Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చైన్లు కాదు గానీ… అప్పట్లో మా కొట్లాటల్లో సోడా బుడ్లు పగిలేవి బాగా…

January 22, 2026 by M S R

.
Subramanyam Dogiparthi ….. శివ సినిమా అనగానే నాకు గుర్తొచ్చేది నరసరావుపేటలో మేము డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్ధులుగా ఉన్నప్పుడు (1971-72) మేము చేసిన రెండు భీకర కొట్లాటలు . ఈ రెండు భీకర కొట్లాటల్లో వెనుక ఉండి రౌడీలు ఎవరూ నడిపించలేదు .

1972 ఫిబ్రవరిలో జరిగిన భీకర కొట్లాటలో మా ప్రత్యర్ధి విద్యార్ధుల బేచ్ మాత్రం భరతుడు అనే కూలీ రౌడిని వేరే ఊరి నుండి తెచ్చుకున్నారు . అతను సోడా బుడ్లు వేయటంలోexpert అని తెచ్చుకున్నారు . ఈ కొట్లాటలో సుమారు 300 సోడా బుడ్లు పగిలాయి .

1971 చివర్లో జరిగిన కొట్లాట అంతా మా విద్యార్ధుల మధ్యే . మా తరఫునే ఊళ్ళో లారీ ఫీల్డుకు సంబంధించిన కొందరు కుర్రాళ్లు పాల్గొన్నారు . అయితే ఈ కుర్రాళ్లు కూడా స్కూల్లో మాతో పాటే చదువుకున్నవారే . అయితే రెండు కొట్లాటల్లో సైకిల్ చైన్లు వాడలేదు . కర్రలు , లారీ సామాను , సోడా బుడ్లు .

Ads

మేము చదువుకునే రోజులకే చైన్లు ఉండేవి . ఒక పిడికి ఫిట్ చేసేవారు . ఈ శివ సినిమాలోలాగా చేతికి చుట్టుకుని కుమ్మేవారు కాదు . మొత్తం మీద రౌడీలకు , వీరోలకు సైకిల్ చైన్లు ఈ సినిమా బాగా పాపులర్ చేసింది . అదో సామాజిక కాంట్రిబ్యూషన్ . ఇంక సినిమాలోకి వద్దాం .

1989 అక్టోబర్లో వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ రంగంలో ఓ cult mass classic అని చెప్పొచ్చు . శంకరాభరణం ముందు ; శంకరాభరణం తర్వాత అన్నట్లు శివ ముందు ; శివ తర్వాత . ఇలా ఓ సెన్సేషనల్ చరిత్ర సృష్టించింది . నాగార్జున సినీ కెరీర్లో ఓ మైలురాయి . ఈ సినిమా నాగార్జునకు అమలని ఇచ్చింది . ఆమె మనకో బ్లూ క్రాసుని ఇచ్చింది .

ఎవర్ సెన్సేషనల్ దర్శకుడు రాం గోపాల్ వర్మకు మొదటి సినిమాతోనే టాప్ డైరెక్టర్ అయిపోయాడు . ఆయన విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్ధి అని అందరికే తెలిసిందే . ఆయన చదువుకునే రోజుల్లో విజయవాడలో రెండు విద్యార్ధి సంఘాలు ఉండటం , వాటికి రాజకీయ సామాజిక నాయకుల అండదండలు ఉండటం ఆయనకు బాగా తెలుసు .

ఆ నేపధ్యానికి రాజకీయ నాయకులు రౌడీలను అడ్డం పెట్టుకుని చేసే అఘాయిత్యాలను సినిమాలో బాగా చూపాడు వర్మ . అయితే ఈ సినిమాలోలాగా క్లాసులో సిగరెట్ తాగే విద్యార్ధులు నా యాభై ఏళ్ళ అనుభవంలో తగల్లేదు .

shiva
1992 లో నేను T.J.P.S.కాలేజి ప్రిన్సిపాలుని అయ్యేటప్పటికి పెద్ద పెద్ద కత్తులను వీపుకు పెట్టుకుని వచ్చే విద్యార్థులు ఉండేవారు . నేను ప్రిన్సిపాలుని అయ్యాక వారందరూ మంచి బాలురు అయిపోయారు . కాకపోతే నాకే రౌడీ ప్రిన్సిపాల్ అని ఓ బిరుదుని ప్రదానం చేసారు మా విద్యార్ధి మిత్రులు .

నగరంలోని రౌడీ గేంగుల సపోర్టుతో కాలేజీలో అఘాయిత్యాలు చేసే బేచుకు క్రమశిక్షణ కల విద్యార్థి ప్రతిఘటించటం , చివరకు అతను కూడా నగరంలో గేంగ్ లీడర్ కావటం , రాజకీయ నాయకులు ఎవరు lime light లో ఉంటే వారికి కొమ్ము కాయటం బాగా చూపారు వర్మ .

దారి తప్పిన విద్యార్ధి నాయకుడిగా జె డి చక్రవర్తి , కాలేజి కోసం చదువుకునే విద్యార్ధుల కొరకు అన్యాయాన్ని ఎదుర్కొనే విద్యార్ధి నాయకుడిగా నాగార్జున , నగరంలో కూలీ రౌడీగా రఘువరన్ , రాజకీయుడిగా కోట శ్రీనివాసరావు అద్భుతంగా నటించారు .

ఇంక అమల . చిలిపి యువతిగా , ప్రేమికురాలిగా , స్వతహాగా భరత నాట్య ప్రవీణురాలయిన ఆమె డాన్సుల్లో అదరగొట్టేసింది . నాగార్జున మిత్రులుగా జితేంద్ర (చిన్నా పేరే పెర్మనెంటయింది) , శుభలేఖ సుధాకర్  తదితర విద్యార్ధుల పాత్రధారులు అందరూ సహజంగా నటించారు .

ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేసిన ఉత్తేజ్ తెలంగాణ యాసలో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని పొందారు . మరో గొప్ప పాత్ర నానాజీ . ఆ పాత్రను ధరించిన నటుడు తనికెళ్ల భరణి .ప్రతీ గేంగ్ లీడరుకు ఇలాంటోడు ఒకడుంటాడని విజయవాడ వాళ్ళకు బాగా తెలుసు . ఈ సినిమాకు డైలాగులను కూడా ఆయనే వ్రాసారు .

chain
నాగార్జున అన్నగా మురళీమోహన్ , అమల అన్నగా సబ్ ఇనస్పెక్టరుగా సాయిచంద్ , గొల్లపూడి , బ్రహ్మాజీ , నటించారు . కాసేపే కనిపించినా గుర్తుండిపోయేలా నిర్మలమ్మ బాగా నటించింది . 55 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కాలేజీ సీన్లను 1881 లో స్థాపించబడిన సికింద్రాబాద్ లోని కీస్ హైస్కూల్లో షూటింగ్ చేయడం జరిగింది .

కాలేజీ విద్యార్ధులకు శాశ్వతంగా ఓ పాటను అందించింది ఈ సినిమా . సిరివెన్నెల వారు వ్రాసిన బోటనీ క్లాసు ఉంది మేటినీ ఆట ఉంది పాట . సినిమా హాల్లో అమల అదరగొట్టే పాట ఆనందో బ్రహ్మ గోవిందో హారి బాగుంటాయి . మిగిలిన నాలుగు పాటలూ డ్యూయెట్లు . వాటిల్లో అత్యంత శ్రావ్యమైన పాట సరసాలు చాలు శ్రీవారూ వేళ కాదు . An unmissable one .

ఏన్నియల్లో మల్లియల్లో , కిస్ మి , హల్లో రాంగ్ నంబర్ అంటూ సాగే పాటలూ చాలా శ్రావ్యంగా ఉంటాయి . ఈ సినిమా వీర హిట్ అవటానికి పాటలూ , డాన్సులూ కారణమే . డాన్సులను కంపోజ్ చేసిన సుందరాన్ని మెచ్చుకోవలసిందే . ఆహ్లాదకరమైన పాటలకు , సినిమాకు నేపధ్య సంగీతాన్ని అందించిన ఇళయరాజాకు హేట్సాఫ్ .

క్లాస్ మ్యూజిక్కే కాదు మాస్ మ్యూజిక్కుని కూడా అందించగలనని ప్రూవ్ చేసుకున్నారు. ఇంత శ్రావ్యమైన పాటల్ని బాలసుబ్రమణ్యం , జానకమ్మ , మనో , చిత్రలు పాడారు . 22 సెంటర్లలో వంద రోజులు , 5 సెంటర్లలో 175 రోజులు ఆడిన ఈ సినిమా 13 వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడింది .

25 సంవత్సరాల శివ అనే డాక్యుమెంటరీ కూడా నిర్మించబడింది . ఇలా ఓ డాక్యుమెంటరీ చేయబడిన ఏకైక సినిమా అట . I am subject to correction. ఉత్తమ చిత్రంగా ఫిలిం ఫేర్ అవార్డ్ , ఉత్తమ దర్శకుడిగా వర్మకు నంది అవార్డ్ వచ్చాయి . హిందీలో శివ అనే పేరుతోనే రీమేక్ చేయబడింది . అక్కడ కూడా బాగా హిట్టయింది .

ఈ సినిమా చూడనివారు మా తరంలోను , ఇప్పటి తరంలోనూ ఉండరనే అనుకుంటాను . ఒకరూ అరా ఉంటే అర్జెంటుగా చూసేయండి . యూట్యూబులో ఉంది . కాలేజీ కుర్రాళ్ళందరూ లేతగా కాలేజీ పిల్లల్లాగానే ఉంటారు . (రీసెంటుగా రీరిలీజైంది)…

నేను పరిచయం చేస్తున్న 1229 వ సినిమా .
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చైన్లు కాదు గానీ… అప్పట్లో మా కొట్లాటల్లో సోడా బుడ్లు పగిలేవి బాగా…
  • సరిగ్గా 30 ఏళ్లు… తెలుగు శాటిలైట్ చానెళ్ల తొలి రోజుల బాలారిష్టాలు…
  • 25 లక్షల లైకుల వైరల్ ఇన్‌స్టా పోస్ట్… ఇంతకీ ఏముందీ ఇందులో..?
  • బయట హరీష్ ప్రచారం వేరు… సిట్ అసలు విచారణ నిజాలు వేరు…
  • పెళ్లికాని ప్రసాదులు..!! నిజానికి సీరియస్ వార్తే… రాబోయే సంక్షోభాల సూచన..!!
  • లక్షల మిర్చి బజ్జీలు… వేల భక్ష్యాలు… కర్నాటక జాతరల స్పెషాలిటీ…
  • జోలా జోలమ్మ జోలా… ఈ సినిమాకు ‘సూత్రధారులు’ ఎవరయ్యా అంటే…
  • థాంక్స్ రెహమాన్… నీ అభిమానుల కళ్లు కూడా తెరిపించావు…
  • అబుదాబి ఆయిల్ క్షేత్రాల్లో… ఇండియా సొంత ఉత్పత్తి… శుభసంకేతం…
  • దంపతులకు జాయింట్ టాక్స్ … మధ్యతరగతికి ‘బడ్జెట్’ వరం..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions