‘‘మాలీ హీథర్… 23 ఏళ్ల ఈ మాజీ బయాలజిస్ట్… శాన్ డీగో జూలో ఉండే ఓ గొరిల్లా వీర్యంతో కడుపు తెచ్చుకుంది… అనగా గర్భవతి అయ్యింది… అదేమిటీ అలా చేసింది అనుకుంటున్నారా..? ఈ గొరిల్లా జాతి అంతరించిపోయే జాబితాలో ఉంది, ఆ జాతిని కాపాడాలి, ఆ సంతానం వృద్ధి చెందాలి… ఈ జీవకారుణ్య భావనతోనే ఈ పనిచేశాను అంటున్నది ఆమె… ఆమె జీవకారుణ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసే పెటా యాక్టివిస్టు.., చాలా ఏళ్లుగా గొరిల్లా వీర్యాన్ని నాలో జొప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా సరే సఫలం కాలేకపోయాననీ, ఎట్టకేలకు సక్సెస్ అయ్యానని ఆనందంగా చెబుతున్నది హీథర్…’’… సోషల్ మీడియాలో సర్క్యులేషన్‌లోకి వచ్చిన ఒక వార్త ఇది… అసలు చదువుతుంటూనే ఓ గగుర్పాటు… గొరిల్లా వీర్యం ఏమిటి..? ఓ మహిళ గర్భం ఏమిటి..? అసలు ఇది ఎలా సాధ్యం..? ఎందుకీ పని..? ఏమిటీ వెర్రి అనిపిస్తోందా..? ఓసారి ఆ వార్త నిజానిజాలేమిటో చూద్దాం… మరి సోషల్ మీడియా అంటేనే అధికశాతం ఫేక్ కదా…
నిజానికి రెండు వెర్షన్లు… పరస్పరం కాంట్రడిక్షన్… గొరిల్లా వీర్యంతోనే తన కడుపు పండిందని చెప్పడం ఒకటి… అవే వార్తల్లో మరో వెర్షన్ కూడా… ఏళ్లపాటు ప్రయత్నించినా సక్సెస్ కాకపోవడంతో ఇక జూలోని రెండు గొరిల్లా వీర్యం, అండం బయట ప్రయోగశాలలో ఫలదీకరింపజేసి… అంటే ఐవీఎఫ్… ఆ పిండాన్ని తన గర్భాశయంలోకి తీసుకున్నాననీ, అంటే సరోగసీ మదర్ అవుతున్నాననీ మరో వెర్షన్… సిర్ఫ్ న్యూస్ అనే ఓ సైట్ ఉంది… ఇలాంటి చిత్రవిచిత్ర వార్తల్ని ప్రచారంలోకి తీసుకొస్తూ ఉంటుంది… జనం నమ్ముతారా, నమ్మాలా, నవ్వుతారా అనేది దానికి అక్కర్లేదు… ఇలా రాసిపారేసింది…
Ads
నిజానికి మనిషి జాతికి సంబంధించని వీర్యమైనా, పిండమైనా మన దేహాలు పర్మిట్ చేయవు… బయటికి తోసేస్తయ్… ఫారిన్ బాడీలు ఇవి… అలాంటిది ఏకంగా ఒక గొరిల్లా వీర్యంలోని శుక్రకణాలు ఓ మహిళ అండంతో కలవడం, పిండంగా ఫలదీకరణ చెందడం సింపుల్‌గా అసాధ్యం… అదీ అసలు నిజం… మరి ఈ వార్త ఎలా పుట్టింది..? అది కదా అసలు ప్రశ్న… ఈ వార్త ఇప్పటిది కాదు, ఈ సంవత్సరం మొదట్లోనే World News Daily Report (WNDR) అనే వెబ్ సైటు వాడు పబ్లిష్ చేశాడు… అది బేసిక్‌గా సెటైర్ బేస్డ్ సైట్… ఎంత పకడ్బందీగా రాస్తుంది అంటే చాలామంది సెటైర్‌ను కూడా నిజం అని నమ్మేంతగా..! అందులోని న్యూస్‌ను ఇదుగో ఇలాంటి సిర్ఫ్ న్యూస్ వంటి సైట్లు కాపీ కొట్టేసి మరింత ప్రచారంలోకి తీసుకొస్తూ ఉంటయ్… ఇది గొరిల్లా వీర్యం- పెటా మహిళ కడుపు కథ అసలు నిజం… అందుకే సోషల్ మీడియాలో ఏది కనిపించినా సరే, హవ్వ, ఇది చదివావా పిన్నీ అని బుగ్గలు నొక్కుకుంటూ మరీ హాశ్చర్యపోకండి… ఫైనల్ పంచ్ లైన్ చెప్పనే లేదు కదా… ఈ వీడియోల్లో, ఈ ఫోటోల్లో కనిపిస్తున్న పెటా యాక్టివిస్టు పేరు అసలు మాలీ హీథర్ కానేకాదు… ఈమె పేరు క్రిస్టీ హెండర్సన్… నిజంగానే ఈమె గొరిల్లాల పట్ల జూ అధికారుల అమానవీయ వైఖరి మీద కొట్లాడుతూ ఉంటుంది…!!
Share this Article