నో డౌట్… దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి ఎక్సలెంట్… మొన్నటి దాకా కశ్మీర్‌లో ఉన్న పరిస్థితులను కళ్లకుకట్టాడు… మన సైనికుల త్యాగాలు ఎలాంటివో, అక్కడి ఉగ్రవాదం టాక్టిస్ట ఏమిటో… ఆ పైశాచికత్వం ఏమిటో ఆవిష్కరించాడు…
అమరన్ సినిమాకు సంబంధించి నా ఫస్ట్ వోటు సాయిపల్లవి… ఆమె తప్ప వర్తమాన సినిమా తారల్లో ఎవరూ ఆ పాత్రను అంత బాగా పోషించలేరేమో… మొన్న అల్లు అరవింద్ అన్నట్టు… నిజంగా ఏడిపించేసింది…
నేను చనిపోయినా ఏడవొద్దు అన్న ప్రేమిక భర్త మాట కోసం… గాజు కళ్లతో ఆమె తన భర్త అంత్యక్రియలు, అశోకచక్ర స్వీకరణ సందర్భాల్లో అభినయించిన తీరు… వాట్ ఏ ట్రెమండస్ ఇన్వాల్వ్‌మెంట్… కళ్లలో నీటితెర, కానీ చెంపలపైకి కారని కన్నీటి బొట్టు… దర్శకుడా, నువ్వు గ్రేట్‌రా…)
Ads
ఆమె మనల్ని అనివార్యంగా ఓ అమర జవాను జీవితంలోకి, ఆ జవాను భార్య జ్ఞాపకాల్లోకి… అనుభూతుల్లోకి లాక్కెళ్తుంది… ఆమె నవ్వులు, మురిపాలు, కవ్వింతలు, అభిమానం, ప్రేమ, వేదన, ఏడుపు, దుఖంలోకి మనల్ని కూడా తీసుకెళ్తుంది…
ప్రేమ మొదటి దశలో… ఆమె కనబరిచిన ప్రేమ, సరసం, చిలిపితనం, నవ్వు, సరదా, యాంగ్జయిటీ, కమిట్మెంట్ తదితర ఉద్వేగాల్ని వదిలేయండి… ప్రేమిక భర్త మరణించాడనే వార్త కన్‌ఫరమ్ అయ్యాక ఆమె ఏడుపు, నటన నిజంగానే సున్నిత హృదయులను అక్షరాలా కన్నీళ్లు పెట్టిస్తుంది…
నో డౌట్… జాతీయ అవార్డుకు అర్హమైన నటన… ఇవన్నీ వదిలేద్దాం… ఆమె గురించి మరీ మరీ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు… కొన్ని మైనసులున్నాయి… ఉగ్రవాదులతో పోరాట సందర్భాల్లో బీజీఎం ఆప్ట్‌గా లేదు… ఆర్మీ సెలక్షన్ ఎగ్జామ్ ఎంత కఠినమో చూపించాల్సింది… కానీ..?
శివ కార్తికేయన్‌ను వదిలేయండి… ఈ పాత్రలో సాయిపల్లవి సరసన నటించడమే తన లక్కు… ఈ సినిమా కథ ఓ ఆర్మీ ఆఫీసర్ త్యాగంకన్నా ఆ ఆఫీసర్ భార్య కథ… ఆహా, సాయిపల్లవి అక్షరాలా ఈ సినిమాను పైకి లేపింది తన భుజాల మీద… దర్శకుడు పెరియస్వామి ఆమెను ఎంచుకోవడంలోనే సగం సక్సెస్ సాధించాడు…
సరే, ఇదంతా వేరు… సిపాయి విక్రమ్ సింగ్ గురించి చెప్పుకోవాలి… ఓచోట అంటాడు… ముకుంద్ సర్, నా కొడుకు పేరు అభిషేక్ సర్, వాడూ ఆర్మీలో చేరాలి… అయిదో జనరేషన్ సర్… వావ్… ఆఫ్టరాల్ ముకుంద్ ఫస్ట్ జనరేషన్ ఆర్మీ ఆఫీసర్, కానీ విక్రమ్ పూర్వీకులూ ఆర్మీ సేవలోనే… వాళ్లు కదా ఈ దేశపు ముద్దుబిడ్డలు… (ఈ పాత్రను ఇంకాస్త ఎమోషనల్‌గా తీర్చిదిద్దితే బాగుండేదేమో…)
హర్యానా వాళ్లది… ఓచోట ముకుంద్ కమాండర్ అంటాడు… ఆఫీసర్, నువ్వు రాష్ట్రీయ రైఫిల్స్ కోరుకోలేదు, అదే నిన్ను కోరుకుంది అని… ఎస్, ఉగ్రవాద పిశాచాల వేటలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి, మనకు భద్రత కల్పించే వింగ్ అది… సోకాల్డ్ లిబరల్స్, టిపికల్ మేధావులు, లెఫ్ట్ పిశాచాలు అంగీకరించరు… అది ఈ దేశ దురదృష్టం…
ఆమధ్య ఎవరో లీడర్, ప్రజాప్రతినిధి గాడిద అన్నాడు… మందు కోసం, జీతం కోసం ఆర్మీలో చేరతారని..! ఇడియెట్… ఒక్కరోజు బోర్డర్‌లో డ్యూటీ చేయరా ఫూల్ అని తిట్టిపోశారు అందరూ… అయిదు జనరేషన్స్ ఆర్మీలోనే అంటే అర్థం చేసుకోవాలి… ఈ దేశ ప్రజల రక్షణ కోసం ప్రాణాల్ని త్యాగం చేయడం ఏమిటో ఈ సినిమాలోని విక్రమ్ సింగ్ పాత్ర చెబుతుంది…
( డర్టీ యాంటీ నేషన్ కేరక్టర్లకు దేశ రక్షణ విలువ తెలియదు… రేప్పొద్దున అరాచక శక్తులు ఇంటి ముందు నిలబడి, ఇంటి ఆడవాళ్లను చుట్టుముట్టినప్పుడు, పిల్లల ప్రాణాలను మింగేస్తున్నప్పడు… ఓ సాహస జవాను త్యాగాల విలువ ఏమిటో అర్థమవుతుంది… ఓ ఉన్మాద ఉగ్రవాద పిశాచికి మన మీడియాలో దక్కే ప్రాధాన్యం, మన డర్టీ పొలిటిషియన్స్ అవకాశవాద, స్వార్థ ధోరణులకు దక్కే ప్రాధాన్యం ఇలాంటోళ్లకు దక్కకపోవడం ఈ దేశ దౌర్భాగ్యం… మన మీడియా జైష్ ఏ మహ్మద్‌కు ఏమాత్రం తీసిపోదు కదా… )
మేజర్ ముకుంద్ వరదరాజన్ క్లిష్టమైన ఆపరేషన్లలో తన వెంట ఉండి, చివరి ఆపరేషన్ తుది క్షణాల్లో తనను షీల్డ్ చేస్తూ, ఉగ్రవాద పిశాచి తూటాలకు నేలకొరుగుతాడు… నిజ జీవితంలోనూ అదే పేరు… మరణానంతరం శౌర్య చక్ర పురస్కారం లభించింది అతనికి… ఇలాంటి ఎందరు జవాన్లు ప్రాణాలర్పిస్తేనే కదా మనం భద్రంగా బతుకుతున్నది…!!
Share this Article