Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆదానీపై మనమేం పోరాడతాం..? మన నలుపు మాటేమిటి..? ఇదేం నైతికత..?!

February 18, 2023 by M S R

అభ్యుదయ సమాజం సమీప భవిష్యత్తులో సాకారం అవుతుందో లేదో తెలీదు కానీ, కనీసం కనిపించని భూతల స్వర్గాన్ని మాటల్లో చూపించే నాయకులు ఒకనాడు ఉండేవారు. మంచి చెప్పినా, చెడు చెప్పినా వాళ్ళ మాటలకు ఒక క్రెడిబిలిటీ ఉండేది. కాలం మారింది కార్యకర్తల లక్ష్యంలో కాసింత నిర్వేదం ఉన్నప్పటికీ నాయకుల వ్యాపారాత్మక ఆలోచనలు రోజురోజుకీ మరింత దిగజారుతున్నాయి.

ఈ నాయకుల ఆలోచన నుంచే టెన్ టివి పుట్టింది. ‘అభ్యుదయం’ మాటున మరో లోకం సాకారం కోసం ‘అభ్యుదయ బ్రాడ్ కాస్టింగ్’ పేరుతో మరో లోకం నిర్మిద్దాం అని కూలీ నాలీ, కార్మిక, కర్షక, బడుగు జీవుల దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేసింది సీపీఎం పార్టీ… ఆ ‘అభ్యుదయం’లో ఏవో ‘ప్రగతి’ నిరోధక పనులు ఉన్నాయని ‘ప్రగతి’ బ్రాడ్ కాస్టింగ్ లిమిటెడ్ ఇంకో పిల్ల ముఠా… ఇది మాత్రమే చాలదు అని స్ఫూర్తి బ్రాడ్ కాస్టింగ్ లిమిటెడ్ పేరుతో మరో పిల్ల కంపెనీ…

వర్తమాన పరిభాషలో అది షెల్ కంపెనీ. ఇక వసూళ్లకు తెగబడ్డారు. మొత్తానికి వాళ్ళకు సరిపోయినదాని కన్నా ఎక్కువ డబ్బులు వచ్చాయి. (వంద కోట్లు) అదనపు విలువను రెట్టింపు చేద్దామని, రియల్ ఎస్టేట్లో అటు ‘అభ్యుదయా’నికీ ఇటు ‘ప్రగతి’కీ తెలియకుండా పెట్టుబడులు పెట్టారు. దానికి లాండ్ పర్ పర్చేసింగ్ కమిటీ అనే ముద్దు పేరు. కొంత సొమ్ముతో టివి పెట్టారు. పది మంది కలిసి పెట్టారు కాబట్టి దానికి టెన్ టివీ అని పేరు పెట్టుకున్నారు. అది గిట్టుబాటు కావడం లేదు అని ఇంకో బడా పెట్టుబడిదారీకి టెన్ టివీ అడ్డికి పావు‘షేరు’ లెక్క అమ్ముకున్నారు…

Ads

ఇప్పటి వరకు కథ బాగానే ఉంది. అది పబ్లిక్ గా షేర్ల రూపంలో వసూలు చేసిన సొమ్ము. ఒక పది లక్షల చిట్ ఫండ్ నడపడానికీ సవాలక్ష అనుమతులు తీసుకోవాలి. ఇక్కడ సొమ్ము కోట్లాది రూపాయలు. అలా వసూలు చేయడం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) నిబంధనలకు విరుద్దం. ఆ విరుద్దమైన పని అయినా తెలివిగా వ్యాపార లావాదేవీలు నడిపింది ఒక వర్గం. వాస్తవానికి డబ్బులు వసూలు చేసింది బడుగు దళిత మైనారిటీ నాయకుల పేరు మీద…

వ్యాపార చక్రం తిప్పిన నాయకులు మొత్తం దొరల్లాగా తప్పించుకున్నారు. కానీ ఇవ్వాళ సెబి నోటీసులు ఇచ్చిన లిస్టు చూస్తే అభ్యుదయం ఎంత తెలివైన పనిచేసిందో అనిపిస్తది. టెన్ టివిలో ప్రజాధనాన్ని అక్రమంగా వసూలు చేసి, షేర్ హోల్దర్స్ అనుమతి లేకుండా షెల్ కంపెనీలు పెట్టి సాగించిన షేర్ బదలాయింపులు అక్రమం అని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) సెబీ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం తప్పు పట్టి, బాధ్యులకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది…

అభ్యుదయ బ్రాడ్ కాస్టింగ్ లిమిటెడ్, ప్రగతి బ్రాడ్ కాస్టింగ్ లిమిటెడ్ పేరుతో ప్రజల నుండి కోట్లాది రూపాయలను సెబి నిబంధనలకు విరుద్దంగా సేకరించడాన్ని తప్పుపట్టి సంబంధిత కంపెనీ బాధ్యులుగా వ్యవహరించిన ఇద్దరు డైరెక్టర్లకు ఏడుగురు బోర్డ్ మెంబర్లకు మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలి అంటూ నోటీసు ఇచ్చింది…

ఈ మొత్తం వ్యవహారంలో ప్రధానంగా వినబడుతున్న పేర్లు స్ఫూర్తి కమ్యూనికేషన్స్, అభ్యుదయ బ్రాడ్ కాస్టింగ్ లిమిటెడ్, ప్రగతి బ్రాడ్ కాస్టింగ్ లిమిటెడ్… ఈ మూడు కంపెనీలు సరైన బాడి మెంబర్స్ కానీ సక్రమమైన ఆఫీస్ అడ్రెస్ కానీ లేకుండా, ఒకదానికి ఒకటి తెలియకుండా 1956 కంపెనీ యాక్ట్ సెక్షన్ 56 (1), 56 (3), 60, 64 (2), 67 (3) మరియు 73 (1) & (3) ప్రకారం దుర్వినియోగం, మోసం అని అభియోగాలు మోపారు.
అంతేకాకుండా వసూలు చేసిన షేర్లను సదరు షేర్ హోల్డర్స్ కి తెలియకుండా, బహిరంగ ప్రకటన చేయకుండా, అమ్మడం లేదా బదలాయింపు చేయడం కూడా సెబి రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనలను తుంగలో తొక్కినట్టు అని సెబి ఆరోపించింది…

విషాదం ఏమిటంటే… పాలమ్మినోడు, పూలు అమ్మినోడు, రిక్షాపుల్లర్, సంఘటిత, అసంఘటిత కార్మికులతోసహా తలో రూపాయి వేసి, కూలీ నాలీ చేసే దిక్కూమొక్కు లేని జనం కూడా తమ పార్టీ ఏదో మంచి చేస్తోంది అని ఆసరా అయ్యారు. ఆఖరికి నట్టేట ముంచి, నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు చేసింది నమ్ముకున్న నాయకత్వం…

వేలాది మంది దగ్గర షేర్స్ డబ్బు వసూలు చేసి, కేవలం 445 మంది మాత్రమే షేర్ హోల్డర్స్ గా తమ అనుయాయులను ఏర్పాటు చేసుకుని, ఎవరికీ కనీస సమాచారం ఇవ్వకుండా, ఒక కంపెనీ నుండి ఇంకొక కంపెనీకి అక్రమ బదలాయింపు… షెల్ కంపెనీలు పెట్టి, సెబి నియమాలను ఉల్లంఘన చేయడం మరొక నేరం… సదరు అక్రమాలు తప్పు అని స్టేట్ కమిటీ నుండి సెంట్రల్ కమిటీ దాకా చర్చ జరిగింది… ఇంత జరిగినా బాధ్యులు మాకేమీ తెలియదు అనే రీతిలో తప్పించుకున్నారు…

ఒక బాధ్యత కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ అక్రమంగా డబ్బులు వసూలు చేయడం ఘోరమైన తప్పు. వసూలు చేసిన సొమ్ము రియల్ ఎస్టేట్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం ఇంకొక తప్పు పని… వసూలు చేసిన సొమ్ము సంబంధిత వ్యక్తులకు వాపసు చేయడం ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు, పార్టీ చేయాలి… అదేమీ చేయకుండా అసలు తప్పే జరగలేదు అని మసిపూసి మారేడు కాయ చేసే నాయకుల వల్ల కొందరు సీనియర్ నాయకులు పార్టీ వీడడానికి కూడా సిద్ధపడడం పేపర్లలో చూస్తున్నాము…

ప్రజాస్వామ్యబద్దంగా నడపాల్సిన పార్టీని ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మార్చేసిన ఈ పార్టీలు, మనుషులు పెట్టుబడిదారీ సమాజం మీద ఎలా పోరాడతారు ? షెల్ కంపెనీలు పెట్టిన మీరు అంబానీ, ఆదానీల మీద ఏ నైతికతతో సమరశీల పోరాటాలు చేయబోతున్నారు? నెపోటిజమ్, ఎవరేం చేస్తారులే అనే అహం, ముఠాతత్వం, ఆఖరికి పార్టీలో తమకు అనుకూలమైన వారినే కీలక స్థానాల్లో ఉంచి పార్టీకి విచ్చలవిడితనం అంటించారు….

పార్టీలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సింది పోయి, లిమిటెడ్ కంపెనీగా మార్చింది ఎవరు..? ఫాసిజం మీద సమరశీల పోరాటాలు చేయాల్సింది పోయి, పాలకవర్గ అడుగులకు మడుగులు ఎత్తడం ఎవరి కార్యాచరణ ? ఎవరు గెలవాలో, ఎవరు ఓడాలో, దానికి అనుగుణంగా ఎంత మందిని నిలబెట్టాలో అనే పన్నాగాలు ఎవరివి…? అచంచలమైన విశ్వాసం ఉన్న కేడర్ ఎందుకు అధికార పార్టీ ప్రాపకాల కోసం యాచన చేస్తోంది ? ఈ పాపం ఎవరిది ? …………… అజ్ఙాతి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions