నో డౌట్… షారూక్ ఖాన్ ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోల్లో ఒకరు… కొన్నేళ్లపాటు హిందీ తెరను ఏలినవాడు… తాజాగా పఠాన్ వసూళ్లతో తన స్టేటస్ నిలబెట్టుకున్నవాడు… కెరీర్‌లో ఓ సుదీర్ఘపయనం… ఎక్కడో మొదలై, ఎటెటో తిరిగి, ఇక్కడి దాకా వచ్చింది… సిమీ గరేవాల్‌తో జరిగిన ఓ పాత ఇంటర్వ్యూలో కొన్ని సంగతులు చెప్పుకొచ్చాడు… తను జీవితం వడ్డించిన విస్తరి ఏమీ కాదనీ, చాలా అవమానాలు, పరాభవాల్ని తట్టుకుంటూ ఇక్కడి దాకా వచ్చానని చెప్పుకున్నాడు…
ప్రత్యేకించి ఓ విషయాన్ని చెప్పాడు… ఓ సెక్యూరిటీ గార్డ్‌తో తనకు ఎదురైన అనుభవం అది… శిఖర్ అనే సినిమా లాంచ్ సందర్భంగా చోటుచేసుకుంది ఇది… తను హీరోగా చేస్తున్న ఆ సినిమా ముహూర్త సందర్భానికి తననే సదరు గార్డు అడ్డుకున్నాడు, లోనికి వెళ్లినివ్వలేదు… తనను అసలు గుర్తే పట్టలేదు… ఒకసారి ఆ ఇన్సిడెంటులోకి వెళ్తే…
ఆ సినిమా ముహూరత్ పూజ, తొలి షాట్ ఎట్సెట్రా ఏర్పాటు చేశారు… ఢిల్లీలో… ఆ స్థలానికి వెళ్లకుండా ఓ గార్డ్ తనను అడ్డుకున్నాడు… నా సినిమా మహూర్తపు సందర్భానికి నన్నే అడ్డుకోవడం ఏమిటోయ్ అనడిగితే తను ఎగాదిగా చూశాడు షారూక్ వైపు… ‘‘అవును బాబూ, అవును… చూడు, నేను షారూక్ ఖాన్… ఈ సినిమాకు హీరోను స్వామీ, నన్ను వెళ్లనివ్వు’’ అనడిగాడు షారూక్… గార్డ్ అస్సలు నమ్మలేదు… ఈ బక్కపలుచని కేరక్టర్ హీరో ఏమిటి..? అసలు నటుడేనా..? అనుకున్నాడు… ‘‘ఫోఫోవయ్యా, నీలాంటోళ్లను చాలామందిని చూశాను, హీరోలం అని చెప్పుకుని తిరుగుతుంటారు’’ అన్నాడు నిష్కర్షగా ఆ గార్డ్…
Ads
షారూక్ శతవిధాలుగా గార్డ్‌ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు… లేటవుతోంది… అప్పటికే అందరూ లోపలికి వెళ్లిపోయారు… కనీసం ఎవరితోనైనా చెప్పిద్దామనుకుంటే ఎవరూ బయటి నుంచి రావడం లేదు… నో యూజ్… ‘‘అరె బాబా, అందరూ నాకోసం వెయిట్ చేస్తుంటారోయ్… స్టేజీ మీదకు నేను వెళ్లాల్సి ఉంది… కాస్త నన్ను వెళ్లనివ్వు భాయ్…’’ అని బతిమిలాడాడు… నో… సదరు గార్డ్ చాలా ఫరమ్‌గా నిలబడి, లోపలకు ఎంట్రీ ఇవ్వలేదు…
చివరకు ఆ సినిమా సిబ్బందిలో ఒకరు అప్పుడే వచ్చాడు… జరుగుతున్న తంతు చూశాడు… అరె, భాయ్, ఈయనే ఈ సినిమాలో లీడ్ హీరో… ఇక్కడ ఆపావేమిటి..? అన్నాడు… ‘‘పర్సనాలిటీ లేదు, ఏమీ లేదు, ఈయనేం హీరో..?’’ అని సందేహంగా మొహం పెట్టాడు గార్డ్ మళ్లీ… గొణుగుతూనే ఎట్టకేలకు లోపలకు అనుమతించాడు… హమ్మయ్య అనుకుంటూ షారూక్ పరుగుపరుగున ముహూర్తం స్పాట్ దగ్గరకు వెళ్లాడు…
శిఖర్ సినిమాను షారూక్ ఖాన్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రలుగా ప్రకటించారు… కానీ తరువాత దాన్ని ఆపేశారు ఎందుకో… సుభాష్ ఘయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాల్సి ఉండింది… కానీ బడ్జెట్ ప్రతికూలతల కారణంగా సినిమాయే ఆగిపోయింది… తరువాత షారూక్‌తో పరదేశ్ తీశాడు… ‘‘పరదేశ్‌కు ముందు నేను శిఖర్ అనే సినిమా ప్లాన్ చేశాను, ఓ కొత్త అమ్మాయి హీరోయిన్, షారూక్‌తోపాటు జాకీ ష్రాఫ్ కూడా ఉన్నాడు… యుద్ధనేపథ్యంలో ఓ లవ్ స్టోరీ అది… ముహూర్తపు షాట్ అయిపోయింది… ఏఆర్ రెహమాన్‌తో ఓ పాట కూడా రికార్డ్ చేయించాం… కానీ సినిమా పట్టాలు ఎక్కలేదు’’ అని 2017లో సుభాష్ ఘయ్ పీటీఐ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు… ఈమధ్య ఇదంతా షారూక్ ఎక్కడో షేర్ చేసుకున్నాడు…!!
Share this Article