Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శోభాశెట్టి బతికిపోయెన్… ఆట సందీప్ ఔటయిపోయెన్… తొలిసారి మేల్ ఎవిక్షన్…

October 28, 2023 by M S R

ఆమధ్యలో ఓ సైట్ వాడు రాశాడు… శోభాశెట్టిని అర్థంతరంగా అనగా వారం మధ్యలోనే బిగ్‌బాస్ హౌజు నుంచి తరిమేస్తున్నారు అని… శివాజీకి డప్పు కొట్టే మీడియా బ్యాచ్ మొత్తం శోభాశెట్టిని టార్గెట్ చేసింది… ఏకంగా తిడుతూ, ఏదో పర్సనల్ కక్ష ఉన్నట్టుగా రాస్తోంది… గత వారమే ఆమెను పంపించేయాల్సింది లక్కీగా తప్పించుకుంది, నయన పావనిని బలి చేశారనీ రాసింది… ఈసారి ఖచ్చితంగా బయటికి నెట్టేయడం ఖాయమనీ రాసింది… కానీ ఏం జరిగింది..?

మీడియా ఊపులకు ఎవిక్షన్లు జరగవు… ఎందుకోగానీ శోభాశెట్టి మీద విపరీతమైన వ్యతిరేకత పెంచడానికి బాగా ప్రయత్నాలు సాగుతున్నయ్… కానీ ఆమె మళ్లీ బచాయించింది… నిలిచింది… బిగ్‌బాస్ ఆమెను ఇప్పుడప్పుడే బయటికి పంపించడు… ఆమెతో కుదిరిన ఒప్పందం ఫలితమే కావచ్చు, లేక ఆమె వంటి టెంపర్‌మెంట్ ఉండి, శివాజీ బ్యాచుతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఫైట్ చేస్తున్నందువల్ల కావచ్చు… అలాంటోళ్లే బిగ్‌బాస్ వంటి గేమ్ షోకు అవసరమని భావించడం వల్ల కావచ్చు… అప్పుడే ఏడుస్తుంది, ఫైట్ చేస్తుంది, ఏ టాస్కులనూ వదిలిపెట్టదు, మ్యాగ్జిమం ఇచ్చేస్తుంది… భలే కేరక్టర్…

నిజానికి గత వారం, ఈవారం కూడా పలు బిగ్‌బాస్ వోటింగ్ సైట్లలో శోభాశెట్టి పట్ల వ్యతిరేకత బాగా వ్యక్తమైంది… ఈసారి ఆమెతో లీస్ట్ వోట్లలో ఆట సందీప్ పోటీపడ్డాడు… చివరకు ఆమె నిలబడింది… సందీప్ ఔటయిపోయాడు… ఎనిమిది వారాాల బిగ్‌బాస్7 సీజన్‌లో తొలిసారి ఓ మేల్ కంటెస్టెంట్ బయటికి పోతున్నాడు… మొదటి ఏడు వారాలూ ఆడ కంటెస్టెంట్లనే బయటికి పంపించేశారు…

Ads

shobha

నిన్న కెప్టెన్సీ ఖరారు చేసే సమయంలో యావర్ దూకుడుగా తన మీదకు వచ్చి పిచ్చి పిచ్చిగా అరుస్తున్నప్పుడు కూడా శోభాశెట్టి తొణకలేదు… మాటకుమాట సమాధానమిస్తూ… నువ్వు నా స్థానంలో నిలబడకపోవు, నేనూ ఇలాగే నీలాగే టార్గెట్ చేయకపోను అని సవాల్ చేసింది… ఇప్పట్లో నేను హౌజు నుంచి పోయేదే లేదనీ చెప్పింది… అంటే, ఆమెకు తెలుసు, తను ఎన్ని వారాలు ఉంటుందో తనకు మస్తు క్లారిటీ ఉంది… అవును మరి, అంతా బిగ్‌బాస్ టీం స్కెచ్ ప్రకారమే కదా ఆట సాగేది… ఈ ఆటలో ఆట సందీప్ బుక్కయిపోయాడు…

నిజానికి ఆట సందీప్ మొదట్లో లక్కీగా ఎలిమినేషన్ల నుంచి ఇమ్యూనిటీ పొంది ఇన్నాళ్లూ బచాయించాడు… ఈసారి నామినేషన్లలో చేరడంతో ఇక లీస్ట్ వోట్లతో హౌజ్ నుంచి వెనుతిరగక తప్పలేదు… మరీ అంత బ్యాడ్ పర్‌ఫామెన్స్ ఏమీ కాదు… కాకపోతే శివాజీ బ్యాచ్ కాదు తను… శోభాశెట్టి బ్యాచ్… అందుకే తన మీద కూడా బాగా వ్యతిరేకతను ప్రోదిచేశారు బయట… ఆటల్లో, టాస్కుల్లో తను యాక్టివ్‌గానే ఉన్నాడు… బట్, చివరకు ఔటవ్వక తప్పలేదు…

ప్రస్తుతానికి హౌజులో శివాజీ బ్యాచే బలంగా కనిపిస్తోంది… భోలే, యావర్, ప్రశాంత్, రతిక, అశ్విని ఎట్సెట్రా కేరక్టర్లు అచ్చంగా శివాజీ చెప్పుచేతల్లో నడుస్తున్నారు… ఇప్పుడు ఆట సందీప్ ఔట్ కాబట్టి ఇక ప్రియాంక, తేజ, శోభ, అమర్ దీప్‌ల బలహీనమైన బ్యాచ్ ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions