గల్లా నుంచి గాలి దాకా… సినీ కుటుంబమే కానక్కర్లేదు… ఆ వారసత్వమే అక్కర్లేదు… ధన కుటుంబం అయితే చాలు… ఇండస్ట్రీ చుట్టూ చేరుతుంది… జేజేలు కొడుతుంది… వెండితెరపై మరో హీరో ఉద్భవిస్తాడు… డబ్బులు, డబ్బులు… హీరోకు నచ్చిన హీరోయిన్లు, విలన్లు, డైరెక్టర్లు అందరూ వచ్చేస్తారు… నటన, డిక్షన్ మన్నూమశానం ఎవడికి కావాలి..? నాలుగు ఫైట్లు పడ్డాయా… మంచి సాంగులు పడ్డాయా… చాలు, తెరపై హీరోయిజం వర్ధిల్లాలి…
ఆకర్షణ… పాపులారిటీ, అమ్మాయిలు, సౌఖ్యాలు, విలాసాలు… వాట్ నాట్… హీరో అంటే మజాకా మరి..? నిర్మాత కొడుకు నిర్మాత, పొలిటిషియన్ కొడుకు పొలిటిషియన్, హీరో కొడుకు హీరో, వ్యాపారి కొడుకు వ్యాపారి… అదేకాదు వారసత్వం… డబ్బులున్నవాళ్ల కొడుకులు అర్జెంటుగా హీరోలై పోవాలి… సీఎం స్టాలిన్ కొడుకైనా అంతే… మాజీ సీఎం కుమారస్వామి కొడుకైనా అంతే, ఎంపీ గల్లా జయదేవ్ కొడుకైనా అంతే… ఇప్పుడు మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి కొడుకైనా అంతే… పొలిటికల్ అప్పియరెన్స్ ప్లస్ సినిమా గ్లామర్… డబుల్ అడ్వాంటేజ్…
లండన్‌లో చదువుకున్న జనార్దన్‌రెడ్డి కొడుకు కిరీటి మూడేళ్ల క్రితం వచ్చాడు… ఎన్నికల్లో తల్లి, సోదరితో కలిసి వెళ్లి ఓటు వేసినప్పుడు విలేకరులు అడిగారు… రాజకీయాల్లోకి వస్తారా, ఇంట్రస్టు ఉందా అని… ప్రస్తుతానికి లేదు, ముందుగా నేను హీరోను అవుతాను అని బదులిచ్చాడు… చాలా క్లారిటీ ఉంది… అనుకున్నట్టుగానే సినిమా స్టార్టయిపోయింది… ఎంత రాజమౌళి అయితేనేం, జనార్దన్‌రెడ్డి చెప్పాక రాడా ఏం..? వచ్చి క్లాప్ కొట్టాడు…
Ads
శ్రీలీల హీరోయిన్… చాలారోజులుగా తెరకు దూరంగా ఉన్న బొమ్మరిల్లు జెనీలియా మళ్లీ వచ్చేసింది… ఎస్, తను హీరోగా చేయడానికి అనర్హుడు అనడం లేదు… సొంత ప్రతిభ, ప్యాషన్ ఉంటే ఎదిగితే తప్పేమీ లేదు… అల్లు అర్జున్‌ను చూస్తున్నాం కదా, తన వర్క్, తన డెడికేషన్… నేపథ్యంతో కాదు, సొంతంగానే పాన్ ఇండియా హీరో అయిపోయాడు పుష్ప సినిమాతో… అయితే గల్లా, గాలి తదితరులు కూడా సినిమా ఫీల్డ్‌ను ఆక్రమించేస్తే… ప్రేక్షకుల సం‘గతి’ ఏమిటో వదిలేద్దాం…
కానీ నటన మీద ప్యాషన్ ఉండి, బోలెడు మెరిట్ ఉండి, ఏ నేపథ్యమూ లేనివాళ్ల గతేమిటి..? ఐనా పాలిటిక్స్‌లో ఉన్నంత మజా వేరే ఫీల్డుల్లో ఏముందబ్బా… పెద్ద పెద్ద బ్యూరోక్రాట్లు, మస్తు పాపులారిటీ ఉన్న సినిమా హీరోలు, డబ్బు చేసిన ఇండస్ట్రియలిస్టులు, చివరకు సన్యాసులు, యోగులు కూడా రాజకీయాధికారంలోని థ్రిల్ కోసం, పవర్ కోసం రాజకీయాల్లోకి రావడానికి తహతహలాడిపోతున్నారు… పుష్ప భాషలో చెప్పాలంటే పులుపెక్కిపోతుండారు… అసలు పాలిటిక్స్ ద్వారా దక్కని సుఖమేముంది..? దానిమీద కాన్సంట్రేట్ చేయకుండా, ఆ పునాదులు స్ట్రెంతెన్ చేసుకోకుండా, ఇటువైపు ఎందుకొస్తున్నారు బ్రదర్స్..?!
Share this Article