.
అభిశంసన పేరుతో దేశంలోని కోర్టులనే బ్లాక్‌మెయిల్ చేయాలనుకున్న హిందూ వ్యతిరేక పార్టీలకు మరో ఎదురుదెబ్బ..! తాజా వార్త ఓసారి చదవండి…
- ‘‘మద్రాస్ హైకోర్టులో తమిళనాడు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ… తిరుప్పరం కుండ్రం కార్తీకదీపం వివాదంలో హిందూ సంస్థలకు అనుకూలంగా తీర్పు.. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను తిరస్కరించిన మద్రాసు హైకోర్టు… సింగిల్ బెంచ్ జడ్జి తీర్పును సమర్థించిన ధర్మాసనం..’’
గుర్తుంది కదా… సమగ్ర విచారణ తరువాత తిరుప్పరం కుండ్రం దీపం వెలిగించుకోవడానికి హిందూ సంస్థలకు అనుమతించాలని తీర్పు చెప్పిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి. ఆర్. స్వామినాథన్ అభిశంసనకు కాంగ్రెస్ సహా, నాస్తిక- హిందూ వ్యతిరేక పార్టీలు నోటీసులు ఇచ్చాయి తెలుసు కదా…
Ads
దీనిపై జుడిషియరీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది… న్యాయవ్యవస్థను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాయని వ్యతిరేకించిన సంగతి తెలిసిందే కదా… ఓసారి పూర్తిగా ఈ కేసు పూర్వాపరాలు ఇవిగో…
తమిళనాడు… మధురై దగ్గర ఓ ప్రాచీన ఆలయం… తిరుప్పరంకుండ్రం… మురుగన్ అంటే కుమారస్వామి దేవాలయం ఉన్న ఊరు… స్వామి వారి ఆరు ముఖ్య దేవాలయాల్లో ఇది ఒకటి… ఇక్కడ కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి… దీనికి తమిళనాడులోని అన్ని ప్రాంతాలు నుండే కాకుండా కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ నుండి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు…
ఇక్కడ ఓ కొండపై 6 – 8 శతాబ్దాలలో పాండ్య రాజులు నిర్మించిన హిందూ గుహ ఆలయం ఉంది… ఒక దీప స్తంభం కూడా ఉంది… కార్తీక మాసంలో ఇక్కడ స్తంభంపై దీపం వెలిగించడం శతాబ్దాలుగా ఉన్న ఆచారం… 14వ శతాబ్దంలో మధురై సుల్తాన్ పాలనలో ఈ కొండ మీద దేవాలయం పాక్షికంగా ధ్వంసం చేయబడింది… దేశమంతా ఈ మత విధ్వంసం, హిందూ గుళ్ల విధ్వంసం జరిగిందే కదా…
విజయనగర రాజులు వచ్చి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు… 17వ శతాబ్దంలో కొందరు స్థానిక ముస్లింలు కొండ మీద పునరుద్ధరించబడిన హిందూ దేవాలయ సముదాయంలో కొంత భాగం ఆక్రమించి, దానిని సికిందర్ షా దర్గాగా మార్చారు…
హిందూ దేవాలయం ఆక్రమించి కట్టినట్లు రుజువుగా పాండ్య రాజుల శిల్ప కళ ఉన్న రాతి స్తంభాలు, దర్గా ప్రవేశ ద్వారం మీద మకర తోరణం, దర్గా వెనుక ఉన్న గోడపైన మురుగన్ శిల్పం వంటివి ఇప్పటికి కనిపిస్తాయి… ఓ క్రోనాలజీలో చెప్పుకుందాం…

1) 1923లో మధురై సబార్డినేట్ జడ్జి ‘ఈ గిరి మొత్తం సుమారు 170 ఎకరాలు, అంతా మురుగన్ ఆలయ ఆస్తి’ అని తీర్పు ఇచ్చాడు.., కేవలం నెల్లి తోపు, అంటే సమాధులు ఉన్న చోటు, దర్గాలో ప్రవేశించడానికి ఉన్న రాతి మెట్లు, దర్గా ఉన్న చిన్న ప్రాంతంపై ముస్లింలకు హక్కులిచ్చి, ఇక్కడ ఎవరూ కొత్తగా తవ్వకాలు చేయడం, కొత్త కట్టడాలు,, సమాధులు నిర్మించడాన్ని నిషేధించించాడు…
2) ఈ తీర్పును 1926లో మద్రాస్ హైకోర్టు సమర్థించింది… హిందూ దేవాలయ ప్రాంతంలో అంతు బలులు ఇస్తున్నారు అని హిందూ సంస్థలు కోర్టుకు వెళ్లడంతో, 2025 ఫిబ్రవరిలో మద్రాస్ హైకోర్టు దర్గాలో జంతుబలులు నిషేధించింది…
3) ఈ ప్రాచీన దీప స్తంభం మీద ఇకపై ప్రతీ సంవత్సరం దీపం వెలిగించుకోవడానికి హిందు మున్నాని నేత రామరవికుమార్, మరో 10 మంది అనుమతి కోరితే… 2025 డిసెంబర్ 1న మద్రాస్ హైకోర్టు (జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్) దీప్ థూణ్‌లో వెలిగించడానికి అనుమతి ఇచ్చింది, ఇది ‘తమిళ సంప్రదాయం’ అని, దర్గా హక్కులను ప్రభావితం చేయదని పేర్కొంది…
4) డిసెంబర్ 3వ తేదీన CISF రక్షణతో దీపస్తంభం మీద దీపం వెలిగించాలని ఆదేశించింది… కానీ మధురై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దీపం వెలిగించడానికి ప్రయత్నించిన భక్తులను అడ్డుకున్నారు… సెక్షన్ 144 క్రింద నిషేదాజ్ఞలు విధించారు…
5) రామా రవికుమార్ బృందం ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ వేసింది… 4వ తేదీన మద్రాస్ హై కోర్ట్ సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు సమర్థిస్తూ… దీపం వెలిగించడానికి వ్యతిరేకంగా చేసిన ప్రభుత్వ అప్పీల్ కొట్టేసింది…
6) ఐనా తమిళనాడు ప్రభుత్వం ఊరుకోలేదు… ఏకంగా సుప్రీంకోర్టు లో ‘అర్జంట్ లిస్టింగ్’ కోరింది… స్పెషల్ మెన్షన్ అవసరం లేదు, నంబరింగ్ చేసి లిస్ట్ చేయండి అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు…
….. చివరకు ప్రభుత్వమే మొండిపట్టుతో దీప్ థూన్‌లో దీపం వెలిగించనివ్వలేదు, కొంత ఉద్రిక్తత, ఘర్షణ తరువాత చివరకు దీప మండపంలో దీపం వెలిగించారు ఎప్పటిలాగే… (గత ఏడాది సెప్టెంబరు- అక్టోబరు వార్తలు)
నిష్ఠురంగా ఉండే నిజం ఏమిటంటే... మెజారిటీ ప్రజలు తమ మతభావాలు, మనోభావాల కోసం తమ ప్రభుత్వాలతోనే పోరాడాల్సిన దురవస్థ బహుశా ప్రపంచంలో ఈ దేశంలో మాత్రమేనేమో..!!

తరువాత ఏమైందీ… ఇదీ అసలు వార్త…
అభిశంసన తీర్మానం (Impeachment Motion) ఈ తీర్పు నేపథ్యంలో, ప్రతిపక్ష కూటమికి చెందిన వంద మందికి పైగా ఎంపీలు జస్టిస్ స్వామినాథన్‌పై అభిశంసన తీర్మానాన్ని (Impeachment Motion) ప్రవేశపెట్టారు…
-
ఆరోపణలు…: న్యాయమూర్తి పక్షపాతంతో వ్యవహరించారని, లౌకిక సూత్రాలకు విరుద్ధంగా ఒక ప్రత్యేక రాజకీయ భావజాలం ఆధారంగా తీర్పు ఇచ్చారని ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు… ఈ చర్యతో ఈ అంశం రాష్ట్రస్థాయి వివాదం నుంచి జాతీయ స్థాయి చర్చనీయాంశంగా మారింది….
న్యాయమూర్తుల అపూర్వ మద్దతు
-
56 మంది మాజీ న్యాయమూర్తుల జోక్యం…: ఈ అభిశంసన తీర్మానాన్ని నిరసిస్తూ 56 మంది మాజీ న్యాయమూర్తులు (వీరిలో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు, మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు) ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు… ఇది కేవలం మద్దతు ప్రకటన మాత్రమే కాదు, ఇది న్యాయ వ్యవస్థపై జరుగుతున్న రాజకీయ దాడికి వ్యతిరేకంగా ఒక బలమైన జోక్యం (Full Force Intervention)…
-
ప్రధాన సందేశం…: మాజీ న్యాయమూర్తులు తమ ప్రకటనలో, కోర్టును రాజకీయ క్రీడా మైదానంగా మార్చవద్దని, కేవలం తీర్పులపై విభేదాల ఆధారంగా ఒక సిట్టింగ్ న్యాయమూర్తిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు… న్యాయమూర్తులను Einschüchtern (భయపెట్టడానికి) అభిశంసనను ఒక రాజకీయ సాధనంగా ఉపయోగించడం న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యాన్ని దెబ్బతీస్తుందని వారు హెచ్చరించారు…

నిజమైన పోరాటం…
తమిళనాడు రాజకీయాలు ఈ అంశాన్ని ఆలయ సమస్యలు, కుల గుర్తింపులు, పార్టీ వైరుధ్యాలతో కూడిన ఒక “కొలిమి”గా మార్చాయి… ప్రస్తుతం ఈ వివాదం కేవలం ఆలయంలో దీపం వెలిగించడం గురించి మాత్రమే కాదు…
-
భవిష్యత్తుపై పోరు…: ఇది న్యాయాన్ని ఎవరు నిర్ణయిస్తారు అనే దాని గురించి, న్యాయ వ్యవస్థపై రాజకీయాధికారం పరిమితులను ఎవరు నిర్ణయిస్తారు అనే దాని గురించి జరుగుతున్న ప్రధాన పోరాటం…
-
ప్రభావం…: అభిశంసన తీర్మానం ఒక రాజకీయ వ్యూహంగా మారగా, మాజీ న్యాయమూర్తుల ప్రతిస్పందన ‘న్యాయస్థానాన్ని ఏ పక్షం కూడా అణచివేయలేదు’ అనే హెచ్చరికగా మారింది…
- కార్తీక దీపం రాజకీయం, న్యాయం మధ్య ఉన్న ‘ఫాల్ట్ లైన్స్‌ను’ ప్రకాశింపజేసింది… చివరకు తన వద్దకే వచ్చిన ఈ కేసులో హైకోర్టు ధర్మాసనం హిందూ వ్యతిరేక పార్టీల బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడలేదు… ధర్మాసనం కూడా జస్టిస్ స్వామినాథన్ తీర్పు సరైందేనని విస్పష్టంగా తేల్చిచెప్పింది…
- రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న శాంతిభద్రతల సమస్య ఓ ఊహాత్మక దెయ్యం అని అభివర్ణించింది… రాష్ట్ర ప్రభుత్వమే స్పాన్సర్ చేస్తే తప్ప ఆ సమస్య తలెత్తదు అని అభిప్రాయపడింది… స్టాలిన్ కుహనా నాస్తిక ధోరణికి ఇది ఎదురుదెబ్బ… అంతేకాదు…
యాంటీ బీజేపీ పేరిట హిందూ వ్యతిరేక ధోరణులతో చెలరేగే లెఫ్ట్, కాంగ్రెస్, టీఎంసీ, ఆర్జేడీ, ఎస్పీ తదితర పార్టీలకు ఇది షాక్… అఫ్ కోర్స్, రామజన్మభూమిని శూర్పణఖ జన్మభూమి అని కొక్కిరించిన కేసీయార్ పార్టీ కూడా తక్కువేమీ కాదు… సనాతన ధర్మాన్ని టైఫాయిడ్, తదితర వైరల్ జబ్బులతో పోల్చిన తమిళనాడు ప్రభుత్వం (స్టాలిన్ కొడుకు) మళ్లీ సుప్రీంకోర్టుకు ఎక్కుతుందా..?
“Ridiculous and hard to believe the fear of mighty state that by allowing representatives of devasthanam to light a lamp at the stone pillar on a particular day in a year will cause disturbance to public peace. Of course, it may happen only if such a disturbance is sponsored by the state itself. We pray no state should stoop to that level to achieve their political agenda. The submission that pillar belongs to dargah added another reason for the other side to be sceptical about the offer made by the workforce monitoring mediation,” the bench added…
Share this Article