.
Pardha Saradhi Potluri …….. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు! డోనాల్డ్ ట్రంప్ కి ధన్యవాదములు! ఆమ్ ఆద్మీ పార్టీ సుదీర్ఘ పాలనకి తెరపడింది!
1998 లో ఢిల్లీలో అధికారం కోల్పోయిన బీజేపీకి 28 ఏళ్ళ తరువాత అధికారం దక్కింది! Well…! ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి విశ్లేషకులు ఎన్ని రకాల కారణాలు చెప్పినా మొదటి ప్రధాన కారణం మాత్రం గుర్తించలేకపోయారు!
Ads
ఢిల్లీలో గత 12 ఏళ్లుగా అక్రమంగా ఉంటున్న బాంగ్లాదేశ్, మియాన్మార్ రోహింగ్యాలు వేసిన ఓట్లతోనే కేజ్రీవాల్ గెలుస్తూ వచ్చాడు అన్నది సత్యం! కేజ్రీవాల్ అధికారంలో ఉన్నంత వరకూ తమని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనే ధీమా ఉండేది వాళ్లకి !
కానీ ట్రంప్ ఎప్పుడైతే అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులని వెనక్కి పంపిస్తాను అని చెప్పడమే కాదు, చేసి చూపించడం మొదలుపెట్టాడో… భారత్ లో, ముఖ్యంగా ఢిల్లీ చుట్టు పక్కల ఉంటున్న కేజ్రీవాల్ ఓటు బ్యాంక్ లో భయం మొదలయ్యింది! ఇండియా కూడా అలాగే చేస్తుందని..!
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తమని కాపాడలేడు అని తెలుసుకొని బీజేపీకి ఓటు వేశారు! అయితే ఈ చర్య వల్ల వాళ్ళని దేశం నుండి బీజేపీ పంపించదు అని కాదు కానీ కనీసం బేరం ఆడడానికి పనికి వస్తుందనే ఆశ..!
“ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా, జరగబోతున్నా అది ఇమామ్ లకి తెలిసిపోతుంది! వాళ్లు ఏ దేశంలో ఉంటున్నా వాట్సాప్ ద్వారా సందేశం వస్తుంది ” కేజ్రీవాల్ ఓటమికి యమునా నది కాలుష్యం, శీష్ మహల్, లిక్కర్ స్కామ్ లు చిన్న కారణాలు. అక్రమ వలసదారుల భయం అనేది కేజ్రీవాల్ ఓటమికి దారి తీసింది!
పోలింగ్ సరళి, గెలిచిన వారి ఓట్లు, ఓడిపోయిన వారి ఓట్లని పరిశీలిస్తే భారీ మెజారిటీలు నమోదు కాలేదు. మీ దగ్గర గోధుమలు కిలో ఎంత? మా దగ్గర ఇంత. తిరిగి స్వదేశానికి వెళ్ళాల్సి వస్తే అది ఆత్మహత్యతో సమానం అనే భయం మొదటిసారిగా అక్రమ వలసదారులలో వచ్చింది కాబట్టే బీజేపీకి ఓటు వేశారు.
బెయిల్ మీద ఉన్న కేజ్రీవాల్ ఎప్పుడైనా తిరిగి జైలుకెళతారు అనే విషయం అక్రమ వలసదారులకి తెలుసు! ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాజీద్ రషీది బహిరంగంగానే నేను బీజేపీకి ఓటు వేశాను అని రెండు రోజుల క్రితం ప్రకటించినప్పుడే కేజ్రీవాల్ ఓటమి ఖాయం అయిపోయింది!
సాజీద్ రషీది మాటల్లో…. ‘‘అన్ని రాజకీయ పార్టీలు ముస్లిమ్స్ ని ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నాయి తప్పితే చేసింది ఏమీ లేదు! అందుకే నేను బీజేపీకి ఓటు వేశాను.
రేప్పొద్దున బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే అక్రమ వలసదారుల ఏరివేత మొదలయితే ఇదే సాజీద్ రషీది మధ్యవర్తిత్వం చేయడానికి అక్రమ వలసదారుల చేత ఓట్లు వేయించాడు! ఏర్పడితే కాదు, కానీ రెండు రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది!
బీజేపీ స్ట్రాటజీ!
లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయడం అనేది కేజ్రీవాల్ ఓటమికి పెద్దగా ఉపయోగపడదు. కానీ అక్రమ వలసదారుల ఓట్లు కేజ్రీవాల్ ని గెలిపిస్తాయి! గత డిసెంబర్ నెలలో ఢిల్లీ పోలీసులు కార్డన్ సెర్చ్ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆ స్పెషల్ డ్రైవ్ లో ఒక్క రోజులోనే వెయ్యికి పైగా బాంగ్లాదేశ్ నుండి వచ్చి అక్రమంగా ఆధార్, రేషన్ కార్డులు తీసుకొని ఉంటున్న వారు బయటపడ్డారు!
ఈ విషయం పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు కానీ ప్రభావం బాగానే చూపించింది! అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకూ స్పెషల్ డ్రైవ్ జరిగింది! అంతిమంగా ఎంత మంది అక్రమ వలసదార్లని గుర్తించారు అనే లెక్కలు బయటపెట్టలేదు ఢిల్లీ పోలీసులు, కానీ ఎంత మంది ఉన్నారో సాజీద్ రషీదికి తెలుసు. స్పెషల్ డ్రైవ్ పనిచేసింది!
అంతర్జాతీయ సహాయం అందలేదు!
గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో జార్జ్ సోరోస్ నుండి కావాల్సినంత డబ్బు ముట్టింది కేజ్రీవాల్ కి! మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వగానే జార్జ్ సోరోస్ కేజ్రీవాల్ ని పక్కన పెట్టేసాడు! జార్జ్ సోరోస్ ఒకవైపు ఎలాన్ మస్క్ నుండి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు మరోవైపు పుతిన్ హిట్ లిస్ట్ లో ఉండడం వలన కేజ్రీవాల్ కి సపోర్ట్ లేకుండా పోయింది!
మరోవైపు ఖలీస్తాన్ గ్యాంగ్ నుండి డబ్బులు రాకపోగా బండారం బయటపెడతామనే బెదిరింపులు రావడం కేజ్రీవాల్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసింది! ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ బాడీ లాంగ్వేజ్ ఓటమి తప్పదనే సంకేతాలు కనిపించాయి!
ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం!
గెలవగానే పిచ్చి వ్యాఖ్యలు చేయకుండా హుందాగా ఉండాలి! కేజ్రీవాల్ బీజేపీతో పాటు కాంగ్రెస్ ని కూడా ఎదుర్కోవాల్సి రావడం రాజకీయ తప్పిదం!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు!
బీజేపీ – 48
ఆప్ — 22
కాంగ్రెస్ 00
బీజేపీకి అతి పెద్ద విజయం ఇది!
కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు ఓడిపోవడమే విచిత్రం! కాంగ్రెస్ ని దూరం పెట్టడం వలన ఆప్ ఓడిపోయింది అనడానికి ఆధారాలు లేవు.
కేజ్రీవాల్ రెండు సార్లు గెలిచిన న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో ( మునుపు గోలే మార్కెట్ గా ఉండేది కానీ నియోజకవర్గ పునర్విభజన తరువాత న్యూ ఢిల్లీ అయింది ) ఈసారి ఓడిపోవడం మాత్రం కాంగ్రెస్ వల్లనే!
బీజేపీ నుండి పర్వేష్ సాహిబ్ సింగ్ పోటీ చేయగా, ఆప్ నుండి కేజ్రీ వాల్, కాంగ్రెస్ నుండి సందీప్ దీక్షిత్ పోటీ చేశారు! కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ కేవలం కేజ్రీవాల్ ఓటమి కోసమే పని చేశాడు తప్పితే తాను గెలవాలి అని కాదు!
బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఢిల్లీ మాజీ బీజేపీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కొడుకు. కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ ఢిల్లీ మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కొడుకు. కేజ్రీవాల్ షీలా దీక్షిత్ గారి మీద ఆవిడ వయసుని కానీ, మహిళ అని కానీ చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈసారి కాంగ్రెస్ తో పొత్తు లేకపోవడంతో సందీప్ దీక్షిత్ కేజ్రీవాల్ ఓటమి మాత్రమే లక్ష్యంగా పోటీ చేశాడు.
కాంగ్రెస్ సందీప్ దీక్షిత్ కి వచ్చిన ఓట్లు 4,568.
కేజ్రీవాల్ ఓడిపోయింది 4,089 ఓట్ల తేడాతో!
ప్రత్యర్థులని ఎగతాళి చేస్తే ఏమవుతుందో కేజ్రీవాల్ ఒక లాండ్ మార్క్ గా ఉంటాడు ఎప్పటికి! ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కి వచ్చేది ఏదీ ఉండదు అని తెలిసే సందీప్ దీక్షిత్ కేజ్రీవాల్ ఓటమి లక్ష్యంగా పనిచేశాడు!
షీలా దీక్షిత్ కుమార్తె అయిన లతిక కూడా కేజ్రీవాల్ ఓటమి లక్ష్యంగా సోదరుడితో కలిసి ప్రచారం చేసింది!నేను మోనార్క్ ని! నన్నెవ్వరూ ఓడించలేరు! నన్ను ఓడించాలి అంటే ఇంకో జన్మ ఎత్తాలి!
ప్రధాని మోడీని ఉద్దేశించి కేజ్రీవాల్ చేసిన ఈ వీడియోని ఇప్పుడు బీజేపీ వైరల్ చేస్తున్నది! భవిష్యత్ ఏమిటీ?ఆప్ పార్టీ శకం ముగిసినట్లే! ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉండే ఏ పార్టీ అయినా సరే ఆ వ్యక్తి వల్లనే నాశనం అవుతుంది!
సిద్ధాంతం అంటే ఉచిత పధకాలు కావు!
కేజ్రీవాల్ ఒక్క ఫ్లైఓవర్ కూడా కట్టలేదు!
కేజ్రీవాల్ ఒక్క స్కూల్ కూడా కొత్తది కట్టలేదు!
కేజ్రీవాల్ ఒక్క ఆసుపత్రి కూడా కొత్తది కట్టలేదు!
ఉచిత బస్ ప్రయాణం! ఉచిత విద్యుత్!
కానీ ఢిల్లీ వాసులకి కొత్తగా ఒక్క మంచినీటి పైప్ లైన్ వేసి నీళ్లు ఇవ్వలేకపోయాడు కానీ తన ప్రమోషన్ కోసం 700 కోట్ల విలువ చేసే ప్రకటనలు ఇచ్చాడు పత్రికలకి, టీవి ఛానెల్స్ కి.
ఢిల్లీ మత ఘర్షణల మీద ఢిల్లీ అసెంబ్లీ సమావేశంలో హిందువుల మరణాల మీద వెకిలి నవ్వులు నవ్విన కేజ్రీవాల్ ని ఎవరు మరిచిపోగలరు? స్వాతీ మలీవాల్ మీద గూండాల చేత చేయించిన దాడిని ఎవరు మరిచిపోగలరు? KARMA RETURNS BACK!
Share this Article