అప్పట్లో బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా అనే పాట భాఘా ఫేమస్ కదా… ఏ పెళ్లి, ఏ ఫంక్షన్ చూసినా అదే పాట… ఇక రీల్స్, షార్ట్స్ అయితే లెక్కే లేదు… యూట్యూబ్ పండగ చేసుకుంది ఆ పాటతో… విచిత్రమేమిటంటే ఆ పాట పాడిన మోహన భోగరాజుకన్నా ఎక్కడో పెళ్లిలో వరుడి ఎదుట ఈ పాటకు డాన్స్ వధువు వీడియో మహా వైరల్ అయ్యింది…
అంతటి వైరల్ తరువాత మళ్లీ తెలుగునాట మరే వీడియో అంతగా క్లిక్ కాలేదు… దసరా సినిమాలో కీర్తిసురేష్ పెళ్లి బ్యాండ్ డాన్స్ కొన్నాళ్లు హల్‌చల్ చేసింది… చాలామంది ఆ డాన్స్ చేస్తూ వీడియో బిట్స్ చేశారు… టీవీ సెలబ్రిటీలు కూడా… అదే సినిమాలోని చమ్కీల అంగీలేసి పాట కూడా బాగానే స్ప్రెడయింది… చివరకు అందులో ‘సూరిగాడున్నాడా అత్తా.., బోషిడి, ఎవరే నీకు అత్త.., పెళ్లయితే కానీ, నీ సంగతి చెప్తా…’ అనే డైలాగ్ కూడా సేమ్ కాస్త వైరల్…
Ads
పైన ఓ వీడియో బిట్ చూశారు కదా… ఓ కొరియన్ సాంగ్… దాన్నే అనుకరిస్తూ తెలుగులో ఓ పాట చేశారు… కెమెరా పట్టినడో సీమ దసరా చిన్నోడు అని స్టార్టవుతుంది పాట… ఈమధ్య కాలంలో సూపర్ హిట్… నిజానికి ఒరిజినల్ సాంగులో డాన్సర్ల స్టెప్పులో ఓ రిథమ్ ఉంటుంది, కోఆర్డినేషన్ ఉంటుంది… తెలుగు పాటలో ఆ ట్యూనే హిట్టు… పెద్ద కష్టతరమైన స్టెప్పులు కావు…
దీంతో ముసలోళ్లు, చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ ఈ పాటను అనుకరిస్తూ వీడియోలు చేసి రీల్స్, షార్ట్స్ కుమ్మేస్తున్నారు… ఆ స్టెప్పులు ఎలా ఉన్నా సరే, పాట పెట్టామా లేదా ఎగిరామా లేదా… కెమెరా అందరికీ ఉండదు కాబట్టి స్మార్ట్ ఫోన్లనే కెమెరాల్లాగా పట్టుకుని, ఓ గొడుగు పట్టుకుని, తేలికపాటి స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు… ఈమధ్య పెళ్లిళ్లు, పెద్ద ఫంక్షన్లు లేవు కదా, లేకపోతే ఇంకా హిట్టయ్యేదేమో… ఒక చేదు నిజం ఏమిటంటే..? రుచీపచీ లేని చప్పిడి సినిమా పాటలకన్నా ప్రస్తుతం తెలంగాణ ఫోక్ సాంగ్సే యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి… గుడ్…
Share this Article