Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమెరికా డాలర్‌కు మరో కుదుపు… పెట్రో-డాలర్ ఒప్పందాలు క్లోజ్…

June 13, 2024 by M S R

నేటితో పెట్రో డాలర్ ఒప్పందానికి గడువు తీరిపోతుంది!
1972 లో అమెరికా సౌదీ అరేబియా ల మధ్య పెట్రో డాలర్ ఒప్పందo కుదిరింది.
ఒప్పందం ప్రకారం క్రూడ్ ఆయిల్ ను అమ్మడానికి, కొనడానికి కేవలం అమెరికన్ డాలర్ ను మాత్రమే వాడాలి.
అయితే దీనివల్ల ఎక్కువ లాభపడ్డది సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్ దేశాలు మాత్రమే.
అంతర్జాతీయంగా డాలర్ ఆధిపత్యానికి తెర తీసింది అనుకోవచ్చు !
అయితే 50 ఏళ్ల పాటు అమలులో ఉండే పెట్రో డాలర్ ఒప్పందం ఈ రోజుతో ముగిసిపోతుంది!

ప్రస్తుత సౌదీ రాజు పెట్రో డాలర్ ఒప్పందంను పొడిగించే ఉద్దేశ్యం లో లేడు!అమెరికా అద్యక్షుడు జో బీడెన్ తో సౌదీ రాజు కి ఉన్న అభిప్రాయ భేదాల వలన ఈ ఒప్పందం పొడిగింపు ఉండబోదు అని తెలుస్తున్నది!
రేపటి నుండి సౌదీ అరేబియా తన క్రూడ్ ఆయిల్ ను జపాన్ యెన్, చైనా RMB, EU యూరో లతో లావాదేవీలు జరపబోతున్నది.
క్రూడ్ ఆయిల్ మీద అమెరికా డాలర్ ఆధిపత్యం పోవడం వలన అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణుల అభిప్రాయం!

అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి అన్నిటి ధరలు పెరగవచ్చు .
డీ డాలరైజేషన్ ప్రక్రియ మొదలయ్యి ఇప్పటికే దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతున్నది.
ఓపేక్ దేశాలు ఇప్పటికే చైనా యువాన్ తొ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అందుకే చైనా తన డాలర్ రిజర్వ్ ను తగ్గించుకునే క్రమంలో అమెరికన్ ట్రెజరీ లో ఉన్న పెట్టుబడులను క్రమంగా అమ్మేస్తున్నది!
అమెరికా డాలర్ కి బదులుగా బంగారం ఇస్తుందా?

Ads

చైనా కి అమెరికా కి ఈ విషయంలో వివాదం మొదలయ్యే అవకాశం ఉంది!
ఎందుకంటే డాలర్ కి బదులుగా ఎలాంటి ప్రత్యామ్నాయం ఉండదు.
మన కరెన్సీ నోట్లు మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గ్యారంటీ ఉంటుంది అంటే రూపాయి చెల్లకపోతే ఆ విలువకి బంగారం ఇస్తుంది కానీ డాలర్ కి అలాంటి గ్యారంటీ ఏమీ ఉండదు!

దాదాపుగా 3 ట్రిలియన్ డాలర్ల విలువ చేసే ట్రెజరీ బాండ్స్ లో చైనా పెట్టుబడులు ఉన్నాయి!
డాలర్ విలువ పడిపోక ముందే ట్రెజరీ బాండ్స్ ను ఉపసంహరించుకుంటూ పోతున్నది చైనా!
ఈ రోజు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ ఇటలీ దేశ పర్యటనకి వెళ్ళారు G7 దేశాల సదస్సులో పాల్గొనడానికి!
భారత్ G7 సభ్య దేశం కాదు కానీ G7 సమ్మిట్ కి ఆతిధ్యం ఇస్తున్న ఇటలీ ప్రధాని జార్జియా మేలోనీ ప్రత్యేక ఆహ్వానం మీద మోడీ వెళ్ళారు!
ఈ రోజుతో పెట్రో డాలర్ ఒప్పందం ముగియడం, ప్రధాని నరేంద్ర మోడీ G7 సమ్మిట్ కి వెళ్ళడం మీద భారత్ ను G7 లోకి ఆహ్వానిస్తారా?
వేచి చూడాల్సిందే!….. (పార్థసారథి పోట్లూరి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘అనగనగా..’ ఓ సుమంతుడు… మరొక్కసారి అదే ఫెయిల్యూర్ అడుగు…
  • సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి అత్యంత కీలకమైన రాజ్యాంగ ప్రశ్నలు..!
  • అది సరే గానీ… మరి రేవంత్ రెడ్డి ఏమైపోతాడో చెప్పలేదేమిటి..?
  • ఫాఫం, తెలంగాణ వాళ్లు ఎవరూ దొరకడం లేదా సారూ..!!
  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions