Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాలీవుడ్ డింపుల్ క్వీన్… ప్రీతి మరో మొహం… 34 మంది పిల్లల తల్లి…

June 4, 2025 by M S R

.

బాలీవుడ్ డింపుల్ క్వీన్, ఐపీఎల్ పంజాబ్ జట్టు ఓనర్… ఈసారి ఫైనల్స్ దాకా వచ్చింది… చివరలో నిరాశ… బట్, వోకే…. ఈసారి ఐపీఎల్ సీజన్‌లో చాలా యాక్టివ్‌గా తెర మీద కనిపించింది ప్రీతి జింతా…

ఆర్మీ వితంతువుల సంక్షేమం కోసం ఆమధ్య కోటికిపైగా నిధులనిచ్చింది కదా… గుడ్, ఇంకేమున్నయ్ అని వెతుకుతుంటే… ఆ గ్లామర్ డాల్‌ మాానవీయ మొహం కనిపించింది…  ఆమె తన 34వ ఏట ఒకేసారి 34 మంది పిల్లలకు తల్లయింది… అదే ఈ కథనం…

ఇప్పుడు ఆమె వయస్సు 50 ఏళ్లు… ఇదేమో 2009 నాటి కథ… అంటే ఆమెకు 34 ఏళ్ల వయస్సున్నప్పుడు దాదాపుగా… రిషికేశ్‌లోని మదర్ మిరాకిల్ అనాథ ఆశ్రమం నుండి 34 చిన్నారులను దత్తత తీసుకుంది….

Ads

ఆమె మాటల్లోనే… ‘‘“నేను 34 మంది అమ్మాయిలను దత్తత తీసుకున్నాను… వారి చదువు, ఆహారం, దుస్తులు — అన్నింటికీ నేను బాధ్యత వహిస్తాను… వారితో మాట్లాడేటప్పుడు, వాళ్ల ఆనందమైన మాటలు, శబ్దాల్ని వింటే గుండె ఉప్పొంగిపోతుంది… ఏ ఆనందమూ దానికి సాటిరాదు…”

ప్రీతి ఏడాదిలో రెండుసార్లు ఆశ్రమానికి వెళ్లి పిల్లలను కలుస్తానని మాటిచ్చింది… వెళ్తుంది… బాలికలపై జరుగుతున్న అన్యాయాలు, బాల్య వివాహాలు, భ్రూణహత్యలు వంటి వార్తలు ఆమెను ఆవేదనకు గురిచేశాయి… అందులో నుంచి వచ్చిందే ఈ దత్తత ఆలోచన, ఆచరణ…

‘‘నాదొక చిరు ప్రయత్నం… సమస్యేమో చాలా పెద్దది… నావంతు ఇదొక ఆరంభం… ఇంకా చేస్తాను, ఇంకా చాలామందికి అమ్మనవుతాను’’ అందామె… ఎక్కడా ఆ పిల్లల వివరాల్ని షేర్ చేసుకోదు… ఇబ్బందులు వస్తాయని సందేహం…

1998లో ‘దిల్ సె’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది సొట్ట బుగ్గల ప్రీతి జింటా.., దేశం నలుమూలల అభిమానులను సంపాదించుకుంది… ‘దిల్ చాహతా హై’, ‘కల్ హో నా హో’, ‘చోరి చోరి చుప్కే చుప్కే’ వంటి ఎన్నో సినిమాల్లో తన నటనతో మెప్పించింది… తెలుగులో కూడా సినిమాలు చేసింది…

కానీ ఆమె జీవితంలో ఉన్న అసలైన గొప్పతనం తెర వెనకే ఉంది… అదే తన మానవీయ కోణం…

ప్రీతి ఓ అమెరికన్ వ్యాపారవేత్త జీన్ గుడ్‌ఎనఫ్‌ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలు మానేసింది… పూర్తిగా లాస్ ఏంజిల్స్‌లోనే స్థిరపడింది… 2021 నవంబర్‌లో సరోగసీ ద్వారా జై, గియా అనే కవలలకు ఆమె తల్లి అయ్యింది… ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమె “ఈ కొత్త అధ్యాయం మా జీవితాల్లోకి వెలుగు నింపింది…’’ అని షేర్ చేసుకుంది ఆనందాన్ని…

కష్టాల నుంచే ఎదుగుదల… 

అవును, ఆమె జీవితానికి ఈ రోజుల్లో ఉన్న మెరుపుల వెనుక ఎన్నో చీకట్లు ఉన్నాయి. కేవలం 13 ఏళ్ళ వయసులో తండ్రిని కార్ యాక్సిడెంట్‌లో కోల్పోయింది… అందులోనే తీవ్రంగా గాయాలపాలైన తల్లిని మరో రెండు సంవత్సరాల తర్వాత కోల్పోయింది…

వ్యక్తిగత జీవితంలోనూ చేదు అనుభవాలున్నయ్ ఆమెకు… పంజాబ్ జట్టు భాగస్వామి నెస్ వాడియాతో సహజీవనం చేసింది… శృతి కుదరలేదు, విడిపోయింది… జట్టు భాగస్వామ్యం వదులుకోలేదు… ఆమెను వెళ్లగొట్టడానికి ప్రయత్నాలు, కేసులు కూడా… కానీ ఆమె విడిచిపెట్టదు… ఇంట్రస్టింగ్ కేరక్టర్..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టెలిగ్రాఫ్ వ్యాఖ్య… జర్మనీలో ఇది మరో ఆపరేషన్ సిందూర్ అట…
  • ఆ పాటల షోలో ఇంకా ఆ ప్రవస్తి పాడుతూనే ఉంది ఫాఫం…
  • ఇలాంటి ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ మన పొరుగిల్లు అయితే బాగుండు…
  • ఆపరేషన్ సిందూర్‌ను పొడిగించకపోవడమే మంచిదైందట…!!
  • టెక్నాలజీ మాత్రమే తెలిస్తే చాలదు… టెక్నిక్ కూడా తెలియాలి…
  • విజయ బాపినీడు ప్రేక్షకుల్ని ఏదో మాయ చేయబోయాడు కానీ…
  • ఉక్రెయిన్ యుద్ధతంత్రం… ఇండియాకు ఓ పెద్ద మేలుకొలుపు…
  • సారీ… నాటి నాయకన్‌కు ఆమడల దూరంలో ఆగిపోయింది ఇది..!
  • ఐపీఎల్… ఇదొక వికృత క్రీడ… ఆటగాళ్ల వేలంవెర్రి… ఓ పిచ్చి…
  • ఈ పిచ్చిది ఏదో చెబుతుంది… గుడ్డిగా ఫాలో అయ్యారో, బుక్కయిపోతారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions