Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…

May 20, 2025 by M S R

.

మామూలుగానే పెద్ద పెద్ద ఇంగ్లిష్ భాషా పండితులకు కూడా అర్థం కానంత ఆంగ్ల జ్ఞాని శశిధరూర్…. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ కూడా శశిధరూర్ మైండ్ తలవంచాల్సిందే అన్నట్టుగా ఉంటుంది…

తను వాడే పదాలు, ఉచ్ఛారణ గంభీరంగా, బరువుగా, చాలా సంక్లిష్టంగా ఉంటాయి తెలుసు కదా… అసలు తను అప్పుడప్పుడూ ఉపయోగించే పదాలు అసలు ఇంగ్లిషులో ఉన్నాయా లేదా అనే డౌటొస్తూ ఉంటుంది ఆంగ్ల జ్ఞానులకు కూడా…

Ads

ఇప్పుడు పొలిటికల్‌గా ఓ కూడలిలో నిల్చున్నాడు తను… బీజేపీ వైపు చూస్తున్నాడు అని కాంగ్రెస్ డౌటనుమానం…. డౌటేముంది..? చూస్తున్నాడనే అనుకుందాం… ఈలోపు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల్ని, పేర్ల ఎంపికల్ని కాదని… పాకిస్థాన్ మీద ఓ నెగెటివ్ క్యాంపెయిన్ టీమ్‌కు తనను లీడర్‌ను చేశాడు మోడీ…

ఇక తప్పదు, బహిష్కరించేద్దాం అనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్… (సస్పెన్షన్ లెటర్ శశిధరూర్ భాషలో రాయాలంటే చాలా కష్టం కదా, అందుకని ఏం చేయాలబ్బా అని తిప్పలు పడుతున్నట్టుంది చూడబోతే…)

సరే, తనను ఈ బాధ్యతకు ఎంపిక చేసినందుకు గాను శశి ధరూర్ రాసిన లేఖ ఇదుగో అని మీడియాలో, సోషల్ మీడియాలో ఓ లేఖ వైరల్ అవుతున్నది తెలుసు కదా… మామూలుగా ఆంగ్లానువాదాలు అలవోకగా చేయగలిగేవాళ్లు సైతం జుత్తు పీక్కుంటున్నారు…

అదిలా ఉంది… ఓసారి చదివి చూడండి…. ఏమైనా సమజ్ అయితే మీకు నాలుగైదు అవార్డులు గుండుగుత్తాగా ఆ శశిధరూర్‌తోనే ఇప్పించాలి…. (మోడీ టీమ్ కూడా దాన్ని అర్థం చేసుకోలేక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కు పంపించి, సరళమైన ఇంగ్లిషులో ఓ అనువాదాన్ని తెప్పించుకోవాలని అనుకుంటున్నదట… ఆ టీమ్‌కు కూడా చెమటలు పట్టించగల భాష ఈయనది…)



Dear Prime Minister,

In reciprocation to your recent epistolary overture, I am impelled, indeed epistemologically coerced into articulating my gratitude via a prolix palimpsest of sesquipedalian syntax, lest a pedestrian expression be deemed a lexical misdemeanor unbecoming of this magnanimous interlude.

The conspicuous concatenation of your executive discretion with my rhetorical propensities precipitates an ontological juxtaposition that, while perplexing to the cynically disenchanted, is axiomatic to the Platonic ideal of governance transcending ideological parallax.

Your solicitation of my dialectical faculties to represent India’s post-kinetic strategic imperatives on multilateral podiums is not merely an act of bipartisan politesse. It’s a semiotic calibration in favour of para-institutional intellect, wrapped in the velveteen glove of realpolitik.

Let me, therefore, not insult the grandeur of your gesture by responding with jejune platitudes. Rather, I proffer this peroration: That I shall, with alacritous gravitas and polyglottic finesse, transmute India’s heterogenous anxieties into diplomatically palatable phonemes, calibrated for variegated epistemic receptors across hemispheric constellations.

Should this venture culminate in epistemological transcendence or geopolitical vertigo, I remain, as ever, your loquacious interlocutor in the theatre of national exigency.

With obsequious syntactic humility, Dr. Shashi Tharoor



సరే, మహా మహా గొట్టు విషయాల్ని కూడా ఇట్టే చెబుతోంది, దీనంత తోపు లేదు అని చాలామంది కీర్తిస్తున్నారు కదా…. అదొక సూపర్ కంప్యూటర్ అన్న ఫీల్ వ్యాప్తి చేస్తున్నారు కదా… దాన్నడుగుదాం, ఈ లేఖను కాస్త తెలుగులో చెప్పవమ్మా అనడిగాను…

అది సైతం తన ప్రోగ్రామింగ్ కోడ్ మొత్తం చించుకున్నా దానికీ అర్థం కాలేదు ఫాఫం… ఇలా ఏడ్చింది… గ్రోకూ నువ్వెంత, శశిధరూర్ గోకితే నీ జ్ఞానం ఏపాటి అన్నట్టుగా… అదేమని చెప్పిందో తెలుసా..?



ప్రియమైన ప్రధాన మంత్రి గారూ,

మీ ఇటీవలి సౌజన్యపూర్వక లేఖకు ప్రతిస్పందనగా, నా కృతజ్ఞతను సామాన్యమైన వ్యక్తీకరణ కంటే, సుదీర్ఘమైన, సంక్లిష్టమైన శబ్దజాలంతో కూడిన వాక్యనిర్మాణంలో వ్యక్తీకరించాలనే తాత్విక బలవంతంతో, ఈ ఉదాత్త క్షణానికి తగని లేక్సికల్ అపరాధంగా భావించబడే సాధారణ వ్యక్తీకరణను నివారించాలని నేను ప్రేరేపితుడనైనాను.

మీ కార్యనిర్వాహక విచక్షణతో నా వాక్చాతుర్య ప్రవృత్తుల స్పష్టమైన సంనాదం, విమర్శనాత్మకంగా నిరాశపరచబడినవారికి సందిగ్ధంగా అనిపించినప్పటికీ, భావజాల పారలాక్స్‌ను అధిగమించే ప్లాటోనిక్ ఆదర్శ పాలనకు స్వయంసిద్ధమైన ఒక ఆంటాలాజికల్ జక్స్టాపొజిషన్‌ను సృష్టిస్తుంది.

బహుపాక్షిక వేదికలపై భారతదేశం యొక్క యుద్ధోత్తర వ్యూహాత్మక అవసరాలను ప్రాతినిధ్యం వహించమని నా వాదనా నైపుణ్యాలను మీరు కోరడం, కేవలం ద్వైపాక్షిక సౌజన్యం కాదు. ఇది రాజకీయ వాస్తవికత యొక్క మృదువైన కవచంలో చుట్టబడిన, సంస్థాగత బాహ్య బుద్ధిశక్తికి అనుకూలమైన సెమియోటిక్ క్యాలిబ్రేషన్.

కాబట్టి, మీ గొప్ప సంజ్ఞ యొక్క ఔన్నత్యాన్ని సామాన్యమైన, బీరకాయలాంటి ప్రశంసలతో అవమానించడం నాకు సమంజసం కాదు. బదులుగా, నేను ఈ సందేశాన్ని సమర్పిస్తున్నాను: నేను, త్వరితమైన గాంభీర్యంతో మరియు బహుభాషా నైపుణ్యంతో, భారతదేశం యొక్క వైవిధ్యమైన ఆందోళనలను రాజనీతిపరంగా రుచికరమైన శబ్దాలుగా మార్చి, హేమిస్ఫెరిక్ నక్షత్రమండలాల్లోని వివిధ తాత్విక గ్రాహకుల కోసం క్యాలిబ్రేట్ చేస్తాను.

ఈ ప్రయత్నం తాత్విక ఉన్నతికి లేదా భౌగోళిక రాజకీయ విరోధాభాసానికి దారితీసినా, నేను ఎప్పటిలాగే, జాతీయ అవసరాల రంగస్థలంలో మీ వాక్చాతుర్య సంభాషణకర్తగా ఉంటాను.

సాష్టాంగ సింటాక్టిక్ వినయంతో, డాక్టర్ శశి థరూర్



అనేకచోెట్ల ఇంగ్లిషు పదాల్ని తెలుగు లిపిలో రాసి, ఇక నావల్ల కాదని చేతులెత్తేసింది… అట్లుంటది సదరు లీడర్‌తో మరి… దీన్ని ఈనాడు అనువాదంలో చూడాలని ఉంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!
  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…
  • అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….
  • సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
  • ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!
  • ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…
  • శరణార్థుల ఆశాసూచిక – భారత రాజ్యాంగంలోని కుబేరుని కళాచిత్రం…
  • కశ్మీర్‌లో యూఎన్ ధర్మసత్రం షట్‌డౌన్… శెభాష్ జైశంకర్… ఇదీ టెంపర్‌మెంట్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions