ఈ-కామర్స్ బడా ప్లేయర్ అమెజాన్ తప్పు తెలుసుకుంది, లెంపలేసుకుంది, దిద్దుబాటు చర్యలు తీసుకుంది… విషయం ఏమిటంటారా..? దేశమంతా అయోధ్య ఉత్సవ వాతావరణం అలుముకుని ఉంది కదా… దీన్ని సొమ్ము చేసుకోవడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు… ఫ్రాడ్‌స్టర్లు రంగంలోకి దిగారు… సైబర్ పోలీసులు సహా అందరూ అలర్ట్ ప్రకటిస్తూనే ఉన్నారు…
కొందరు అయోధ్య గుడి పిక్చర్ పెట్టి చందాలు అడుగుతున్నారు, తీరా లోపలకు వెళ్లి చూస్తే అదేదో టెంపుల్ లేదా ఇంకేదో ఫ్రాడ్ అడ్రెస్ ఉంటుంది… చివరకు రాముడి అక్షింతలకూ ఈ బెడద తప్పడం లేదు… ఇప్పుడేం జరిగిందంటే..?
అమెజాన్ గతంలో కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా బోలెడు ప్రాడక్ట్స్ అమ్మకానికి పెట్టి భంగపడిన సంగతి తెలుసు కదా… అమెజాన్‌లో ఒప్పంద సంస్థలు ఏవి అమ్మకానికి పెడుతున్నాయో, వాటి బ్యాక్ గ్రౌండ్ ఏమిటో చెక్ చేసుకునే సోయి, వ్యవస్థ అమెజాన్‌కు లేదు… ఇప్పుడు ఏకంగా అయోధ్య రామ మందిర ప్రసాదాన్నే అమ్మకానికి పెట్టింది ఓ సంస్థ అమెజాన్‌లో…
Ads
ఇది తమ దృష్టికి రావడంతో సీసీపీఏ (Central Consumer Potection Authoriy) అమెజాన్‌కు ఓ స్ట్రాంగ్ నోటీసు పంపించింది… అమెజాన్‌కు అప్పుడు గానీ అర్థం కాలేదు… వెంటనే ఈ ప్రసాదం అమ్మకానికి పెట్టిన సెల్లర్ మీద యాక్షన్ తీసుకుంటామని ప్రకటించి, ఆ ప్రసాదం సేల్ ఆప్షన్స్ అన్నీ రిమూవ్ చేసింది… సదరు సెల్లర్స్ ఉద్దేశాలను విచారిస్తామనీ ప్రకటించింది…
దీన్ని మొదట ఇండియాటుడే పబ్లిష్ చేసింది… తరువాత ఇతర జాతీయ ఆంగ్ల పత్రికలు ఫాలో అయ్యాయి… దీనిపై సీఏఐటీ (Confederation of All India Traders) కంప్లయింట్ చేసింది… అమెజాన్ మోసకారి వ్యాపార ధోరణులపై చర్య తీసుకోవాలని కోరింది… దీంతో సీపీపీఏకు యాక్షన్‌లోకి దిగక తప్పలేదు… రామమందిర ప్రసాదం పేరిట ఏవో దిక్కుమాలిన స్వీట్లను అడ్డగోలు ధరలకు అమ్మకానికి పెట్టారు… పావు కిలోకు 350 రూపాయలు అట… అంటే కిలోకు 1400… వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలనీ, ఈలోపు ఆ అమ్మకాలు నిలిపివేయాలని, లేదా Consumer Protection Act 2019 కిింద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది…
ఒకటీరెండు కాదు, చాలా సంస్థలు రామమందిర ప్రసాదం పేరిట అమెజాన్‌లో ఆన్‌లైన్ అమ్మకాలకు పెట్టినట్టు సీపీపీఏ గుర్తించింది… ఇదంతా వినియోగదారులను మోసగించడమే… శ్రీరామమందిర్ అయోధ్య ప్రసాద్, రఘుపతి ఘీ లాడూ, అయోధ్య రామమందిర్ అయోధ్య ప్రసాద్, ఖోయా ఖోబీ లాడూ, అయోధ్య ప్రసాద్-దేశి కౌ మిల్క్ పేడా… ఇలాంటి పేర్లతో తీపి సరుకు… సదరు Consumer Act ప్రకారం అమ్మకపు సరుకుపై తప్పుడు ప్రకటనలు ఇచ్చినా, ప్రచారాలు చేసినా, నాణ్యత- పరిమాణం- ముడిసరుకులు వంటి అంశాల్లో తప్పుడు సమాచారం ఇచ్చినా కఠిన చర్యలు తీసుకోవచ్చు…
Share this Article