వర్తమానంలో సినిమా మార్కెటింగ్, బజ్ క్రియేట్ చేయడం కోసం కొన్ని ప్రీమియర్ షోస్ వేసేయాలి… అంటే ఫ్రీగా చూపించాలి… వాళ్లు సినిమా బాగుందని మౌత్ టాక్ స్ప్రెడ్ చేయాలి… సోషల్ మీడియాలో మొహమాటం రివ్యూలు రాయాలి… కొందరు సైట్ల వాళ్లకు డబ్బులిచ్చి పాజిటివ్ స్టోరీలు, రివ్యూలు రాయించాలి… ఇదీ నిర్మాతలు నమ్ముతున్న సంగతి… కానీ ఒక్కమాట…
బలగం అవేవీ లేకుండా సూపర్ హిట్ అయిపోయింది… ఊరూరా జనమంతా ఒక్కచోట గుమిగూడి, కలిసి సినిమా చూస్తున్నారు… లీనం అవుతున్నారు… కానీ లెక్కకు మిక్కిలి ప్రీమియర్లు వేసి, ఎవరెవరినో పిలిచి, ఫ్రీగా సినిమా చూపించిన రంగమార్తాండ మట్టిగొట్టుకుపోయింది… మస్తు మంది పాజిటివ్ రివ్యూలు రాశారు… తీరా చూస్తే ఏముంది అందులో..? ఇళయరాజా కర్ణకఠోరం, చెత్త కేరక్టరైజేషన్… యువతరం రిజెక్ట్ చేసింది…
సో, ప్రీమియర్ షోల వ్యూహం క్లిక్కవుతుందనే నమ్మకం ఏమీ లేదు… సినిమాలో దమ్ముంటే తప్ప సరైన మౌత్ టాక్ రాదు, చిట్కాలతో సినిమాలు నడవవు… కాస్త హిట్ టాక్ వస్తే, బజ్ క్రియేట్ అవుతే ఓటీటీకి, శాటిలైట్ టీవీలకు అమ్ముకునే రేట్లు పెరుగుతాయేమో గానీ జనం అంత తేలికగా థియేటర్లకు రారు… సబ్జెక్టు నచ్చాలి, కేస్టింగ్ నచ్చాలి, జానర్ తెలియాలి, మౌత్ టాక్ బాగుండాలి… అప్పుడే జనం థియేటర్లకు కదులుతారు…
Ads
ఇప్పుడు దిల్ రాజు కూడా అదే భ్రమలో పడిపోయాడు… రంగమార్తాండ శైలిలోనే ప్రీమియర్ షోలు వేస్తున్నాడు శాకుంతలం సినిమా కోసం… సేమ్, రంగమార్తాండలాగే శాకుంతలం చాన్నాళ్లుగా నిర్మాణం సా-గు-తూ-నే ఉంది… దర్శకుడికి ఈమధ్యలో హిట్లేమీ లేవు… ముక్కూమొహం తెలియని హీరో… (కాకపోతే బాగున్నాడు…) చైతూతో విడిపోయి బోలెడంత నెగెటివిటీని మూటగట్టుకున్న సమంత హీరోయిన్…
హిందీలో పాటలు చేసి, తెలుగులోకి డబ్ చేసినట్టున్నాయి… అవి అంతగా తెలుగు వాళ్లను కనెక్ట్ కాలేదు… పైగా నిన్నమొన్నటిదాకా సినిమా మీద హైప్ క్రియేషన్ కూడా ఏమీ లేదు… దీనికి ప్రిరిలీజు తంతులు కూడా ఏమీ లేనట్టున్నాయి… ప్రీమియర్లు వేస్తే ఒకటీరెండు సైట్లలో నెగెటివో పాజిటివో తెలియని మాడా రివ్యూలు కనిపించాయి… మొహమాటంతో సినిమాను మెచ్చుకోలేక, వదిలేయలేక అవస్థ పడ్డట్టుగా ఉన్నయ్… సోషల్ మీడియాలో అవీ దిక్కులేవు…
పైగా అక్కడక్కడా సినిమా నాట్ బ్యాడ్ అనే టాక్ స్ప్రెడ్ అవుతోంది తప్ప బాగుందనే టాక్ ఏమీ రావడం లేదు… అంటే అనవసరంగా ఈ ప్రీమియర్ల ఎత్తుగడను అమలు చేసి, నష్టపోతున్నాడన్నమాట నిర్మాత… అయితే మొదటి షో మీద మంచి టాక్ వస్తే మాత్రం సినిమాను ఎవరూ ఆపలేరు… పైగా పాన్ ఇండియా కథ… నిజానికి ఇలాంటి సినిమాలు రావాలి… అశ్లీలం లేకుండా, అడ్డమైన హీరోయిక్ సినిమాలు గాకుండా, మంచి ట్రీట్‌మెంట్‌తో గనుక సినిమాలు వస్తే అంతకుమించి కావల్సిందేముంది..? కానీ శాకుంతలం ఆ దిశలో పాజిటివ్ టాక్ మూటగట్టుకోలేదు ఫాఫం… ఎవరూ ఏమీ రాయడం లేదంటే, రంగమార్తాండకన్నా భీకరంగా ఉందా ఏమిటి కొంపదీసి..!!
Share this Article