.
స్వోత్కర్ష… తెలుగుపదమే… చాలామంది అర్థం తెలియదు… సెల్ఫ్ డబ్బా, భుజాలు చరుచుకోవడం వంటి అర్థాలున్నాయి… ఇంకా రఫ్‌గా చెప్పాలంటే స్వకుచ మర్దనం… సినిమాా సెలబ్రిటీస్‌కు సరిగ్గా వర్తించే పదం…
ఎస్… ఏ సినిమా సెలబ్రిటీ ఇంటర్వ్యూ అయినా తీసుకొండి… మితిమీరిన హిపోక్రసీ ఉంటుంది… అబద్ధాలు, ఆత్మవంచన సరేసరి.., వీటన్నింటికి తోడు స్వోత్కర్ష… అదే సొంత డబ్బా… కానీ ఈమధ్యలో తొలిసారి ఆ హిపోక్రసీ, స్వోత్కర్ష, పిచ్చి బాష్యాలు ఏమీ లేని ఇంటర్వ్యూ చూశాను…
Ads
అదే శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ… తన కొత్త సినిమా కుబేర ప్రిరిలీజ్ ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కదా… స్ట్రెయిట్‌గా చెప్పాడు… ‘‘ఈ సినిమా ప్రపంచంపైన, ఈ మనుషులపైన ఎక్కువ అంచనాలు పెట్టుకోను, ఎక్కువగా ఏదీ ఆశించను… ఆశలే పెద్దగా లేనిచోట బాధపడేదేముంది..? అసలు 25 ఏళ్లలో 10 సినిమాలు చాలా తక్కువ అంటారు, కానీ నాకు అదే ఎక్కువ…’ అంటున్నాడు…
హంబుల్… సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం పనికిరాని లక్షణం… నిజమే, తనే చెబుతున్నట్టు ఈ లక్షణాలు తనను దెబ్బతీయకపోవడం వరకూ తను అదృష్టవంతుడే… మళ్లీ పాన్ ఇండియా సినిమాలు తీస్తారా అంటే, చెప్పలేను, నా కథను బట్టి చిన్న సినిమా కూడా తీస్తాను అంటున్నాడు… ఈ పాన్ ఇండియా సినిమాయే నాకు కష్టమైంది అట… పాన్ ఇండియా భ్రమలతో కళ్లు బైర్లు కమ్మలేదు, సంతోషం…
లీడర్ సినిమాకు సీక్వెల్‌పైనా అంతే… కథపై క్లారిటీ ఉంది, కానీ నాటి రాజకీయాలు ఇప్పుడు లేవు, నాకైతే దేశప్రజలే మారిపోయారని అనిపిస్తోంది, ఆ మార్పులతో కథ మారిస్తే తప్ప సీక్వెల్ చేయలేం అన్నాడు… కానీ లీడర్ సినిమా కథాకథనాలే సరిగ్గా జనానికి చెప్పలేకపోయినట్టు చాలామంది విమర్శకులు అభిప్రాయపడ్డారు… లీడర్ సీక్వెన్స్ నిజంగా శేఖర్ కమ్ముల తీస్తే అదే పెద్ద సాహసం అవుతుంది…
నిజానికి తన బలం చిన్న సినిమాలే… పెద్ద పెద్ద స్టార్లు గాకుండా… ఆ హంగామా, ఆ నిర్మాణ వ్యయంకన్నా… తను అనుకున్న కథను నిజాయితీగా జనానికి చెప్పాలంటే చిన్న స్టార్లే బెటర్… ఎలాగూ తన సినిమాల్లో అశ్లీలం, అసభ్యత, డర్టీ కంటెంట్ ఎలాగూ ఉండదు, నీట్‌గా ఉంటుంది… చివరగా…
సినిమాల లాభంలో వాటాలు అడగను, నా రెమ్యునరేషన్ నాకు చాలు, అలా చాలా నష్టపోయానేమో, ఐనా నో రిగ్రెట్స్ అంటున్నాడు… లాభాల్లో వాటాలే కాదు, నిర్మాణంలో భాగస్వామ్యం, పలు ప్రాంతాల డిస్ట్రిబ్యూషన్ కూడా తీసుకుంటున్న రోజుల్లో… నిజంగానే శేఖర్ కమ్ముల వంటి వ్యక్తులు ప్రస్తుత సినిమా ప్రపంచంలో అరుదైన సరుకే..!!
Share this Article