30 ఇయర్స్ పృథ్వి… నో డౌట్, మంచి మెరిట్, టైమింగ్ ఉన్న కమెడియన్… అవును, ఎన్నిరకాల పాత్రలు పోషించినా సరే కమెడియన్‌గానే క్లిక్కయ్యాడు… రాజకీయాల్లో ఫ్లాప్… వైసీపీ వెంట నడిచి, టీటీడీ భక్తి చానెల్ పగ్గాలు చేపట్టి, నాలుగు రోజులకే అదేదో రక్తి ఆడియోతో బదనాం అయిపోయి, తరువాత అక్కడి నుంచి ఉద్వాసనకు గురై, తరువాత ఏకంగా వైసీపీకే స్వస్తి చెప్పాడు తను…
ఈలోపు తన ఫ్యామిలీ కేసు తనను నెగెటివ్ ఇమేజీలోకి నెట్టేసింది… అప్పుడెప్పుడో 1984లో శ్రీలక్ష్మితో పెళ్లయింది… ఇద్దరు పిల్లలు… ఎక్కడో సంసారం గాడితప్పింది… పృథ్వి విజయవాడ నుంచి హైదరాబాద్ షిఫ్టయ్యాడు… 2016 నుంచీ భార్యాభర్తలు విడిగా ఉంటున్నారట… అంటే 32 ఏళ్ల కాపురం విచ్ఛిన్నం… అన్నేళ్ల తరువాత… విశేషమే…
2017 లో ఆమె కోర్టుకెక్కింది… భర్త సినిమాల్లోకి వెళ్లాక తనను వేధిస్తున్నాడని, అందుకే విడిగా ఉంటున్నాననీ, నెలకు 30 లక్షలు సంపాదిస్తున్నాడు కాబట్టి తనకు 8 లక్షల భరణం ఇప్పించాలని కోరింది… కోర్టు కూడా అదే తీర్పు చెప్పింది… అంతేకాదు, శ్రీలక్ష్మి కోర్టు ఖర్చులు కూడా పృథ్వియే భరించాలని చెప్పింది… కానీ తను బేఖాతరు చేసినట్టున్నాడు…
Ads
ఏం జరిగిందో ఏమో గానీ… భరణం చెల్లించడం లేదు, కోర్టుకు పిలిచినా రావడం లేదు కాబట్టి అరెస్టు వారెంట్ జారీ చేసిందట విజయవాడ ఫ్యామిలీ కోర్టు… ఇప్పుడీ వార్త వైరల్ అవుతోంది… 2017లో ఈ 8 లక్షల భరణం తీర్పు వస్తే ఇన్నేళ్లూ జరిగింది ఏమిటో క్లారిటీ లేదు… సరిగ్గా భరణం ఇవ్వడం లేదా..? అస్సలు ఇవ్వడం లేదా..? పోనీ, పైకోర్టుకు రివ్యూ కోసం వెళ్లాడా..? ఏమీ తెలియడం లేదు…
పృథ్వి మొదటి నుంచీ కొంత కంట్రవర్సీ కేరక్టరే… రాజకీయాల్లోకి వచ్చి, వైసీపీ నుంచి బయటపడి, తరువాత జనసేనలో చేరి, అటూఇటూ కాని పొలిటికల్ కెరీర్ తనది… తరువాత పెద్దగా సినిమాల్లో కూడా అవకాశాల్లేవు… అదేదో చానెల్‌లో పొలిటికల్ బత్తాయిలు అనే సెటైరికల్ షో చేస్తుంటాడు గానీ, దాంతో పెద్ద రెవిన్యూ ఏమీ లేదు… ఆదాయం పడిపోవడానికి, భరణం సక్రమ చెల్లింపులు లేకపోవడానికి లింక్ ఉండొచ్చు… ఇలా పృథ్వి సినిమా, పొలిటికల్ కెరీర్లు రెండూ ఫెయిల్యూర్ స్టోరీలే..!! ఇప్పుడు తన వయస్సు 60 ఏళ్లు..!
Share this Article