ఈ సీజన్‌లో కూడా ఆ దిక్కుమాలిన రెస్టారెంట్, మసాజులు వంటి చెత్త టాస్క్ గాకుండా హౌజులో హత్యలు అనే ఓ కొత్త గేమ్ ప్రవేశపెట్టడం వరకూ బాగానే ఉంది… కానీ దాన్ని ఆసక్తికరంగా నడిపించడంలో బిగ్‌బాస్ టీం వైఫల్యమో, కంటెస్టెంట్ల చేతకానితనమో గానీ మూడు రోజుల గేమ్ అస్సలు ఆకట్టుకోలేదు… నిజానికి ఈ సరదా గేమ్ బాగా ఫన్ జనరేట్ చేసే అవకాశం ఉండేది…
బిగ్‌బాస్ భార్య హత్యకు గురికావడం అసలు పాయింట్… ఇద్దరు రిపోర్టర్లు, ఇద్దరు పోలీసులు, ఓ డ్రైవర్, ఓ చెఫ్, ఓ మేనేజర్… ఇలా రకరకాల పాత్రలు ఉన్నయ్… ఎవరు హత్య చేశారని పోలీసులు కనిపెట్టేలోపు వరుసగా మరిన్ని హత్యలు జరుగుతుంటయ్… వాళ్లు కనిపెట్టాలి… ఈ క్రమంలో కావల్సినంత ఫన్ క్రియేట్ చేయాలి… ఇదీ ఆలోచన…
ఐతే సిల్లీ హత్యలు ఈ గేమ్‌పై ఆసక్తిని చంపేశాయి… ఒక మిర్రర్ మీద ‘క్రై, గెట్ ఔట్’ అని రాస్తే సదరు కంటెస్టెంట్ హత్యకు గురయినట్టేనట… ఓ స్టిక్కర్ ఎలాగోలా ఓ కంటెస్టెంట్‌కు అతికిస్తే తనూ ఖతం అయిపోయినట్టేనట… కనీసం అవి కూడా సరిగ్గా చేయలేక శివాజీ చేతులెత్తేశాడు… ఈ గేమ్ ఫ్లాప్ కావడంలో తనదే ప్రధాన పాత్ర… అసైన్ చేసిన హత్యలు చేయలేకపోవడంతో బిగ్‌బాస్ విసిగిపోయి ఆ పనిని చివరకు ప్రియాంకకు అప్పగిస్తాడు… ‘ముసలి వెంట్రుక’గా అర్జున్ అనుమానించి, శివాజీ వైపు దృష్టి పెట్టడం దగ్గర మాత్రం ఆట కాస్త రక్తికట్టింది…
Ads
ఎప్పుడూ సోపాలో పడుకుని, కూర్చుని, అందరి మీదా నోరేసుకుని, పెత్తనం చెలాయించే శివాజీకి ఆట చేతకాదు, ఫన్ – కామెడీ అస్సలు చేతకాదు… గేమ్‌లో కూడా ఇగో… తనను అమర్‌దీప్ మిస్టర్ శివాజీ అంటే అదో వెటకారం పిలుపుగా భావించి, పోలీస్ పాత్రధారిగా ఉన్న అమర్‌దీప్ మీద మాటిమాటికీ 420 అని నోరు పారేసుకుంటాడు… నాగార్జున పదే పదే నెత్తికి ఎత్తుకునే ఈ శివాజీ మొత్తానికి ఈ సీజన్‌కే తలనొప్పి కేరక్టర్ అయిపోయాడు… చాణక్య లేదు, మన్నూ లేదు… శివాజీ తీరు చూసిన ప్రేక్షకులు వోటింగులో తనను కిందకు దింపేశారు…
సాధారణంగా శివాజీకి నమ్మకమైన పాలేర్లుగా హౌజులో మెసలుతున్న ప్రశాంత్, యావర్‌లతో శివాజీ ఓ గ్యాంగులా ఆట ఆడుతున్నాడు కదా… ఈసారి ఈ బ్యాచ్ మొత్తం డౌనయిపోయింది… శివాజీ గేమ్‌లో ఫెయిల్… యావర్ అస్సలు ఆకట్టుకోలేదు, తన పాత్రకు ప్రాధాన్యం కూడా లేదు… ప్రశాంత్ పాత్ర మొదట్లోనే చచ్చిపోయి, తనకు ఆడే చాన్సే లేకుండా పోయింది…
ఉన్నంతలో అమర్‌దీప్ చాలా బెటర్… కాస్త రవితేజ పోకడలతో ఫన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు… తన పక్కనే ఉండే అర్జున్ అందులో ఫెయిల్… తనకు సీరియస్‌నెస్ కూడా నప్పలేదు… మొదట్లో ప్రియాంకకు చాన్స్ రాలేదు గానీ చివరలో హత్యలు చేసే అవకాశం రావడంతో తను చక్కగా వాడుకుంది… శోభ పర్లేదు… అశ్విని మళ్లీ చాన్స్ చెడగొట్టుకుంది… గౌతమ్ సోసో… శివాజీని రతిక హంతకుడిగా అనుమానించాక కాస్త బాగానే పర్‌ఫామ్ చేసింది..! ఏ శివాజీ గ్యాంగ్ పదే పదే టార్గెట్ చేస్తున్నదో అదే అమర్, శోభ, ప్రియాంక బ్యాచ్ మళ్లీ తమ ఆటతీరుతో టాప్‌లోకి వచ్చారు… శివాాజీ కారణంగా తన గ్యాంగ్ డౌనయిపోయింది..!
Share this Article