.
నాలుగైదు రోజుల క్రితం వార్తే… ముందుగా అది చదవండి… క్రైం స్టోరీ… గుజరాత్… హిమాన్షు యోగేష్ భాయ్ పంచల్ తన పేరు… వయస్సు 26 ఏళ్లు… అహ్మదాబాద్ నివాసి…
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అధికారిని అనీ, సబర్ సెక్యూరిటీ సెల్‌లో పనిచేస్తున్నాననీ చెప్పుకునేవాడు… ఫేక్… ఈమేరకు నకిలీ ప్రొఫైల్స్ కూడా క్రియేట్ చేశాడు… తనకు బోలెడు ఆస్తులున్నాయని కూడా ప్రచారం చేసుకునేవాడు…
Ads
ఈమేరకు మేట్రిమోనియల్ సైట్లలో రిజిష్టర్ చేసుకునేవాడు… నచ్చిన యువతులతో కంటాక్టులోకి వెళ్లేవాడు… మాటలతో మెస్మరైజ్ చేసి, వాసాయి, ముంబై, అహ్మదాబాద్ హోటళ్లకు రప్పించేవాడు… పెళ్లి చేసుకుంటాననీ, మీరు నచ్చారనీ చెప్పేవాడు… కలిసిన మొదటిరోజే శారీరక సంబంధం కోసం ఒత్తిడి తెచ్చేవాడు…
వజ్రాల ఆభరణాలు ఇచ్చేవాడు బహుమతులుగా…. అవీ ఫేక్… తరువాత ఎమర్జెన్సీ అవసరం అంటూ డబ్బు వసూలు చేసేవాడు… చివరకు లైంగికంగా, ఆర్థికంగా దోపిడీ చేసి తరువాత కంటాక్టు కట్ చేసేవాడు… తరువాత మరో యువతి, ఇంకో యువతి… ఇలా పోలీసుల దృష్టికి వచ్చినవే 15 కేసులు… కొందరు పరువు పోతుందని భయపడి చెప్పుకోవడం లేదు…
ఫిబ్రవరి ఆరున మీరా రోడ్‌కు చెందిన 31 ఏళ్ల మహిళ ఊరుకోలేదు… వాలివ్ పోలీసులను ఆశ్రయించింది… వాసాయి, అహ్మదాబాద్‌లలోని రెండు హోటళ్లకు పిలిచి, మభ్యపెట్టి, ఓ నకిలీ వజ్రాల ఆభరణం ఇచ్చి, తన మీద అత్యాచారం చేశాడని ఆమె ఆరోపణ… (ఇష్టపూర్వకంగానే వాడితో సంభోగంలో పాల్గొన్నా సరే, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసగించి, లైంగికంగా వాడుకోవడం కూడా అత్యాచారం కిందకే వస్తుంది…)
వాలివ్ ఏసీపీ సచిన్ సనాప్ ఏమంటాడంటే…? ‘‘మంచి మాటకారి, తన పాలిష్ ఇంగ్లిషుతో నిజంగానే పోలీస్ అధికారిగా నమ్మించేవాడు యువతులను… ఐదు ఫోన్లు, యాపిల్ ల్యాప్‌టాప్ ఉండేవి ఎప్పుడూ తనతో… కాల్స్ కోసం కానీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు యూజ్ చేయడానికి గానీ హోటళ్ల ఫ్రీ వైఫై వాడుకునేవాడు… మా దర్యాప్తులో 15 కేసుల్లో యువతులు మోసపోయింది నిజమేనని తేలింది… అరెస్టు చేశాం…’’
అసలు ఏం జరుగుతోంది..? మస్తాన్ సాయి అనేవాడి క్రైం వార్త చదివాం కదా… అమ్మాయిల్ని లోబరుచుకుని, లైంగిక సంబంధాలు ఏర్పాటు చేసుకుని, సంభోగాన్ని వీడియో షూట్ చేసి, వాటిని చూపించి బ్లాక్‌మెయిల్ చేసేవాడని… వందల వీడియోలు… వాడి హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకుని, ఓపెన్ చేస్తే 499 వీడియోలు, 2500కు పైగా ఫోటోలు, 734 ఆడియో రికార్డింగులు ఉన్నాయి…
ఎలా పడిపోతున్నారు..? గుడ్డిగా, మూర్ఖంగా… పైన గుజరాత్ కేసు చూడండి… మేట్రిమోనియల్ సైటలో పరిచయం కాగానే, వాడు పిలవగానే హోటళ్లకు వెళ్లి వాడితో ఆ తొలి పరిచయంతోనే, నేరుగా సంభోగంలో పాల్గొనడం నిజంగా విస్తుపోయే నిజం… దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? మన సొసైటీలో ఏదో భయంకరమైన తేడా కొడుతోంది..!! ఒంటరిగా ఎలా వెళ్లారు..? తల్లిదండ్రులు ఒంటరిగా ఎలా పంపిస్తున్నారు..? ఆ ట్రాప్‌లోకి అంత మూర్ఖంగా ఎలా ఎంటరవుతున్నారు యువతులు..?!
Share this Article