ఒక్కసారి కోరికలు గాడితప్పితే చాలు… అవి సుఖాన్నివ్వడమే కాదు… తెలియని తలనొప్పుల్లో, తప్పుల్లో ఇరికించి, చివరకు ప్రాణాలు తీసినా ఆశ్చర్యం లేదు… అడుసులో కాలేయడం వరకే, అది ఎక్కడి దాకా దిగ‘జారుస్తుందో’ ఎవరూ చెప్పలేరు… ఇదీ అలాంటి కథే… ఒక యువతి, ఒక యువకుడు… వాడికి ఇంతకుముందే పెళ్లయింది… ఆమెకు పెళ్లి కాలేదు… ఇరవయ్యేళ్ల వయస్సు… ఇద్దరి నడుమ అక్రమ సంబంధం సాగుతోంది… సమాజంలో ఇలాంటివి బొచ్చెడు కనిపిస్తయ్, అది కాదు సమస్య… ఆమెకు పెళ్లి ఖాయమైంది… పెళ్లి ఏర్పాట్లు సాగుతున్నయ్… పెళ్లయితే మరి ఆ బంధానికి కత్తెర పడుతుంది కదా… అందుకని వాడు పెళ్లి చేసుకోకు అంటాడు… చేసుకుంటే ఊరుకోను అని బెదిరిస్తాడు… నా జీవితం నా ఇష్టం అంటుంది ఈమె… లేదు, నువ్వు నాకే సొంతం అంటాడు వాడు… ఆమెకు చిర్రెత్తింది, నా ఒంటి మీద వీడికున్న రైట్స్ ఏమిటి..? వీడి ఆలోచనే రాంగ్, వీడు బతికి ఉంటే ఎప్పటికైనా ఇదే తల్నొప్పి అనుకుంది…
(Pic courtesy by dreamstime)…. మరి తల్నొప్పి తగ్గించుకోవాలి కదా… ఓ హంతకుడితో ఒప్పందం కుదుర్చుకుంది… ఏమనీ అంటే..? వాడిని ఖతం చేసెయ్, నీకు లక్షన్నర ఇస్తాను, అంతేకాదు, ఒక పూట నీకు సొంతం అవుతా, ఈ దేహం నీ ఇష్టం అని కొత్తతరహా సుపారీ ఎరవేసింది… ఆమెకు కొత్తగా పోయేదేముంది..? ఆఫ్టరాల్ దేహం… ఆఫ్టరాల్ ఒక పూట… కానీ వాడు మాత్రం ఉండటానికి వీల్లేదు… సదరు కిరాయి హంతకుడికి ఆ లక్షన్నరకన్నా ఈ అదనపు ఆఫర్ బాగా నచ్చింది… అఫ్ కోర్స్, వాడిని మర్డర్ చేశాక, బెదిరిస్తే ఆమే ఒక పూట కాదు, బోలెడు పూటలకూ సచ్చినట్టు ఒప్పుకుంటుంది… మొత్తానికి ఒప్పందం మేరకు ఆమె పాత ప్రియుడి కథ ఖతం అయిపోయింది… ఆమెకు ఒక తల్నొప్పి తీరింది… ఇదీ మహారాష్ట్రలోని నాగపూర్లో జరిగిన క్రైం కథ…
హత్యకు గురైనవాడి పేరు చందూ మహాపూర్… సుపారీ తీసుకున్నవాడి పేరు భరత్ గుర్జార్… నిజానికి ఇక్కడ ఓ ట్విస్టు ఉంది… ఈమె ఎవరినైనా చంపాలని సుపారీ ఇచ్చిందో ఆ భరత్, హతుడు చందూ దూరపు చుట్టాలే… అంతేకాదు, వాళ్లిద్దరి నడుమ ఆర్థిక తగాదాలున్నయ్… అవి సెటిల్ చేసుకుందాం రమ్మని పిలిచాడు భరత్… ఇద్దరూ మందు సిట్టింగులో కూర్చున్నారు… కాసేపటికి చందూను హత్య చేసి, అక్కడే ఉన్న ఓ క్రషర్ మైన్ వద్ద పారేశాడు… సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కొన్ని హింట్స్ దొరికిన పోలీసులు హంతకుడిని పట్టుకున్నారు… అప్పటికి సుపారీ సొమ్ము ప్లస్ ఆమె పొందు దక్కకముందే… హత్యకు ప్లాన్ చేసిన ఆమెనూ అరెస్టు చేశారు… ఫైనల్ ట్విస్టు ఏమిటంటే..? ఈ హత్యకు సహకరించింది కూడా ఆమె తల్లిదండ్రులు… మరేం చేస్తారు పాపం… వాళ్లకూ తప్పలేదు… అందుకే కదా మనం ముందే చెప్పుకున్నది, ఒక్కసారి గతి తప్పితే చాలు, ఇక మన చేతుల్లో ఏమీ ఉండదు…!!
Ads
Share this Article