శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎప్పుడో… ఈ పాట గుర్తుందా..? బ్రహ్మాండమైన మ్యూజిక్ కంపోజిషన్… చిన్న చిన్న స్టెప్పులతో, మంచి గ్రేస్‌తో చిరంజీవి ఇరగదీస్తాడు… అయితే ఆ పాటకు తగిన చిత్రీకరణ ఆ దర్శకుడెవరో గానీ చేతకాలేదు… ఇంకాస్త శ్రద్ధ పెట్టి, చిరంజీవిని ఫుల్లుగా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే, ఆ పాట ఇంకెక్కడికో వెళ్లి ఉండేది… ఇదెందుకు చెప్పుకోవడం అంటే… ఈటీవీలో డాన్సు ప్రధానంగా ఢీ అనే ఓ ప్రోగ్రాం వస్తుంది కదా… పదవ తారీఖున ప్రసారం చేయబోయే ప్రోగ్రాంలో కరీముల్లా అనే జూనియర్ చిరంజీవి అచ్చు చిరంజీవిని దింపేశాడు డాన్సుల్లో… ఆ చిన్న ప్లాట్‌ఫామ్ మీదే మొక్కలు, లైట్లు, వెట్ వేపర్, ఆ ఆంబియెన్స్ భలే తీర్చిదిద్దింది ఈటీవీ టీం… సూపర్బ్… ఎందుకు అభినందించాలీ అంటే… ఈ పాట ఒక్కటే కాదు… రకరకాల పాటలకు విభిన్నమైన ‘సెట్లు’ వేసేశారు… అన్నీ బాగున్నయ్… బాగా కనిపిస్తున్నయ్… కానీ ఈటీవీ గానీ, మల్లెమాల గానీ చీపుగా ప్రోగ్రాం తీస్తారు కదా, మరి కాస్త ఖర్చు పెట్టడానికి ఎందుకు సాహసించారు…? అదీ అసలు ప్రశ్న…
ఎందుకంటే..? మాటీవీలో ఓంకార్ డాన్స్ ప్లస్ అని ఓ ప్రోగ్రాం చేస్తున్నాడు కదా… ఆరుగురు జడ్జిలు, తను చీఫ్ జస్టిస్… బోలెడు ఖర్చు… పైగా మొన్న డాన్స్ విత్ సెలెబ్ అని ఓ కాన్సెప్ట్‌తో సెలబ్రిటీలను తీసుకొచ్చి డాన్సులు చేయించాడు… దాంతో రొటీన్‌గా కనిపించే సర్కస్ ఫీట్లు మాయం అయిపోయి, కాస్త భిన్నమైన డాన్సులు కనిపించాయి… ఎస్, కాన్సెప్ట్ బేస్డ్ డాన్సులు ఎప్పుడూ భిన్నంగా ఉండి, ప్రేక్షకుడిని ఆకట్టుకుంటయ్… ఓంకార్ ఈ బాటలో వెళ్లి మంచి రేటింగ్స్ కొట్టేశాడు… ఈ ఢీ షోలో మేం తోపులం అని విర్రవీగే మల్లెమాల టీం, ఈటీవీ టీం ఎక్కడ షాక్ తీసుకున్నాయో తెలుసా..? నిజంగానే ఓంకార్ ఢీని ఓడించాడు… ఈసారి రేటింగుల్లో ఢీ షో 6.43 రేటింగులు పొందగా, డాన్స్ ప్లస్ 6.55 రేటింగు సాధించింది… ఇక్కడ తేడా స్వల్పమే కావచ్చు, కానీ డాన్స్ ప్లస్ షో పుంజుకుంది అని అర్థం… ఇక్కడ యాంకర్ ప్రదీప్, రష్మి, శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, ప్రియమణి ఉన్నా సరే… ఓంకార్‌ను నిలువరించలేకపోయారు… చేతులెత్తేశారు…
Ads
ఒకసారి ఈ ఫెయిల్యూర్ కారణాల్లోకి వెళ్తే…. 1) రష్మికి జోడిగా వచ్చిన దీపికి పిల్లి అనే యాంకర్ దండుగ… నాట్ ఇంప్రెసివ్… 2) సుధీర్ మీద ఏదో తెలియని వివక్ష కనిపిస్తోంది… కావాలనే రష్మి-సుధీర్ నడుమ కామెడీ సన్నివేశాలను పెట్టడం లేదు… 3) గతంలో సుధీర్, ప్రదీప్, రష్మిలతో మంచి కామెడీ స్క్రిప్టు రాసేశారు… ఇప్పుడది లేదు… కామెడీలో పంచ్ లేదు… 4) జడ్జిగా పూర్ణ పూర్… 5) ఏవో నాలుగు సర్కస్ ఫీట్ల డాన్సులు చేయించి, జడ్జిలతో ఆహా ఓహో అనిపించి చేతులు దులుపుకోవడం ఎక్కువైంది… ఆ డాన్సులు మరీ నవ్వులాటగా మారిపోయాయి… 6) ప్రదీప్, సుధీర్ నడుమ వేవ్ లెంత్ ఏదో తేడా కొడుతోంది… 7) హైపర్ ఆది విసిగించేస్తున్నాడు …… ఇలా బోలెడు… ఇక తప్పనిసరై ఓంకార్ దెబ్బకు కదలక తప్పలేదు… కాన్సెప్ట్ బేస్డ్ సాంగ్స్ వైపు అడుగులు వేస్తున్నారు… అందులో భాగంగానే ఓల్డ్ సాంగ్స్ అనే థీమ్ తీసుకున్నారు… మరి ఒకేసారి వీళ్లు కిరాయికి తెచ్చిన డాన్సర్లు ఆ ఓల్డ్ సాంగ్స్ చేయలేరుగా… అందుకని ఇక జడ్జిలను, యాంకర్లను రంగంలోకి దింపి డాన్సులు చేయించారు… హహహ… నిజం… .
మళ్లీ రష్మి-సుధీర్ పాట పెట్టేశారు… ఆ జంటను ఇగ్నోర్ చేస్తే నష్టమేంటో తెలిసొచ్చినట్టుంది… ఆది, దీపిక డాన్సులు రాకపోయినా కష్టపడ్డారు… ఆకాశంలో హరివిల్లు అనే పాటకు ఓ అమ్మాయి డాన్స్ చేసింది… బాగుంది, కానీ అలవాటైన ప్రాణం కదా, సర్కస్ ఫీట్ల వాసన పూర్తిగా పోలేదు… శేఖర్ మాస్టర్ పూర్ణ, ప్రియమణిలతో పాత ఎన్టీయార్ పాట ‘‘ఆకుచాటు పిందె తడిసె…’’ డాన్స్ చేశాడు… నవ్వొచ్చింది… ఆమధ్య ఎవరో ఇద్దరు చంద్రముఖులను పెట్టి ‘రారా సరసకు రారా’ పాట చేయించాడు కదా… సేమ్, ఒక ఎన్టీయార్, ఇద్దరు శ్రీదేవిలు… కానీ ఏమాటకామాట సెట్లు మాత్రం ఇరగదీశారు… తప్పదు మరి, పోటీ ఉంటేనే సెగ… సెగ ఉంటేనే క్రియేటివిటీకి పని, గుర్తింపు… మొదటిసారి మల్లెమాల టీం కష్టపడుతోంది… మాటీవీ వాడు ఆ జబర్దస్త్ షోకు దీటుగా ఏదైనా చేస్తే బాగుండు… రోజా కూడా దారిలోకి వచ్చేది…!!
Share this Article