దోగిపర్తి సుబ్రహ్మణం చెబుతున్నట్టు… ‘‘రెండు మూడు రోజుల కిందే ఈనాడు స్వర్ణోత్సవ వేడుకల్లో ఈనాడు జర్నలిస్టిక్ విలువల గురించి చాలామంది కితాబులను ఇచ్చారు . ఈ కార్టూన్ చూడండి . నిన్న వచ్చింది . అమెరికా , చైనా , బ్రిటన్ దేశాలు సంపాదించిన పతకాల గురించి చెప్పేటప్పుడు ఆయా దేశాల అధినేతలను చూపారు . భారతదేశానికి వచ్చేటప్పటికి ప్రధాని మోడీ బొమ్మ వేయకుండా పిటి ఉషను చూపారు . (ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షురాలు)…
మొన్న వేడుకల్లో ఈనాడు ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో అలుపెరగని పోరాటం చేసిందని పొగిడారు . ఈనాడు పోరాటమంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే … ఒక ఉదంతం చెపుతా . 1994 లో సంపూర్ణ మద్యపాన నిషేధం ఉద్యమం సమయంలో కార్టూనిస్ట్ శ్రీధర్ నిషేధం పెట్టేవరకు మద్యం మీద తప్పితే , మరి ఏ ఇతర కార్టూన్లు వేయనని శపధం చేసారు . NTR నిషేధం పెట్టేవరకు మాట మీద నిలబడ్డారు …
Ads
తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తేసాక , మళ్ళా ఆ ఊసే ఎత్తుకోలేదు . తర్వాత కొన్ని రోజులకు గుంటూరులో ఒక కామన్ మిత్రుడి ఇంట్లో భోజనానికి కలిసినప్పుడు శ్రీధర్ని నేను ప్రశ్నించాను . ఆయన నవ్వారు . ఎందుకు నవ్వారో నేను చెప్పనక్కరలేదు . ఇలా ఉంటాయి మీడియా selective democratic and journalistic values . రాజకీయ పార్టీల తల తన్నేలా అయిపోయింది మీడియా . Disclaimer : నా ఈ పోస్ట్ ఈనాడు , ఇతర మీడియా సంస్థల journalistic values మీదనే …
నిజమే కదా, ఆయన ఆక్షేపణలో పాయింట్ ఉంది… అమెరికా అధ్యక్షుడు బైడన్ బొమ్మ గీశారు, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ బొమ్మ గీశారు… ఆమధ్య బ్రిటన్ ప్రధాని అయిన కీర్ స్టార్మర్ బొమ్మ కూడా గీశారు… పోలికలు పట్టుకోలేకపోయినా సరే, పట్టుకునేలా బొమ్మలు గీయలేకపోయినా సరే, వాళ్లు వీళ్లే అని చెప్పడానికి దేశాల పేర్లు రాశారు…
వాళ్లు తట్టల కొద్దీ, కావిళ్ల కొద్దీ పతకాలు ఎత్తుకుపోతున్నారు నిజమే… మనకు ముష్టి ఆరు పతకాలు వచ్చాయనేదీ నిజమే… మరి ఇక్కడ ప్రధాని మోడీ బొమ్మ గీయాలి కదా… పీటీ ఉష మన ఒలింపిక్స్ బాధ్యురాలే అయినా సరే, మిగతా ముగ్గురు దేశాధినేతల బొమ్మలు గీసినప్పుడు, ఇక్కడా దేశాధినేతే బాధ్యుడు అన్నట్టుగా మోడీ బొమ్మ పడాలి కదా…
మోడీ మీద గీత కూడా పడటానికి వీల్లేదా ఇప్పుడు..? చంద్రబాబుతో పడనప్పుడు మోడీ అంటే మనకూ పడదు, చంద్రబాబుతో పొత్తు కాబట్టి మోడీ ఇక మనవాడే… ఇదేనా ధోరణి..? అవును లెండి, మొన్ననే కదా మీరు ఘనంగా చెప్పుకున్నది ఈనాడు విలువలు, ప్రమాణాలు అని… ఇవే కదా..!!
Share this Article