‘‘ఇన్నాళ్లూ ఇది మా అడ్డా అనుకున్నా, ఒక్క ఈవెంట్ బయటికి వెళ్లి చేసేసరికి, ఇక్కడ నాలుగు ఎపిసోడ్లు కట్ చేశారు… నువ్వూ ఇలాగే చేస్తే షో నుంచే పంపించేస్తారురా…’ ఈ మాట అన్నది ముక్కు అవినాష్… అవును, కామెడీ స్టార్స్ అనే మాటీవీ కామెడీ షో నుంచి నిర్మొహమాటంగా నాలుగు ఎపిసోడ్లు బయటికి పంపించేశారు… ఈ షో అంతా నేను చెప్పినట్టే అనే ఫీల్‌తో ఉన్న అవినాష్‌కు ఓ షాకే ఇది… అసలే ఈటీవీకి పెనాల్టీ కట్టి వచ్చాడు… ఇక్కడా అదే ఈటీవీ బాపతు ఆంక్షలు మొదలయ్యాయన్నమాట…
తాజాగా ఓ ప్రోమో… అది చూస్తుంటే జడ్జి నాగబాబు సహా, దాదాపు ప్రతి కమెడియన్ ఈటీవీ జబర్దస్త్‌లో తమకు ఎదురైన చేదు అనుభవాల మీద సెటైర్లు, కామెంట్స్ పాస్ చేస్తున్నట్టే సాగింది… అదీ నవ్వు పుట్టించింది… సేమ్, ముక్కు అవినాష్ ఆత్మచింతనలాగే మిగతావి కూడా… అవీ ఓసారి చెప్పుకుందాం… హహహ… కామెడీ అంటే ఇదో కామెడీ… మరో కోణంలో నవ్వొచ్చే కామెడీ…
ఆమధ్య జీటీవీలో రియాజ్ అనే పొట్టి కమెడియన్ జగన్‌ను అనుకరిస్తూ ఏదో ఇమిటేషన్ స్కిట్ చేస్తే… వైసీపీ నుంచి భీకరమైన ప్రతిస్పందనను రుచిచూడాల్సి వచ్చింది… ప్రైవేటుగా వీడియోలు పెట్టి మరీ క్షమాపణలు చెప్పుకున్న సంగతి తెలుసు కదా… మళ్లీ ఇప్పుడు తాజా స్కిట్లో దాన్ని ప్రస్తావించాడు రియాజ్… మరిచిపోలేకపోతున్నాడు ఫాఫం…
Ads
ఇదే ఎపిసోడ్… అవినాష్ తన భార్యతో స్కిట్లో కాసేపు కనిపించాడు… డాన్స్ చేశాడు… స్కిట్ కంటెంట్ ప్రకారం భార్య తనను అనుమానిస్తుంది… ఒక్కొక్కరినీ ఎగిరెగిరి తంతాడు ఆ భార్య పాత్రధారి… నేలాంటోడిని కాను, కాకపోతే తన గురించి నాగబాబును అడుగు అంటాడు అవినాష్… మొత్తం చెప్పమంటావా పాతవన్నీ అంటాడు నాగబాబు… వెంటనే నాలుక కర్చుకుని, నా బ్యాక్‌గ్రౌండ్ గురించి మాత్రం ఎత్తకండి సార్ అని బతిమిలాడతాడు అవినాష్… సరే, నీ కాపురం పాడుచేయనులే అంటాడు నాగబాబు… ఇదంతా మనం స్కిట్ అనుకుని నవ్వుకోవాలన్నమాట… అవినాష్ కథలు చాలా ఉన్నాయేమో, అవన్నీ యాది చేసుకుంటున్నాడేమోలే అనుకోవాలన్నమాట…
ఇదే ఎపిసోడ్… మరో స్కిట్లో ధన్‌రాజ్ వేణు,… ఒకప్పుడు జబర్దస్త్ కమెడియన్లే… వేణు నేను ఛాంబర్‌కు వెళ్లాను నువ్వొచ్చావా అంటాడు… నేను మసాజ్ పార్లర్‌కు వెళ్లాను, నువ్వొచ్చావా అని ధన్‌రాజ్ అంటాడు… పాతవన్నీ తవ్వుకుంటున్నారన్నమాట… యాది చేసుకుంటున్నారు… అంతేకాదు, ధన్‌రాజ్ అయితే చివరలో ‘‘ఎక్కడైనా వోకే గానీ, డబ్బు దగ్గర ఇగోకు పోకూడదు’’ అంటాడు నిర్వేదంగా… జబర్దస్త్ నుంచి డబ్బు ఇష్యూయేనా తరిమేసింది..? అదేనా మరిచిపోలేని చేదు ఇగో అనుభవం..?
ఇదే ఎపిసోడ్… బిగ్‌బాస్ ప్రియాంక, కమెడియన్ ఆర్పీ… నిజాయితీగా ప్రేమిస్తున్నానని అగ్రిమెంట్ రాయించుకుంటాడు, సంతకం చేయిస్తాడు ఆర్పీ… సంతకాలు పెట్టీ పెట్టీ చాలామంది బయటికి వచ్చారురా, ఎందుకురా మనకీ సంతకాలు..? ఎవడెవడివి ఏ అగ్రిమెంట్లు ఉన్నాయో, నావి ఏమైనా ఉంటే నాకు ఇచ్చేయండ్రా బాబూ అంటాడు నాగబాబు… జబర్దస్త్ మల్లెమాల తాలూకు అగ్రిమెంట్లు, సంతకాల మీద డైరెక్ట్ సెటైర్ అన్నమాట… ఎపిసోడ్ నిండా జబర్దస్త్ అనుభవాలు, ఇతర జ్ఞాపకాలు, ఆత్మచింతన… పనిలోపనిగా పూర్ణ, దీపిక పిల్లితో కూడా ఈటీవీ మీద సెటైర్లు నాలుగు వేయించలేకపోయావా ఓంకార్… అవునూ, నీకు జీటీవీలో, మాటీవీలో షోస్ ఉన్నాయి గానీ ఈటీవీలో లేవు కదా… ఓహో, అదా నీ ధీమా… కానివ్వు, కానివ్వు..!!
Share this Article