.
బహుశా ఒక ఎకరం ధర ఈ రికార్డు స్థాయిలో ఎక్కడా లేదేమో… అంతెందుకు ముంబైలో ఆదానీలు, అంబానీల ఇళ్లుండే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లోనూ ఈ ధర పలకదేమో…
నిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాడిన వేలం పాటలో హైదరాబాద్, రాయదుర్గం ఏరియాలో ఒక ఎకరం ధర అక్షరాలా 177 కోట్లు పలికింది… మళ్లీ ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్‌లో మూమెంట్ స్టార్టవుతున్నమాట నిజమే కానీ మరీ ఇంత ధరా అని రియల్ ఎస్టేట్ వర్గాల్లోనే ఓ విభ్రమ…
Ads
ఐతే కొన్ని కారణాలు, భవిష్యత్తు అవకాశాలు క్రోడీకరించి విశ్లేషిస్తే… ఈ ధర కాస్త ఎక్కువేమో కానీ లాజిక్ రాహిత్యం మాత్రం అస్సలు కాదు… అదెందుకో తెలియాలంటే కాస్త భిన్న కోణాలను టచ్ చేయాలి… చింతల్‌లో గజం లక్ష పలికింది అంటే పెద్ద విశేషం ఏమీ కాదు… కాస్త కమర్షియల్, మెయిన్ రోడ్లున్నచోట అది రీజనబుల్ రేటే…
మరి రాయదుర్గం..? గతంలో బీఆర్ఎస్ నేత, మాజీ బ్యూరోక్రాట్‌కు చెందిన రాజపుష్ప (నాట్ పుష్పరాజ్) ఎకరానికి నియోపోలిస్‌లో 100 కోట్లు పెట్టింది… 2023లో… ఈసారి వేలం వేస్తే 120 నుంచి 130 కోట్ల ధర పలకవచ్చునని అనుకున్నారు… కానీ ఏకంగా 177 కోట్లు… ఎందుకు..? (ఈ ధరకు కొన్నది కూడా బీఆర్ఎస్ మాజీ ఎంపికి చెందిన కంపెనీ… సో, ఈ భారీ ధరలో ఏదో సర్కారు డ్రామా గానీ, మార్కెటింగ్ జిత్తులు గానీ ఏమీ లేవు…)
ఆ ఏరియాలను మామూలు హైదరాబాద్‌తో పోల్చలేం… అవన్నీ విశ్వనగర ప్రాంతాలు… ఆల్రెడీ హైరైజ్ బిల్డింగుల్లో ఒక్కో ఫ్లాట్ 4 నుంచి 6 కోట్ల దాకా పలుకుతున్నయ్… ఇక విల్లాల ధరలు చెప్పనక్కర్లేదు… ఒకప్పుడు హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఎట్సెట్రా కాస్ట్‌లీ ఏరియాస్… వాటిని మించి కోకాపేట, నాలెడ్జి సిటీ వంటివి చాలా దూరం ముందుకు వెళ్లాయి…
ఇక్కడ జీవనవ్యయం కూడా చాలా ఎక్కువ… ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇంటి అద్దె రూ.2.5 లక్షలు… ఐటీ, నివాస కేంద్రాలకు నిలయంగా ఉండటమే కాదు, సినీ, వ్యాపార, రాజ కీయ ప్రముఖులు నివాసముండే ప్రాంతం… అంతేకాదు, ట్రంపు పుణ్యమాని అమెరికన్ గ్లోబల్ కంపెనీలు ఇండియాలో పెద్ద ఎత్తున జీసీసీ ( గ్లోబల్ కేపబులిటీ సెంటర్) లను ఏర్పాటు చేయబోతున్నాయి…
ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలు, ఫార్మా, ఫైనాన్స్, ఇతర బహుళజాతి సంస్థల కార్యకలాపాలకు… పెద్ద కంపెనీలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాదు అనువుగా భావిస్తున్నాయి… అందుకే ఇంత కాస్ట్‌లీ ఏరియా… 2017లో ఎకరం రూ.42.59 కోట్లు ఉండగా…. తాజాగా రూ.177 కోట్లకు పెరిగింది… ఎనిమిదేళ్లలో నాలుగు రెట్లు పెరిగింది…
భౌగోళిక అనుకూలత కారణంగా హైదరాబాద్ ఇతర ప్రధాన నగరాలకన్నా మేలు… ప్లస్ భాష, కులం, మతం పేరిట ఇక్కడ సంకుచిత భావనలు లేవు… అందరినీ ఆదరించే నగరం ఇది… ప్లస్ మెట్రోపాలిటన్ కల్చర్… ఇంటర్నేషనల్ స్థాయి స్కూళ్లు, హాస్పిటళ్లు, మాల్స్, థియేటర్లు… వాట్ నాట్… అమెరికా నగరాలను తలదన్నే సౌకర్యాలు…
ఐతే ఇవన్నీ ఎగువ మధ్యతరగతి, ఉన్నతోద్యోగులు, ధనికాదాయ వర్గాలకు మాత్రమే అనువు… ఇప్పుడు 177 కోట్లకు కొన్న భూమి, అంటే గజం దాదాపు 4 లక్షలు… ఈ ఖర్చుతో హైరైజ్ బిల్డింగులు కడితేనే గిట్టుబాటు… స్థూలంగా ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు గ్యారంటీగా ఎంతోకొంత పుష్ ఇస్తుంది, కానీ ఇతర ప్రాంతాల్లో మూమెంట్ వస్తుందానేది చూడాలిక…
ప్రభుత్వం ఎన్ని అంతస్థులకు, అంటే ఎంత మేరకు ఎక్కువ నిర్మాణస్థలానికి అనుమతి ఇస్తుందనే అంశమే ఈ హైరైజ్ రేట్లు, బిల్డింగుల లెక్కల్ని శాసిస్తాయి… ఒకప్పుడు బంజారా హిల్స్, జుబిలీ హిల్స్ సంపన్న స్థలాలు… మరో నాలుగు రోజులు ఆగండి, అవీ ఓల్డ్ సిటీలే..!!
Share this Article