.
ఓ ప్రచారచిత్రం కనిపించింది… అందులో హరిహర వీరమల్లు సినిమా కలెక్షన్లు 112.02 కోట్లు దాటినట్టుగా చూపిస్తున్నారు… పాయింట్ జీరో టు అని చూపించడం అంటే, మేం రియల్ కలెక్షన్లు చెబుతున్నాం సుమీ అని నమ్మేందుకన్నమాట…
సరే, ఇలాంటి ఫిగర్స్ అసలు కథేమిటో గతంలోనే దిల్ రాజు బహిరంగంగానే చెప్పినట్టు గుర్తు… ఐనా, నిజంగా హరిహర వీరమల్లు సిట్యుయేషన్ ప్రస్తుతం ఏమిటి అని లెక్కలు చూస్తే షాకింగ్… ఇది పాన్ ఇండియా సినిమా కదా, ముందు వేరే భాషల వివరాల్లోకి వెళ్తే…
Ads
పవన్ కల్యాణ్ పెద్దమ్మ భాష (హిందీ) బెల్టులో తెలుగు వెర్షన్ చాప్టర్ క్లోజ్… ఎంతకయ్యా అంటే… సాక్‌నిల్క్ లెక్క ప్రకారం మొదటి రోజు కేవలం లక్ష రూపాయలు… నిజమే, మీరు చదివింది… రెండురోజుల్లో అనేకచోట్ల తీసేశారు…
మన సౌత్ హీరోలు తీసి వదిలే ఏ సినిమానైనా హిందీ బెల్ట్ కళ్లకద్దుకుంటోందని ఎవరైనా అనుకుంటే, ఈ ఉదాహరణతో కళ్లు తెరుచుకోవాలి… దర్శకుడు జ్యోతికృష్ణ హిందీ వెర్షన్ మీద క్లారిటీ ఇస్తూ, ఇంకా హిందీ వెర్షన్ రిలీజ్ చేయలేదనీ, ఆగస్టు 1 తరువాత ఉంటుందని చెప్పాడు… దాని రిజల్ట్ చూడాలిక…
పవన్ కల్యాణ్‌కు ఇతర భాషల్లో పెద్దగా పరిచయం లేదు… కన్నడంలో ఈ సినిమా కలెక్షన్లు రెండు రోజుల్లోనూ లక్ష చొప్పున మాత్రమే… సో, అక్కడాా కొట్టేసింది దారుణంగా… ఈమధ్య సనాతన ధర్మపరిరక్షణ జెండా ఎత్తుకుని మధురైలో లార్డ్ మురుగన్ సదస్సులో పాల్గొన్నాడు కదా… ఈ సినిమా కూడా అదే కదా… ఐనాసరే, కలెక్షన్లు రెండు రోజులు, మూడు లక్షల చొప్పున మాత్రమే… అయిపాయె… మలయాళంలో రెండు రోజుల్లో 8 లక్షలు…
తెలుగులో..? రిలీజుకు ముందు ప్రీమియర్లు వేశారు కదా… పార్టీ యంత్రాంగం ఎంతో కష్టపడి, ప్రచారం చేసి, కొన్నిచోట్ల ఖర్చులూ భరిస్తే… 12.75 కోట్లు… రిలీజ్ ఫస్ట్ రోజున 34.65 కోట్లు… 75 నుంచి 80% యాక్యుపెన్సీ… మరుసటిరోజు ఒకేసారి 7.75 కోట్లకు పడిపోయింది… వీకెండ్ ఎలాగూ కొంత ఎక్కువగానే ఉంటుంది… సోమవారం నుంచి..? అదీ ఇప్పుడు నిర్మాత ఏఎం రత్నం బాధ…
రెండో రోజు వసూళ్ల వివరాలు తెలుగు వెర్షన్‌వి… గోదావరి జిల్లాల్లో కూడా పూర్ కలెక్షన్స్… ఈ జాబితాలో డెఫిసిట్ సెంటర్స్ లేవు, పైగా ఇవి జీఎస్టీ ఇన్‌క్లూజివ్… సెకండ్ పార్ట్ ఉంటుందని చెప్పడం కోసం… అసలు పోరాటాన్ని అర్థంతరంగా ఆపేశారు కదా క్లైమాక్స్‌లో… ఇక రెండో పార్ట్ ఉండకపోవచ్చు రత్నం మాటలను బట్టి..!! ఈ సినిమాకు పెద్ద మైనస్ నాసిరకం గ్రాఫిక్స్…
నిజానికి పవన్ కల్యాణ్ మీద తెలుగు ప్రేక్షకుల్లో ఉండే క్రేజును బట్టి చూస్తే ఈ కలెక్షన్లు ఆ రేంజ్ కాదు కదా, మరీ దిగదుడుపు… చివరకు అజ్ఞాతవాసికి కూడా మొదటి రోజే 60 నుంచి 70 కోట్ల కలెక్షన్ వచ్చింది… అదే పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఫస్ట్ రోజు ఎక్కువ కలెక్షన్లు వచ్చిన మూవీ… అప్పట్లో పవన్ కల్యాణ్ అంటే క్రేజ్ అది…
అత్తారింటికి దారేది సినిమా… అంటే 2013 ద్వితీయార్థంలో వచ్చిన ఆ సినిమా తర్వాత… పవన్ కళ్యాణ్ కు హిట్ అనే రేంజ్ సినిమా ఒక్కటి కూడా లేదు… 2014- 19 మధ్య వచ్చిన సినిమాలు… గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి…
2019 ఎన్నికల్లో పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన తర్వాత వచ్చిన సినిమాలు మూడు… వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో… ఈ మూడు సినిమాలు కూడా సో సో… ఇప్పుడు ఈ వీరమల్లు రిజల్ట్ చూస్తూనే ఉన్నాం… ఇంకోరెండు సినిమాలు ఓజీ, ఉస్తాద్ రిలీజ్ కావల్సి ఉన్నాయి…
నిజంగానే తను సినిమాలకు ఎక్కువ టైమ్ ఇవ్వలేడు, రాజకీయం- సినిమా రెండు పడవల మీద ప్రయాణం సాధ్యం కాదు… ఆ రెండు అయిపోయాక ఇక సినిమాల నుంచి విముక్తి అంటున్నాడు పవన్ కల్యాణ్… గుడ్ డెసిషన్…!! తనే చెప్పినట్టు… తన మంత్రి పదవి ప్లస్ జనసేనను సంస్థాగతంగా డెవలప్ చేసుకోవడం..! సరైన ఆలోచన..!!
Share this Article