Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ పాత్రల మంచితనంలో ప్రేక్షకులు తడిసి ముద్ద కావల్సిందే…

June 29, 2024 by M S R

A great classic from K Viswanath . మంచి సినిమా . మంచి సినిమా అంటే సినిమాలో పాత్రలన్నీ మంచితనానికి ప్రతీకలే . ఈ పాత్రల మంచితనంలో ప్రేక్షకులు తడిసి ముద్ద కావలసిందే . సత్యనారాయణకు ఈ సినిమా ఓ పెద్ద మలుపు . విలన్ పాత్రలతో పేరు తెచ్చుకున్న సత్యనారాయణ అన్నగా , మంచివాడిగా గొప్పగా నటించారు . సత్యనారాయణలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అని తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు ఆరోజుల్లో .

శారద గురించి చెప్పేదేముంది !? మనుషులు మారాలి , కాలం మారింది వంటి సినిమాలతో ఊర్వశి అయిపోయింది శారద . ఈ సినిమాకు శారద అనే టైటిల్ పెట్టిన విశ్వనాధ్ ని మెచ్చుకోవాలి . బహుశా ఆ పేరు ఆయనకు ఇష్టమైన పేరేమో ! శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రి కుమార్తె పేరు కూడా శారదే . ఈ సినిమాలో శారద , శోభన్ బాబు , జయంతిల నటన గురించి ఎంత చెప్పినా తక్కువే .

ఎలా అయితే సత్యనారాయణకు మంచి మలుపుని ఇచ్చిందో అలాగే రావు గోపాలరావుకి కూడా మంచి మలుపే వచ్చింది . ఇతర పాత్రల్లో అల్లు రామలింగయ్య , రాజబాబు , సారధి ప్రభృతులు నటించారు . సాధారణంగా విశ్వనాథ్ సినిమాల్లో చంద్రమోహన్ ఉంటారు . ఎందుకనో ఈ సినిమాలో చంద్రమోహన్ లేడు మరి !!

Ads

ఈ సినిమాకు ఇంత గొప్ప పేరు రావటానికి మరో ముఖ్యుడు సంగీత దర్శకుడు చక్రవర్తి . ఆయనకు రెండో సినిమా . ఈ సినిమాతోనే ఆయన ప్రభంజనం ప్రారంభమయిందని చెప్పుకోవచ్చు . వ్రేపల్లె వేచెను వేణువు వేచెను వనమంత వేచేనురా నీ రాక కోసం నిలువెల్ల కనులై నీ రాధ వేచేనురా . ఎంత అందమైన సాహిత్యం . Hats off to C Narayana Reddy . అలాగే పాడిన సుశీలమ్మకు .

అలాగే మరో శ్రావ్యమైన పాట . శారదా నను చేరవా ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గా పాట . మిగిలిన పాటలు రాధాలోల గోపాల గానవిలోల యదుబాల , నీ గుడిలో గంటలు మ్రోగినవి నా గుండెలో మంటలు రేగినవి , శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారి చెంతకు చేరని వేళ పాటలు కూడా శ్రావ్యంగా ఉంటాయి . అటో ఇటో తేలిపోవాలి అనే పాటలో చక్రవర్తి కంఠం కూడా ఉంది .

ఈ సినిమా మా గుంటూరు జిల్లా వారిది . శారద , విశ్వనాథ్ , చక్రవర్తి ముగ్గురూ మా జిల్లా వారే . చక్రవర్తి జన్మ స్థలం తాడికొండ వద్ద పొన్నెకల్లు . శారద 1996 లో తెనాలి నుండి లోకసభకు గెలిచారు కూడా . అయితే ఈ సినిమా ఔట్ డోర్ షూటింగ్ అంతా తూర్పు గోదావరి జిల్లా ఐనగంటి వారి పేటలో తీసారు . నదీ నేపధ్యం కావాలి కదా !

సికింద్రాబాదులో 200 రోజులు ఆడిన ఈ సినిమా అయిదు కేంద్రాలలో వంద రోజులు ఆడింది . కన్నడంలో సక్సెస్ అయిన యాద జన్మద మైత్రికి రీమేక్ మన తెలుగు సినిమా . కల్పన లీడ్ రోల్లో నటించింది . ఈ కన్నడ సినిమాకు మాతృక జీవన చదరంగం అనే నవల . మన తెలుగు సినిమా తర్వాత తమిళంలోకి కూడా రాధ అనే టైటిల్ తో , ప్రమీల హీరోయిన్ గా రీమేక్ అయింది . హిందీలోకి దుల్హన్ అనే టైటిల్ తో జితేంద్ర , హేమమాలిని , జమునలతో రీమేక్ అయింది . జయంతి పాత్రను జమున నటించింది .

ఈ సినిమాలో విశ్వనాథ్ దర్శకత్వం ఎంత గొప్పగా ఉంటుందంటే , సినిమా చివర్లో శారద , సత్యనారాయణ , రావు గోపాలరావు పడవలో తమ గ్రామానికి బయలుదేరుతారు . ఆ పడవ తెరచాప అంతా చిల్లులతో ఉంటుంది . శారద జీవితం చినిగిపోయిందని ఆ తెరచాప ద్వారా కూడా చూపించారు విశ్వనాథ్ . కళ్ళు చెమర్చకుండా థియేటర్లో నుంచి బయటకు రావటం కష్టమే .

బహుశా మా తరంలో చూడనివారు ఎవరూ ఉండరు . ఈ తరంలో చూడనివారు ఎవరయినా ఉంటే తప్పక చూడండి . యూట్యూబులో ఉంది . A great emotional classic and a musical hit . Unmissable . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు …….. By      డోగిపర్తి సుబ్రహ్మణ్యం

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలే ఆమె రేఖ… పైగా ఓ సరళీకృత అక్రమ ప్రేమ కథ… తెర చించేసింది…
  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
  • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions