.
. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) .. … దాసరి కూడా బాపులాగా సీతారాములు అని పేరు పెట్టడమే కాకుండా క్లైమాక్సులో విలన్ సీతమ్మను ఏరు అవతలకు కిడ్నాప్ చేయటం , రామయ్య కార్మికులతో వానర సైన్యంలాగా ఈదుకుంటూ వెళ్లి కాపాడుకోవటం వంటి సీన్లను పెట్టారు .
సాంఘిక చిత్రానికి పౌరాణికత్వాన్ని అద్దారు . బాగుంది . వంద రోజులు ఆడిన ఈ సినిమా వ్యాపారపరంగా సక్సెస్ కావటమే కాకుండా మ్యూజికల్ హిట్ గా కూడా పేరు తెచ్చుకుంది . తమిళంలో బాగా ఆడిన కనమన్ మనైవి అనే సినిమాకు రీమేక్ మన సీతారాములు సినిమా . అందులో హీరోయిన్లుగా ముత్తురామన్ , జయలలిత నటించారు .
Ads
ఓ ఫాక్టరీ యజమానురాలు తన ఫాక్టరీలో పనిచేస్తున్న కార్మిక నాయకుడిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది . యజమానిగా ఫాక్టరీలో , భార్యగా ఇంట్లో రెండు పాత్రలను కత్తి మీద సాములా పోషిస్తూ ఉంటుంది . అయినా role conflict రావటం , భార్యాభర్తలు విడిపోవటం , విలనేశ్వరుడు రావణ పాత్రలోకి దూరిపోవటం , హీరో గారు ఆమెను రక్షించటంతో సినిమా సుఖాంతం అవుతుంది .
ఈ సినిమా సక్సెస్ అవటానికి సత్యం సంగీతం బాగా దోహదపడింది . కన్యాకుమారిలో షూట్ చేయబడిన దాసరి వ్రాసిన పాట తొలి సంజె వేళలో తొలిపొద్దు పొడుపులో అద్భుతంగా ఉంటుంది . సాహిత్యం , చిత్రీకరణ , కృష్ణంరాజు- జయప్రదల చక్కటి నటన అన్నీ ప్రేక్షకులు మరచిపోలేనివి .
ఆత్రేయ వ్రాసిన పలికినది పిలిచినది పాట చిత్రీకరణ , జయప్రద హావభావ ప్రదర్శన చాలా అందంగా ఉంటాయి . పాట ప్రారంభం వరవీణా మృదుపాణీతో అవుతుంది . చాలా శ్రావ్యంగా ఉంటుంది . ఏమండోయ్ శ్రీమతి గారు లేవండోయ్ పొద్దెక్కింది పాటలో జయప్రద ముద్దుముద్దు పలుకులను కూడా తగిలించారు .
రాజశ్రీ వ్రాసిన బుంగమూతి బుల్లెమ్మ పాట హుషారుగా ఉంటుంది . ఈ సినిమాలో ఓ విశేషం జ్యోతిలక్ష్మి , జయమాలిని కలిసి డాన్సించటం . ఇద్దరూ కలిసి డాన్సించినవి మొత్తం మీద మూడో నాలుగో సినిమాలు మాత్రమే ఉన్నాయనుకుంటా . రింగు రింగు బిళ్ళ రూపాయి బిళ్ళ అంటూ సాగే పాట .
దాసరి వాయిస్ ఓవర్ తో ఏదో ఒక సందేశాన్ని takeaway గా ఇస్తూ ఉంటారు . ఈ సినిమా takeaway ఏంటంటే : కార్మికుల యజమానుల బంధం , సంబంధం భార్యాభర్తల బంధం వంటిది . కలిసి ఉండటం , అలకలు , నిరాహారదీక్షలు , రాజీ పడటం వగైరా . సందేశాన్ని బాగానే అందించారు దర్శకుడు దాసరి .
కృష్ణంరాజు నటన చాలా హుందాగా , హీరోయిక్ గా బాగుంటుంది . కార్మిక నాయకుడిగా , యజమానురాలి భర్తగా సంఘర్షణ పడే సీన్లలో బాగా నటించారు . విలనేశ్వరుడిగా మోహన్ బాబు తనదైన శైలిలో నటించాడు . ఇతర పాత్రల్లో సత్యనారాయణ , సుకుమారి , అల్లు రామలింగయ్య ప్రభృతులు నటించారు .
సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . కృష్ణంరాజు , దాసరిల అభిమానులు ఇంతకు ముందు చూసి ఉండకపోతే తప్పక చూడండి . జయప్రద సౌందర్యారాధకులు ఎన్ని సార్లయినా చూసి తరించవచ్చు .
పాటల వీడియోలు అందరూ తప్పక చూడతగ్గవే . జ్యోతిలక్ష్మి , జయమాలినిల డాన్స్ వీడియోని మాత్రం అనంత శ్రీరాంకు చూపవద్దు . ఆయనకు కోపం వచ్చే అవకాశం ఉంది . మొత్తం మీద it’s a musical , feel good , entertaining movie. #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు
Share this Article