.
స్మితా పాటిల్… సమాంతర సినిమాలు, సమున్నత దర్శకులకు ఇష్టనటి… నమక్ హలాల్ అనే సినిమాలో ఆజ్ రపట్ జాయే పాటలో కాస్త బోల్డ్‌గా… అమితాబ్‌తో… వానపాట, తడిసిన అందాలతో… తనతో కిందా మీదా పడుతూ… బ్లాక్ బస్టర్ పాట, కానీ ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది…
ఆమె కూడా ఆ పాట షూట్ కాగానే ఇంటికెళ్లి వెక్కి వెక్కి ఏడ్చింది… నేనేమిటి, ఇలా అయిపోయాను అంటూ… సినిమా నుంచి వైదొలుగుదామా అనే మథనం… అమితాబ్ సర్దిచెప్పాడు… మనం నటులం మాత్రమే, మరీ అంత అసభ్యంగా నటించాల్సి వస్తే నేను కూడా నీతోపాటు ఆ సినిమా నుంచి బయటికి వచ్చేస్తా అన్నాడు…
Ads
సేమ్, ఎన్టీయార్… ఎదురులేని మనిషి సినిమా కావచ్చు… వాణిశ్రీతో ఓ పాట… పిచ్చి డ్రెస్సు, తిక్క స్టెప్పులు… అసభ్యంగా చేయిస్తుండేసరికి… ఆమెకు ఇబ్బందిగా ఉంది… ఈ వెగటు పాటలు తనకు అవసరమా అని మథనం… తరువాత ఎన్టీయారే ఆమెను కన్విన్స్ చేశాడు… కానీ ఆ తరువాత ఆమె అలాంటి పాటల నుంచి, ఆ పాత్రల నుంచి తనే స్వచ్చందంగా వైదొలిగింది…
ఇవి ఎందుకు చెప్పుకోవడం అంటే… ఇండియన్ సినిమా అంటేనే దాదాపు అదే ధోరణి… కొన్ని సీన్స్, కొన్ని సాంగ్స్ ఇలా ఇబ్బందికరంగా ఉంటే… సీనియర్లే నచ్చజెప్పి, కంఫర్ట్ జోన్‌లోకి తెచ్చుకుని… నటింపజేస్తారు… చేయాలి… సేమ్, అలాంటిదే మరొకటి… ఫేస్‌బుక్‌లోనే Bhanumathi R
పోస్టు కనిపించింది… అదేమిటయ్యా అంటే…?
బాలీవుడ్‌లోని అత్యంత అందమైన తారల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, ప్రజలు తరచుగా ధర్మేంద్ర, దేవ్ ఆనంద్, సల్మాన్ ఖాన్‌లను గుర్తు చేసుకుంటాం… కానీ చాలా అందమైన, శృంగార ఇమేజ్ ఉన్న హీరో అని పిలువబడే మరొక స్టార్ ఉన్నాడు… అతను మరెవరో కాదు, కపూర్ కుటుంబ వారసుడు, అనేక సూపర్ హిట్ చిత్రాలలో పనిచేసిన శశి కపూర్…
అప్పట్లో శశి కపూర్ కోసం లక్షలాది మంది అమ్మాయిలు చనిపోవడానికి సిద్ధంగా ఉండేవారట… అంతటి ఇమేజ్ ఆయనది… కానీ ఒకసారి అతను సెట్‌లో ఒక హీరోయిన్‌ను ప్రశంసిస్తూ సీన్ పండించారట… అతను హీరోయిన్‌తో, ‘బాధపడకు, నువ్వు చాలా అందంగా ఉన్నావు’ అని చెప్పి ప్రోత్సాహం ఇచ్చారట…
ఆమె మరెవరో కాదు, శశి కపూర్ హీరోయిన్ సిమి గ్రెవాల్. వీరిద్దరూ కలిసి ‘సిద్ధార్థ్’ చిత్రంలో నటించారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలో శశి కపూర్.. హీరోయిన్ సిమి గ్రెవాల్‌ను కంఫర్టబుల్ గా ఉంచడానికి ఆమె అందం గురించి మాట్లాడిన ఒక కథ ఉంది…
కర్జ్‌లో రిషి కపూర్‌తో కలిసి పనిచేసిన సిమి గ్రేవాల్, అమీమ్ ఛబ్రా రాసిన ‘శశి కపూర్ ది హౌస్‌హోల్డర్ ది స్టార్’ పుస్తకంలో ఈ సంఘటనను వెల్లడించారు… 1972లో వచ్చిన సిద్ధార్థలోని ఒక సన్నివేశం గురించి తాను చాలా అసౌకర్యంగా ఉన్నానని ఆమె చెప్పింది…
సినిమాలో ఒక సన్నివేశంలో ఆమె బట్టలు లేకుండా కనిపించాల్సి వచ్చింది. దీంతో హీరోయిన్ చాలా కంగారు పడటంతో పాటు కొంచెం అసౌకర్యంగా కూడా ఫీల్ అయిందట. అయితే, సిమి గ్రేవాల్ ఇలా కంగారుగా ఉండటం చూసిన శశి కపూర్ ఆమెతో మాట్లాడాడు. ఆమెకు ధైర్యం చెప్పి, ఆ సన్నివేశంలో ఆమెకు సహాయం చేశాడు…
ఈ విషయంపై సిమి గ్రేవాల్ మాట్లాడుతూ, ‘ఆ దృశ్యం నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. నేను బాడీ స్టాకింగ్ వేసుకుని ఉన్నాను. నేను టాప్‌లెస్‌గా ఉండాల్సి వచ్చింది. దీనితో నేను చాలా భయపడ్డాను. సిగ్గుతో తల పైకెత్తలేకపోయాను…
అప్పుడు శశి కపూర్ సిమి గ్రేవాల్ దగ్గరకు వచ్చాడు. సిమి సిగ్గుపడుతున్నట్లు అతనికి అర్థమైంది. అప్పుడు శశి కపూర్ ఆమెతో, ‘సిమి సిగ్గుపడాల్సిన అవసరం లేదు సిమి. నువ్వు చాలా అందంగా ఉన్నావు’ అని అన్నాడు. ఇది విన్న వెంటనే సిమి ఆత్మవిశ్వాసంతో ఆ బోల్డ్ సన్నివేశాన్ని పూర్తి చేసింది. వారిద్దరూ ముద్దు పెట్టుకునే ఒక సన్నిహిత సన్నివేశం ఉంది…
సిద్ధార్థ అనేది 1972లో విడుదలైన ఇండో- అమెరికన్ డ్రామా మిస్టరీ చిత్రం. దీనికి కాన్రాడ్ రూక్స్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పించు కపూర్, కునాల్ కపూర్, రోమేష్ శర్మ కూడా నటించారు…
Share this Article