Mani Bhushan…. సరైన వ్యక్తికి సరైన బాధ్యత ….
ఇప్పుడూ… APలో జంబ్లింగ్ గేమ్ నడుస్తోంది. ఎమ్మెల్యేలను MP లుగానూ, ఎంపిలను ఎమ్మెల్యేలుగానూ పోటీ చేయమని; ఇక్కడివాళ్లను అక్కడికి, అక్కడివాళ్లను ఇక్కడికి వెళ్లి బరిలో దూకమంటున్నారు.
ఈ Transfer Gameకి మేనేజర్- కం- రిఫరీగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారు. సజ్జల సమర్థతకు, ఈ బాధ్యతలకు కారణం… ఆయన పూర్వాశ్రమంలో జర్నలిస్టు (Sakshi Editorial Director) కావడమే!
—
జర్నలిస్టుల్ని ఎలా ట్రాన్సఫర్ చేస్తారో తెలుసా?
ఎడిటర్ పిలిచి పొగిడి భుజంమీద చెయ్యేసి… “ప్రజాస్వామ్యం నాశనమైపోతున్నట్టుగా నాకు, చైర్మన్ గారికి రాత్రి కలలొచ్చాయి. నువ్వు ఢిల్లీలో ఉండి ప్రజాస్వామ్య పరిరక్షణలో పునరంకితం కావాలి” అంటారు. (అచ్చంగా అలాగే కాకపోయినా అదే అర్థంలో…)
భాష తెలియనిచోటకి, వాతావరణం అనువుకాని చోటకి, అలవాటైన తిండి దొరకని చోటకి వెళ్ళి పనిచేయడానికి సిద్ధమై పోతారు. ఇక, జిల్లా స్టాఫర్లు, స్ట్రింగర్లు Cell phoneలు, WhatsApp వగైరాలు, smartphoneలు Digi cameraలు లేని రోజుల్లో ఉరుకులు పరుగులతో central editionకి వార్తలు ఫొటోలు పంపేవారు.
వీళ్ళందరూ కేవలం అరకొర జీతగాళ్ళే! బాధ్యతగా పనిచేశారు. వంకలు వెతుక్కోలేదు.
—
ఈ కారణం వల్లనే సజ్జల “ప్రజాస్వామ్య పరిరక్షణలో పునరంకితం కావాలి” అని ఎమ్మెల్యేలను ఎంపీలను జంబ్లింగ్ చేస్తున్నారు.
.
ఇప్పుడు (ఇప్పుడే కాదు, అప్పుడైనా ఎప్పుడైనాగానీ) టికెట్ కోరుకునేవారు ఏమంటారు? ‘హైకమాండ్ ఆదేశిస్తే ఎక్కడైనా ఎవరిపైనైనా పోటీకి రెడీ’ అంటారు కదా! అపాయింట్‌మెంట్ ఆర్డరు (form-B) తీసుకున్నాక ఉంటుంది అసలు సినిమా! Transferred Representativeలు ఎలాగూ ప్రజాబలంతో ఇండిపెండెంట్లుగా గెలిచేవాళ్లు కారు. పార్టీల అండ, పైసా బలం ఉండాల్సిందే…
Share this Article