చాన్నాళ్లుగా ఆమె వార్తల్లో లేదు… అసలు చాలామందికి ఆమె గురించి తెలియదు… మొన్న రిపబ్లిక్ దినోత్సవం రోజు సోనీ ఇండియన్ ఐడల్ వేదిక మీద కనిపించింది… ఆమెతోపాటు అనేకమంది ఆర్మీ, సీఆర్పీఎఫ్, నేవీ అధికారులు కూడా వచ్చారు… సింగర్స్ ఆరోజున దేశభక్తి గీతాలను ఆలపించారు… అదంతా వేరే సంగతి… ఆమె గురించి చెప్పనేలేదు కదూ… ఓ ఇన్‌స్పైరింగ్ స్టోరీ… పేరు షాహిదా పర్వీస్ గంగూలీ…
కల్లోలిత పూంచ్ జిల్లాలో ఏదో మారుమూల పల్లెలో పుట్టింది… మొత్తం ఆరుగురు తోబుట్టువులు… ఆమెకు నాలుగేళ్ల వయస్సులోనే తండ్రి మరణించాడు… తల్లికి ఒకటే పట్టుదల, కష్టపడి పిల్లలందరినీ చదివించింది… ఈమె మ్యాథ్స్‌లో గ్రాడ్యుయేషన్ అయ్యాక జమ్ముకు వెళ్లాల్సి వచ్చింది… అక్కడ తన సోదరుడికి పోస్టింగ్… కానీ..?
రోజూ విపరీతమైన శ్రమ… పొద్దున్నే 5 గంటలకు లేవాలి… ఫ్యామిలీ కోసం వండాలి… ఉదయం వేళల్లో ఓ ప్రైవేటు స్కూల్‌లో పనిచేయాలి… లంచ్ కోసం వచ్చి ఎంఎస్సీ కరెస్పాండెన్స్ కోసం చదువుకోవాలి… ట్యూషన్లు… తరువాత ఇంటికి వెళ్లి డిన్నర్ ప్రిపేర్ చేయాలి… మధ్యమధ్య వీలు చూసుకుని రేడియో అనౌన్సర్‌గా కూడా చేసేది… డబ్బు కావాలి కదా… 1995లో సబ్ఇన్‌స్పెక్టర్ పోస్టుకు అప్లయ్ చేసింది…
Ads
ఇక చూడండి… అసలే మహిళ… అందులోనూ ముస్లిం… తను పోలీస్ కొలువు చేస్తుందట… అదీ నిత్యకల్లోలిత ప్రాంతమైన జమ్ముకాశ్మీర్‌లో… నథింగ్ డూయింగ్ ఆ కొలువులో చేరడానికి వీల్లేదని కుటుంబం, బంధుగణం ఒత్తిళ్లు… ఆమె వినలేదు… యూనిఫామ్ వేయాల్సిందేనని పట్టుబట్టింది… ఉదంపూర్‌లోని పోలీస్ అకాడమీలో రెండేళ్లు శిక్షణ… తరువాత రాజౌరిలో పోస్టింగ్… ఆ ఏరియా తెలుసు కదా… తెల్లారిలేస్తే తుపాకులు, కాల్పులు… కాశ్మీర్‌లో గన్ పెద్ద ఇష్యూ కాదు, కానీ గన్ ఎవరి కోసం, ఎవరి వైపు పట్టుకుని నిలబడ్డావనేదే అసలు లెక్క…
స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపులో పనిచేయడానికి కూడా చాన్స్ ఇచ్చారు… అంటే తెలుసు కదా, మిలిటెంట్ ఏరియాల్లోకి కూడా ధైర్యం వెళ్లి ఆపరేషన్స్ చేయాల్సిందే… తను 80 మంది పోలీసులు, పోలీస్ అధికార్లకు లీడర్… మిలిటెంట్లకు వ్యతిరేకంగా చేసిన ఆపరేషన్స్‌కు గాను ఈ డేర్ డెవిల్‌కు the Northern Army Com-mander’s commendation card లభించంది… చాలా అరుదు… 2002లో ఆర్మీ ఆఫీసర్ గౌతమ్ గంగూలీని పెళ్లి చేసుకుంది…
క్రమేపీ ఆమెకు డెత్ థ్రెట్స్ పెరిగాయి మిలిటెంట్ల నుంచి… సలీమా బేగంను చంపినట్టే చంపేస్తామని బెదిరింపులు… సలీమాను ఓ దర్గా సమీపంలో క్లోజ్ రేంజ్‌లో కాల్చి చంపారు… తరువాత ఆమెను సీఐడీ విభాగానికి బదిలీ చేశారు… నాగాలాండ్ పంపించారు… కానీ ఆమె ఇష్టపడలేదు… దాంతో మళ్లీ జమ్ము కాశ్మీర్ పోలీస్ విభాగంలోనే రీపోస్టింగ్ … ఆమెకు ఇద్దరు కొడుకులు… ‘‘ఓ ఆర్మీ ఆఫీసర్ భార్యను, ఇద్దరు పిల్లల తల్లిని… వాటికన్నా ముందు నేను నా డ్యూటీ పట్ల గౌరవాన్ని కలిగిన దాన్ని… ఉన్నాయి, ఒక మహిళ తనకు ఇష్టమొచ్చిన ఫీల్డ్‌లో రాణించడానికి చాలా అడ్డంకులు ఉంటాయి, నాకూ అడ్డుపడ్డాయి, అందులో మగవివక్ష కూడా ఒకటి…’’ అంటుండేది ఆమె…
ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంకు వచ్చిన ఆమెను ఎవరో అడిగారు… ‘‘మీరు ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు కదా… ఇప్పటివరకూ ఎన్ని ఎన్‌కౌంటర్లు చేసి ఉంటారు..? భయం కలిగేది కాదా’’… దీనికి ఆమె… ‘‘ఎన్ని ఎన్‌కౌంటర్లు అనే లెక్క ఎలా చెప్పగలను..? పనిచేసిందే స్పెషల్ ఆపరేషన్స్‌లో కదా… దాదాపు రోజుకొక ఎన్‌కౌంటర్ సగటున జరిగేది… ఎన్‌కౌంటర్లకు టైమ్, లెక్క ఉండదుగా… భయం అంటారా..? తెల్లారి లేస్తే అదే పని కదా…’’ అని నవ్వుతూ బదులిచ్చింది… ఎస్, డేర్ డెవిల్…
Share this Article