Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పట్లో గుడ్ బాయ్… మా బాలయ్య మంచి స్టోరీస్..! (Dogiparthi Subramanyam)

August 27, 2025 by Rishi

.

కళ్యాణ వైభోగమే శ్రీసీతారాముల కళ్యాణమే మన మాంగళ్యధారణ శుభలగ్నమే .

1986 ఏప్రిల్లో వచ్చిన ఈ సీతారామ కళ్యాణం సినిమా ఐకానిక్ సాంగ్ . ఆత్రేయ గారు ఎంత అందంగా వ్రాసారో కె వి మహదేవన్ గారు అంతే శ్రావ్యమైన సంగీతాన్ని అందించగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మలు బ్రహ్మాండంగా పాడారు . దర్శకుడు జంధ్యాల కూడా అద్భుతంగా చిత్రీకరించారు . యన్టీఆర్ సీతారామ కళ్యాణం సినిమా లోని సీతారాముల కళ్యాణం చూతము రారండి పాట లాగా ఈ పాట కూడా ఐకానిక్ అయిపోయింది . Of course . ఆ పాటతో ఏ పాటనూ పోల్చలేము , పోల్చకూడదు కూడా . కేవలం ఐకానిక్ అని చెప్పేందుకు , తండ్రి సీతారామ కళ్యాణం లాగా కుమారునికి ఆధునిక సీతారామ కళ్యాణం సినిమా ఉందని ప్రస్తావించేందుకే ఆ పాటను గుర్తు చేసాను .

Ads

16 సెంటర్లలో వంద రోజులు ఆడిన ఈ యువచిత్ర వారి సినిమా జంధ్యాల ముద్ర కన్నా మురారి ముద్రే ఎక్కువ కనిపిస్తుంది . జంధ్యాల సినిమాలలో హాస్యానికి పెద్ద పీట ఉంటుంది . కానీ ఈ సినిమాలో రొటీన్ గ్రామ పట్టుదలలు , పంతాలు , ఏక్షన్ మసాలా దండిగా దంచేసారు . ముద్ర ఎవరిదయినా సినిమా బాగుంటుంది . ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని ఆందిస్తుంది .

బాలకృష్ణ కెరీర్ మొదటి రోజుల్లో మట్టసంగా ఉండే గ్లామర్ బాయ్ పాత్రల్నే వేసారు . రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాలు , నరకటాలు , అరవటాలు పెంచి బీభత్సుడిని చేసేసారు నిర్మాతలు , దర్శకులు . సినిమా రంగం అంటే కోట్ల వ్యాపారం . మనం ఫేస్ బుక్కులో పోస్టులు , కామెంట్లు పెట్టినంత ఈజీ కాదుగా ! సరే . మళ్ళా సినిమా లోకి వద్దాం .

బాలకృష్ణ , రజనిల కాలేజి ప్రేమ , సైట్ కొట్టడాలు , లైన్ వేయటాలు ముసలోళ్ళకు కూడా తమ కాలేజి రోజులు , వయసులో చేసిన చిలిపి కార్యక్రమాలు , వయసు ఉడిగాక కూడా చేసిన విన్యాసాలు బాగా గుర్తుకొస్తాయి . సినిమా అంతా వారిద్దరి ప్రేమే . వారిద్దరి ప్రేమను అందాల గోదావరితో కలిపి జంధ్యాల చాలా అందంగా ఆవిష్కరించారు .

సీతారాముల విగ్రహాలు విడివిడిగా రెండు గ్రామాల సరిహద్దుల్లో దొరకటం , వాటిని మావంటే మావని గొడవపడి చంపుకోవటాల దాకా వెళ్ళటం కధకు మూలం . బావా మరదళ్ళు కాలేజీలో ప్రేమలో పడటం , వారిద్దరిని ఒకరికి ఒకరు చేరువ కాకుండా పెద్దోళ్ళు అడ్డం పడటం , అ అడ్డాలనన్నీ దాటి సీతారాములు ఒకటి కావటం , సీతారాముల విగ్రహాలు ఒక చోటికి చేరటంతో శుభం కార్డు పడుతుంది .

చక్కని కధ . గొప్ప టైటిల్ . సీతారామ కళ్యాణం అనే పేరుని ఎంపిక చేసుకోవటంతోనే సినిమా సగం సక్సెస్ అయిపోయింది . కె వి మహదేవన్ చాలా శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు . పాటల సంగీతం కన్నా బేక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుంటుంది . ఈ కాలం సంగీత దర్శకులను కట్టేసి ఇలాంటి సినిమాలను చూపాలి . ఆరుద్ర , వేటూరి , ఆత్రేయలు చక్కటి సాహిత్యన్ని అందించారు .

ఇతర పాత్రల్లో జగ్గయ్య , రామకృష్ణ , గొల్లపూడి , రాజేష్ , సప్తపది గిరీష్ , ముచ్చెర్ల అరుణ , సంగీత , రమాప్రభ , శుభలేఖ సుధాకర్ , సుత్తి వేలు , కల్పనారాయ్ , మా గుంటూరు జీవా , ప్రభృతులు నటించారు .

బాలకృష్ణ , రజనిల డ్యూయెట్లు అన్నీ బాగుంటాయి . సరిగమపదనీ , ఏమని పాడెను , రాళ్ళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు చాలా బాగుంటాయి . త్యాగరాజు గారి ఎంతా నేర్చినా ఎంతా చూచినా ఎంత వారలైనా కాంతాదాసులే కీర్తనను చక్కగా వాడుకున్నారు జంధ్యాల . ఈ పాటలో బాలకృష్ణ మారు వేషం కూడా ఉందండోయ్ . తండ్రి వారసత్వం మారువేషాలు .

ప్రముఖ దర్శకుడు ఇవివి ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టరుగా పనిచేసారు . సంభాషణలను జంధ్యాలే సమకూర్చారు . ఈ చక్కటి సినిమా యూట్యూబులో ఉంది . చూడనివారు తప్పక చూడవచ్చు . ఆహ్లాదంగా ఉంటుంది . ప్రేమ పిపాసులను గత మధుర లోకాలకు తీసుకుని పోతుంది . విహరించి రండి . ఈరోజు శెలవేగా !

#తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • (no title)
  • మోస్సాద్ వదిలేసిన ఏకైక టార్గెట్… ఎవరు అతను.. !? ( రమణ కొంటికెర్ల )
  • పెంకులు పగిలినా, ఇంటివాడు తిడితే అదొక ఆనందం..! (నగునూరి శేఖర్)
  • ఒకే మూవీ టైటిల్… ముగ్గురు తెలుగు హీరోలు (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)…
  • అప్పట్లో గుడ్ బాయ్… మా బాలయ్య మంచి స్టోరీస్..! (Dogiparthi Subramanyam)
  • ర్యాప్ అస్త్రంగా ఓ యువతి చైతన్య పోరాటం..! (రమణ కొంటికర్ల)..
  • టీపీసీసీ..! బండి సంజయ్ మీద అసందర్భ వ్యాఖ్యలతో పార్టీకే నష్టం..!!
  • ‘‘ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజీకి వస్తా… నాకు ధైర్యం ఉంది…’’
  • సీన్ ఛేంజ్..! నాడు ఎంట్రీపై నిరసన… నేడు సీఎం హోదాలో ఘన స్వాగతం…
  • నో తుర్కియే, నో అజర్‌బైజాన్… ఇప్పుడిదే ట్రెండ్… ఎందుకంటే..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions