పరిరక్షణ, భూసంరక్షణ, పునరుద్ధరణ కార్యక్రమాలు ప్రధానం… డోర్లీ-2 ఓపెన్ కాస్ట్… 2013-14 లో అనుమతులు పొందింది… 2023-24 లో మూసేసింది… మరి ప్రమాణాల మేరకు మూసివేత జరిగిందా లేదా ఎలా తేలాలి, ఎవరు తేల్చాలి…?

ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ ఉంటుంది… ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శిబ్ పూర్ (పశ్చిమబెంగాల్) ద్వారా ఆడిట్ పరీక్షలు నిర్వహించారు… అది సంతృప్తి వ్యక్తం చేసింది, ఈమేరకు ఓ లేఖ రాసింది… ఒకరకంగా సింగరేణికి ఇది అభినందన పత్రం… ఐతే సింగరేణి మూసివేత విషయంలో తీసుకున్న చర్యలు ఏమిటి..?

గని తవ్విన ప్రాంతంలో గతంలో ఉన్న దట్టమైన అడవికి సమంగా తిరిగి 163 హెక్టార్ల విస్తీర్ణంలో దట్టమైన అడవులను పెంచి అందజేసింది… గని తవ్వకానికి ముందు ఆ ప్రదేశంలో ఉన్న సారవంతమైన భూమి పైపొర మట్టి (టాప్ సాయిల్) సుమారు 19.76 లక్షల క్యూబిక్ మీటర్ల పరిమాణం తొలగించి వేరే చోట భద్రపరిచి, దానిని ఓవర్ బర్డెన్ డంపులపై తిరిగి పరిచి, వాటిపై మొక్కలను పెంచింది. అదొక దట్టమైన అడవి ఇప్పుడు…

ఓపెన్ కాస్ట్ సమయంలో వాతావరణ కాలుష్యం లేకుండా డ్రిల్ మిషన్ల వద్ద డస్ట్ కలెక్టర్లను ఏర్పాటు చేసింది… వెట్ డ్రిల్లింగ్ నిర్వహించింది… 28 కిలో లీటర్ల సామర్థ్యం గల వాటర్ స్ప్రింక్లర్ ఒకటి, పది కిలో లీటర్ల సామర్థ్యం గల వాటర్ స్ప్రింక్లర్లు రెండు వినియోగించి నిరంతరాయంగా ధూళి లేవకుండా చర్యలు తీసుకుంది. కోల్ బంకర్లు సీహెచ్పీల వద్ద మిస్ట్ స్పేయర్లను ఏర్పాటు చేసింది…

హాల్ రోడ్లకు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటి గ్రీన్ బెల్టులు ఏర్పాటు చేసింది… ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎన్విరాన్ మేంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ కూడా ఆడిటింగ్ జరిపింది… ఓపెన్ కాస్ట్ వల్ల జల కాలుష్యం జరగకుండా ఉండేందుకు ఓపెన్ కాస్ట్ చుట్టూ పది కిలోమీటర్ల పొడవైన గార్ల్యాండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేసింది. రెండు చెక్ డ్యామ్లను నిర్మించి, బురద నీరు ప్రకృతిలో కలవకుండా చర్యలు తీసుకుంది…

ఐదు సెటిలింగ్ ట్యాంకులను ఏర్పాటు చేసింది… గని నుంచి విడుదలయ్యే నీటిని శుభ్రపరిచి సమీపంలోని కాలువల్లోకి పంపించింది… మూసివేసిన గని వద్ద రక్షణ ఏర్పాట్లను చేపట్టింది… సెక్యూరిటీ గార్డ్‌లు, సూపర్ వైజర్లను నియమించింది… గని చుట్టూ కంచెను ఏర్పాటు చేసింది… గతంలో గని నిర్వహణ సందర్భంగా నిర్మించిన భవనాలను, నిర్మాణాలను సురక్షితంగా తొలగించింది…

గతంలో ఒక భూగర్భ గనికి (ఆర్కే-8 ఇంక్లైన్, శ్రీరాంపూర్) సంబంధించి కూడా కేంద్రం అభినందించింది… త్వరలో మూసివేత దశలో ఉన్న మరికొన్ని గనుల్లోనూ ఇవే చర్యలు పాటిస్తున్నారు… గుడ్… ఇంత నైపుణ్యం, శ్రద్ధ, భాద్యతాయుత వ్యవహారశైలి, సాధన- సంపత్తి, మానవవనరులు ఉన్నా సరే, కొన్ని గనుల్ని ప్రైవేటుకు ఎందుకు ధారాదత్తం చేస్తున్నట్టు..? అదే అసలు చిక్కు ప్రశ్న..!!

https://www.facebook.com/share/v/1B9s6VkD1M/

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘God Of War’… నాగవంశీ కొత్త మంట … ‘God Of South & North War’
  • భాగ్యరాజా సక్సెస్ స్టోరీలో కొన్ని ఫ్లాపుల కోణాలూ ఉన్నయ్!
  • ఆచితూచి యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు– ఎటొచ్చీ చిరంజీవి భార్య పేరుతోనే..!!
  • 95 ఏళ్ల వయస్సు దాకా… భారతీయ గుండెలకు అవిశ్రాంత సేవ..!!
  • “కొలై పండ్రాంగప్పో” – కరుణానిధి అరెస్టు రాత్రి అసలేం జరిగింది?
  • నిధి దొరికింది! ‘మనిషి ఆశ’ల్లో ఇరుక్కుంది! ఎవరు సొంతదారు!!
  • వెలుగు వివేక్‌కు అభినందనలు – హరీష్ రావుకు ప్రత్యేక ప్రశంసలు
  • SIR, భిక్షగాళ్లకు ఓట్లున్నాయా..? వారు ఓటు హక్కు‘అడుక్కోవడం’ ఎలా..?
  • 20 ఏళ్ల స్పీడ్- సక్సెస్‌ఫుల్ జర్నీ – మిడ్జిల్ జెడ్పీటీసీ నుంచి సీఎం కుర్చీ దాకా!!
  • సౌందర్య ఆ పాట ఒప్పడమే గొప్ప – ఈ దర్శకుడు పెద్ద ‘మాయలోడు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions