Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భారీ ఖర్చు, ప్రయాస తప్ప ఇంకేం మిగల్లేదు… షర్మిల రాజకీయాల కథ ఖతం…

November 3, 2023 by M S R

మొత్తానికి కాంగ్రెస్ ఈసారి చాలా వ్యూహాత్మకంగా, స్టబ్బరన్‌గా ఉంది.,. కోదండరాం ఏవో సీట్లు అడిగితే స్పందించలేదు, ఇక విధిలేక ఆయనే బేషరత్తు మద్దతు అంటున్నాడు… నో సీట్, నాటెటాల్… లెఫ్ట్ ఏకంగా పదేసి సీట్లు అడిగినా కొన్నాళ్లు నాన్చీ నాన్చీ ఇక సైలెంట్ అయిపోయింది… పేరుకు ఇండియా విపక్ష కూటమిలో సహభాగస్వాములే, ఐనా డోన్ట్ కేర్ అంటోంది… బీజేపీకి మద్దతు ఇవ్వలేరు, అవమానించిన బీఆర్ఎస్ పంచన చేరలేరు, అనివార్యంగా తాము పోటీచేయనిచోట్ల ఇక కాంగ్రెస్‌కు మద్దతు పలకాల్సిందే…

వైఎస్సార్టీపీ… తాజాగా చేతులెత్తేసింది… రాష్ట్రం మొత్తమ్మీద పోటీచేస్తామని ప్రకటించి, టికెట్లు కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఆహ్వానించి, చివరకు బ్రదర్ అనిల్, విజయమ్మ సహా తను కూడా పోటీచేసి, రాజన్నరాజ్యం తీసుకొస్తామని గంభీరంగా మాట్లాడిన షర్మిల కూడా కాంగ్రెస్‌కు బేషరతు మద్దతు ప్రకటించింది… కాంగ్రెస్‌లో విలీన ప్రక్రియలో విఫలమైంది… వేరే దారి తోచడంలేదు… కాంగ్రెస్ ఈ పార్టీ పట్ల కూడా స్థిరంగా నిలబడింది… చివరకు షర్మిలే ఒక్క సీటూ లేకుండా… మరీ ఆ పాలేరు కూడా లేకుండా కాంగ్రెస్‌కూ జై అనేసింది…

అసలు షర్మిల పార్టీ పుట్టుకే లోపం… ఆమె సమైక్యవాది… హఠాత్తుగా వీరతెలంగాణవాది ముసుగేసుకుంది… బయట ఉత్తుత్తి ప్రచారాలు, జగన్‌తో ఆస్తి తగాదాలు అని… అందుకే రాజకీయాల్లోకి వచ్చింది అంటూ కథనాలు… సింపుల్ లాజిక్… అన్నతో విబేదాలుంటే, ప్రతీకారాలు, పగలు తీర్చుకోవాలీ అనుకుంటే ఏపీ పాలిటిక్సులో దిగాలి… అది అసలైన రణక్షేత్రం అవుతుంది… అది కాదని తెలంగాణలో పార్టీ పెట్టింది… జనం నవ్వుకున్నారు… భారీగా ఖర్చు పెట్టింది… ఊరూరూ తిరిగింది… ఏం జరిగింది..?

Ads

ఆమెను ఎవరూ నమ్మలేదు… మధ్యలో బీఆర్ఎస్ నేతలను పరుష వ్యాఖ్యలతో గోకినా సరే, ఫలితం లేదు, జనం పట్టించుకోలేదు… కనీసం జనసేనలో పవన్ పక్కన ఆ నాదెండ్ల  మనోహర్ కనిపిస్తాడు, వైఎస్సార్టీపీలో షర్మిల తప్ప మరెవరూ లేరు… ఓ పార్టీ పెట్టేసి, జనంలో తిరగ్గానే పార్టీకి బలం వస్తుందని అనుకోవడం ఓ భ్రమ… పార్టీ పుట్టుకకు ఓ కన్విన్సింగ్ బేస్ ఉండాలి… అదే లోపించింది… చివరకు హ్యాండ్సప్…

చూస్తూ ఉండండి… ఈ ఎన్నికలయ్యాక ఇక వైఎస్సార్టీపీ ఉండకపోవచ్చు… ఇప్పుడు ఆమె ఎన్నికలకు దూరంగా ఉండేందుకు ఏవైనా సాకులు చెప్పవచ్చుగాక… కానీ తెలంగాణ రాజకీయాల్లో ఆమె పార్టీ కథ ఖతం… ఇక రాబోయే రోజుల్లో ఆమె సైలెంటుగా జగన్ చెల్లెలు పాత్రకు పరిమితం అయిపోవచ్చు… తన మతబోధనలకే పరిమితం కావచ్చు… అప్పుడిక కృతకంగా బతుకమ్మలు ఎత్తుకోవడాలు, తెలంగాణ కల్చర్‌ను ప్రేమించడాలు వంటి పొలిటికల్ నటనలు ఏమీ కనిపించకపోవచ్చు… నిజానికి అంతా ఓ ప్రహసనం… తెలంగాణలో కూడా వైఎస్ లెగసీని అలాగే కొనసాగించడం కోసం ఉద్దేశించిన పార్టీ వైఎస్సార్టీపీ… జగన్‌కు అన్నీ తెలుసు… ఏదో అనుకున్నాడు, కానీ పాచిక పారలేదు… తెలంగాణకు సంబంధించి వైఎస్ లెగసీకి ఇక ఫుల్ స్టాప్…

ఏవేవో చిన్న పార్టీలు ఏవో డిమాండ్లు పెట్టి, ఏవో కొన్ని సీట్లు కేటాయింపజేసుకునే పాత సంప్రదాయం ఇప్పుడు సక్సెస్ కావడం లేదు… కొత్తగానే ఉంది… మరీ లెఫ్ట్ పార్టీలు చూడండి… కేసీయార్ అయితే కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా దూరం పెట్టేశాడు… తోక పార్టీలుగానే ఉండటానికి అలవాటయ్యారు కదా, వెంటనే కాంగ్రెస్‌కు అతుక్కుపోదామని చూశారు… ఏవో సీట్లు అడిగారు… కాంగ్రెస్ నథింగ్ డూయింగ్ అనేసింది… కాంగ్రెస్‌కు సంబంధించి ఈసారి ఓ కొత్త స్థిరవైఖరి కనిపిస్తోంది… అదీ విశేషం… షర్మిల చీల్చే అవకాశం ఉన్న కొన్ని రెడ్డి వోట్లు, కొన్ని క్రిస్టియన్ వోట్లు తిరిగి కాంగ్రెస్‌కే పడతాయేమో ఇక… ఇప్పుడు కాంగ్రెస్ ప్రధాన అనధికారిక నినాదాల్లో ‘రెడ్డి రాజ్యం’ కూడా ఉందిగా… పైగా సెటిలర్లు కూడా ఈసారి కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తోంది…

సరిగ్గా ఇదే బీజేపీకి కూడా చిరాకు రేపుతోంది… ఇలా కాంగ్రెస్ వోటింగ్ బేషరతుగా పెరిగిపోతుండేసరికి సహించలేకపోతోంది… అరె, మా కేసీయార్ రాజ్యం మళ్లీ రావాలి, కాకపోతే మా మద్దతుతో రావాలి అనుకుని తిక్క ప్లాన్లేవో వేస్తున్నా సరే వర్కవుట్ కావడం లేదు… అందుకని ఇక ఐటీని దింపింది… జానారెడ్డి, కేఎల్ఆర్ సహా కాంగ్రెస్ ముఖ్యుల ఇళ్లపై పడింది… బీఆర్ఎస్ విజయానికి తనే బద్దలు కడుతోంది… మరో నెల రోజుల టైమ్ ఉందిగా, ఇంకాా ఏమేం సాయాలు చేయనుందో…!!

ఇక్కడ ఓసారి టీడీపీ పోటీలో లేకపోవడం గురించి కూడా ప్రస్తావించాలి… కారణాలు ఏమైనా అదీ ఇక తెలంగాణ కార్యక్షేత్రం నుంచి పూర్తిగా తప్పుకున్నట్టే… ఏపీ, తెలంగాణల వారీగా పార్టీల పోలరైజేషన్ ఓ కొలిక్కి వస్తోంది… ఎవరి రణక్షేత్రానికి వారు కమిటైపోవాల్సిందే ఇక… టీడీపీ పోటీలో లేకపోవడం ఎంతోకొంత కాంగ్రెస్‌కే ఫాయిదా… సో, లెఫ్ట్, టీడీపీ, వైఎస్సార్టీపీ ఇలా ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది కాంగ్రెస్‌కే అనుకూలంగా మారుతున్నట్టనిపిస్తోంది… చూడాలిక ఎన్నికల్లో ఏం జరగనుందో…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • విలనుడు రేపు చేస్తే కేరక్టర్ అవుతుంది గానీ వీరోయిన్ అయిపోదు కదా…
  • వాణిశ్రీ అనుకుని భానుమతి రూమ్ బెల్ కొట్టాను… ఆమె ఏమన్నారంటే!
  • భారీ బ్యానర్ ఐనంతమాత్రాన … సినిమా ఆడాలనేముంది..?
  • సత్సంగత్వే నిస్సంగత్వం… పలు భ్రమల్ని బద్దలుకొట్టే ఆత్మవైరాగ్యం…
  • రేప్పొద్దున విలేకరులకు ఇంకేం జరిగినా ఇంతేనా ఈనాడూ..?!
  • చలి అంటే లెక్కేలేని ఆయన… హఠాత్తుగా బిర్ర బిగుసుకు పోయాడు…
  • ఆ ధూర్త పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడినట్టు..? ఇది మరోకోణం..!!
  • కంటెస్టెంట్ల ఎంపిక వెరీ పూర్ బిగ్‌బాస్… ఆట అస్సలు రక్తికట్టడం లేదు…
  • పేలవంగా, నిస్సారంగా తెలుగు ఇండియన్ ఐడల్ ‘ప్రి రిలీజ్’..!!
  • శంఖం ఊదితే సుఖనిద్ర… ఊపిరితిత్తులకు వ్యాయామం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions