.
వ్యవసాయం వల్ల 70 శాతం కాలుష్యం జరుగుతుంది – శిల్పారెడ్డి
ఈమె వ్యవసాయం వల్ల 70 శాతం కాలుష్యం జరుగుతుందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. దాన్నే థంబ్‌నెయిల్‌గా పెట్టి వీడియో వదిలారు.
Ads
ఇంకే ముంది ఆ వీడియో కింద లెక్కలేనంత జ్ఞానాన్ని బోధిస్తూ చాలా మంది కామెంట్లు పెట్టారు. అలా అయితే తినడం మానేయవే ముం* అంటూ బూతులు కూడా వాడేశారు. కానీ ఇలా కామెంట్లు పెట్టిన వాళ్లకు వ్యవసాయం అంటే పూర్తిగా తెలియదనే అనుకోవాలి.
ఆమె ఏం చెప్పిందో పూర్తిగా వినాల్సింది. కానీ వినలేదు. కేవలం థంబ్ నెయిల్ చూసి తమ అభిప్రాయాలను, తమ విజ్ఞాన ప్రదర్శనలను, బూతులను కామెంట్ల రూపంలో చూపించారు.
వ్యవసాయం వల్ల 70 శాతం వాటర్ పొల్యూషన్ జరుగుతుందనేది నిజం. ఇది నేను చెప్పేది కాదు.. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ చేసిన అధ్యయనంలో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా వాడుతున్న పెస్టిసైడ్స్ (పురుగు మందులు) వల్ల నీళ్లతో పాటు నేల, గాలి కూడా కాలుష్యం అవుతోంది. మనం తినే ఆహారం అంతా పురుగుమందుల మయమే. ఇప్పుడు ఆర్గానిక్ అంటూ అమ్ముతున్న వాటిలో కూడా పురుగు మందుల అవశేషాలు ఉంటున్నాయి.
అసలు పురుగు మందులు వాడకుండా ఒక సింగిల్ బిట్‌లో వ్యవసాయం చేయడం కుదరదు. ఎందుకు అంటే.. మన పైన్ ఉన్న పొలంలో పురుగు మందులు వాడితే.. అక్కడి నుంచి కిందకు ప్రవహించే నీళ్లు లేదా బోర్లలో నీళ్లు తప్పకుండా కలుషితం అయ్యే వస్తాయి.
ఆ పురుగుమందుల అవశేషాలు.. ఎలాంటి మందులు వాడకుండా సాగు చేసిన పంటలో కూడా కనపడతాయి. ఇక వర్షాలు పడినప్పుడు ఈ పొలాల మీదుగా ప్రవహించే వరద నీరు.. కాల్వల్లో, నదుల్లో కలిసినప్పుడు అవి కూడా కలుషితం అవుతాయి.
ఇదే యునైటెడ్ నేషన్స్ తమ రిపోర్టులో పేర్కొంది. ఒక సారి పురుగు మందులు వాడితే.. ఆ నేల నుంచి అవశేషాలు ఐదేళ్లైనా పోవు. వాటిని పోగొట్టాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆర్గానిక్ పద్దతిలో వ్యవసాయం చేసే ఎవరినైనా అడిగితే చెప్తారు.
ఇక ఆ ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పిందంటే.. 70 శాతం వ్యవసాయం వల్ల పొల్యూషన్ కరెక్టే. కానీ మనం తినే తిండిని పండించకుండా ఉండలేము కదా. అందుకే తిండికి సంబంధించి కాకుండా ఇతర పంటలను పండించడం మానేయాలి అంది. అంటే పత్తి వంటి పంటలను తగ్గిస్తే.. దాని వల్ల అయ్యే కాలుష్యం కూడా తగ్గుతుంది అని చెప్పింది. అంతే కానీ తిండి గింజలను పండిచ్చొద్దు అనలేదు.
NOTE: వ్యవసాయం వల్ల నీళ్లు, నేల ఎలా కలుషితం అవుతున్నాయో ఐక్యరాజ్య సమితి చెప్పిన చాలా వీడియోలు నెట్‌లో దొరుకుతాయి… #భాయ్‌జాన్…. John kora
Share this Article