Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శేఖర్ మాస్టర్ భలే పంచ్… అంతటి సుమ ఉడుక్కుని సైలెంట్… నో కౌంటర్…

January 15, 2023 by M S R

పర్లేదు… క్యాష్ ప్రోగ్రామ్ రద్దు చేసి పారేశాక సుమ కొత్తగా సుమ అడ్డా అని ఓ షో స్టార్ట్ చేసింది కదా… ఎలాగూ అది సరదాగా, కిట్టీ పార్టీ తరహాలోనే ఉంటుందని తెలుసు… కానీ సుమ కాబట్టి ఆ షోకు కొంత విలువ ఉంటుంది… స్పాంటేనియస్‌గా జోకులు పేలుస్తూ, నవ్వుతూ, నవ్విస్తూ ప్లజెంటుగా షో నడిపించేస్తుంది ఆమె… క్యాష్, స్టార్ మహిళ, వావ్, ఆలీతో సరదాగా, అన్‌స్టాపబుల్, కపిల్‌శర్మ షో వంటి అన్ని షోలను మిక్సీ చేసి, ఈ సుమ అడ్డా అనే కొత్త షో క్రియేట్ చేశారు…

కాకపోతే నిన్న చిరంజీవితో షో ఈ ప్రోగ్రాం వాల్యూ పెంచింది కానీ ఆ ఎపిసోడ్ పెద్దగా రక్తికట్టలేదు… విసిగించిందని కాదు… కాకపోతే మరీ హైప్ క్రియేట్ చేసినంతగా లేదు… సేమ్, అన్‌స్టాపబుల్‌ షోలో వీరసింహారెడ్డి ఎపిసోడ్‌లాగే…! పెద్ద స్టార్స్ వచ్చినప్పుడు లేదా ఏదేని సినిమా ప్రమోషన్ లక్ష్యం అయినప్పుడు ఏ షో అయినా తన ఒరిజినల్ కేరక్టర్ కోల్పోతుంది తాత్కాలికంగా… ఇదీ అంతే… కానీ మూడో ఎపిసోడ్‌కు వచ్చేసరికి సుమ అడ్డా కాస్త గాడిలో పడినట్టుంది…

మూడో ఎపిసోడ్‌కు కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వచ్చారు… ఇద్దరూ మంచి చెణుకులు విసరడంలో దిట్టలు… పైగా ఇటువైపు ఆ దిట్లలకే పాఠాలు నేర్పించగల సుమ… సో, నవ్వులతో ఎపిసోడ్ దద్దరిల్లిపోయినట్టు ప్రోమో చెబుతోంది… అందులో ఓచోట శేఖర్ మాస్టర్ సుమ పరువు తీసేశాడు అమాయకంగా నటిస్తూ… భలే పేలింది ఆ బిట్…

Ads

suma

ఈమధ్య శేఖర్ మాస్టర్ హీరోయిన్లతో ఎక్కువ వర్క్ చేస్తున్నట్టున్నాడు అంది సుమ టీజింగుగా… మీరు కూడా హీరోయినే కదా అని శేఖర్ కౌంటర్… నిజానికి శేఖర్ ఈటీవీలో ఢీ, తరువాత ఏదో కామెడీ షో తదితరాలు చేశాడు కదా… పైగా టైమ్లీగా సెటైర్లు, జోకులు విసరడంలో పండిపోయాడు… డాన్సుల్ని చాలా ఈజ్‌తో పెద్ద పెద్ద హీరోలతో చేయించినట్టే, టీవీ ఎపిసోడ్లను కూడా తన సెటైర్లతో రక్తికట్టిస్తుంటాడు… జానీ మాస్టర్ కూడా అంతే… నేను కూడా హీరోయినే అని గుర్తుచేయడానికి గత ఏడాది ఓ సినిమా చేశాను అని సుమ చెప్పింది…

శేఖర్ అమాయకంగా మొహం పెట్టి ‘‘చేశారా..?’’ అనడిగాడు… అంటే అది అంత అన్‌నోటీస్‌డ్‌గా వచ్చిపోయిందనే సెటైర్ అన్నమాట… మళ్లీ తనే ‘‘అది రిలీజైందా’’ అనడిగాడు… అంతటి సుమకు కూడా జవాబు తోచక, దిండు తీసి శేఖర్‌పైకి విసిరేసి ఉడుక్కుంది… ‘‘నిజంగా నాకు తెలియదు’’ అంటూ శేఖర్ మరింత ఉడికించాడు… ఇటువైపు జానీ నవ్వులు… నిజానికి ఈమధ్య ప్రోగ్రామ్స్‌లో సుమకు బాగానే పంచులు పడుతున్నయ్… బాగుంది సరదాగా… ఆమె కూడా భలే టాకిల్ చేస్తోంది వాటిని… కీపిటప్ సుమా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…
  • కథ కన్నీళ్లు పెట్టిస్తుంది… కానీ ఈ కథ ఎక్కడిది..? ఎవరిది..? ఆ కథేమిటి..?!
  • టెలిగ్రాఫ్ వ్యాఖ్య… జర్మనీలో ఇది మరో ఆపరేషన్ సిందూర్ అట…
  • ఆ పాటల షోలో ఇంకా ఆ ప్రవస్తి పాడుతూనే ఉంది ఫాఫం…
  • ఇలాంటి ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ మన పొరుగిల్లు అయితే బాగుండు…
  • ఆపరేషన్ సిందూర్‌ను పొడిగించకపోవడమే మంచిదైందట…!!
  • టెక్నాలజీ మాత్రమే తెలిస్తే చాలదు… టెక్నిక్ కూడా తెలియాలి…
  • విజయ బాపినీడు ప్రేక్షకుల్ని ఏదో మాయ చేయబోయాడు కానీ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions